రాయప్రోలు సుబ్రహ్మణ్యం

రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారు గొప్ప నటుడు. చిత్తూరులో శ్రీరామ విలాస సభలో చిత్తూరు వి.నాగయ్య నాటకాల్లో నటించినప్పుడు సుబ్రమణ్యంగారే దర్శకుడు. నాగయ్య గారికి నాడు గురువు. నాగయ్యగారు 'త్యాగయ్య' నిర్మించినప్పుడు (1946) రాయప్రోలు సుబ్రహ్మణ్యం, త్యాగయ్యకు గురువైన గ్రాంథి వెంకట రమణయ్య భగవతార్ పాత్రని నిర్వహించారు. స్వచ్ఛము, స్పష్టమూ అయిన ఉచ్చారణతో సద్గురువుగా నటించిన ఆ నటుడు ఎవరిని- అందరూ ప్రశ్నించుకునేవారు. సంగీతం, నటన నేర్చుకుని ఎన్నో నాటకాల్లో నటించారాయన. ఆయన ఆజానుబాహువు. మంచి కంఠం. ఎందరో నటీనటుల్ని తయారు చేశారు. నాగయ్య గారి కంటే ముందుగా చిత్రరంగంలో ప్రవేశించి, 'మాయాబజార్' (1936)లో దుర్యోధనుడు, 'భక్తమార్కండేయ'లో శంకరుడు, 'మైరావణ'లో రావణుడు, 'భూకైలాస్'లో శంకరుడు మొదలైన పాత్రలు ధరించారు. 'యోగివేమన' (1947)లో వేమనకు తత్త్వబోధ చేసిన శివయోగిగా సుబ్రహ్మణ్యంగారు నటించారు. ఆ పాత్ర చెప్పిన సంభాషణలు, గంభీరంగా మనోరంజకంగా వుంటాయి. తొలి నాటి చిత్రాలు గుర్తులేకపోయినా, త్యాగయ్య, వేమన చిత్రాల పాత్రలు రాయప్రోలు వారి ప్రతిభను సృష్టీకరిస్తాయి. బి.ఎన్.రెడ్డి గారి కళాత్మక చిత్రం 'మల్లీశ్వరి' (1951)లో పూజారి పాత్ర ముఖ్యమైనదే. ఆ పాత్రధారి సి.నాగేశ్వరరావు. అంటే సి.ఎస్.ఆర్. ఆంజనేయులు గారి తమ్ముడు. ఆయన మంచి నటుడే అయినా, ఆ జోలికి పోకుండా, దర్శకత్వ శాఖలోనే వుండి బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి గార్ల దగ్గర పనిచేశారు. కాని, వాహిని చిత్రాల్లో నటించారు. గుణసుందరి కథలోనూ, యోగివేమనలోనూ, నటించారు. 'మల్లీశ్వరి'లోని పాత్ర మాత్రం బాగా తెలిసిన పాత్ర. నటినటులందరూ, రంగస్థలం మీద నటకానుభవం గలవారే. సుస్పష్టంగా సంభాషణలు చెప్పడం వారికే సాధ్యమయేది. విజయ చిత్రాల తర్వాత, అక్కడ సహాయకుడిగా పనిచేసిన కె.బాబూరావు (తల్లిదండ్రులు, జరిగిన కథ మొ|| చిత్రాల దర్శకుడు) దర్శకుడైన తర్వాత, నాగేశ్వరరావు 'పెద్దదిక్కు'గా అక్కడ పనిచేశారు. ఆయన చాలా మితభాషి. సౌమ్యుడు. దేనికీ హడావుడి పడే వారు కాదు. కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర 'చంద్రహారం' 'గుండమ్మకథ' చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు.

రాయప్రోలు సుబ్రహ్మణ్యం
దస్త్రం:RayaproluSubrahmanyam.jpg
వృత్తిరంగస్థల నటుడు

రచనలు

మార్చు

డి.ఎల్.ఐలో అశోకుని ఎర్రగుడి శిలాశాసనములు గ్రంధప్రతి

మూలాలు

మార్చు