భూపతిరాజు సోమరాజు

కార్డియాలజిస్ట్

భూపతిరాజు సోమరాజు, ప్రసిద్ధి చెందిన గుండె వ్యాధి నిపుణుడు.ఇతను పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో సెప్టెంబరు 25, 1948లో జన్మించాడు. గ్రామంలోని ప్రాథమిక విద్యానంతరం, ఈయన గుంటూరు వైద్య కళాశాల నుండి 1970 లో వైద్య విద్యలో పట్టా పొందాడు.చదువులోనే కాకుండా ఆటలలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించాడు.1974 లో పి.జి.ఐ., చండీఘర్ నుండి ఎమ్.డి. తరువాత 1977లో డి.ఎమ్. (కార్డియాలజీ) సంపాదించాడు.

తరువాత ఆంధ్రప్రదేశ్ వైద్య సర్వీసులో కార్డియాలజీలో అసిస్టెంటు ప్రొఫెసర్ గా చేరాడు. ఉస్మానియా వైద్య కళాశాల, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో 1983 వరకు పనిచేశాడు.ఇతనికి వైద్య విద్యార్థులకు బోధించడం చాలా ఇష్టమైన విషయం.చాలా మంది విద్యార్థులు ఇతని నైపుణ్యానికి ముగ్ధులయ్యేవారు. నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేరాడు. నైపుణ్యత ఆధారంగా ఎన్.టి.రామారావు కాలంలో కార్డియాలజీ ప్రొఫెసరుగా 1987లో పదోన్నతి పొందాడు.

ప్రస్తుతం సోమరాజు కేర్ హాస్పిటల్ హెడ్, ఛైర్మన్.ఇతని ముఖ్యమైన ఉద్దేశం పేదవారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలకు అందజేయడం. ఈ సంస్థలో ఇంతవరకు ఇలాంటి సేవలు చాలా మందికి అందించి, ఉన్నతమైన సేవలందిస్తున్నాడు.

ఇతని సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు