ఆకివీడు

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా గ్రామం


ఆకివీడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలానికి చెందిన పట్టణం, మండలకేంద్రం.

పట్టణం
పటం
నిర్దేశాంకాలు: 16°36′00″N 81°23′00″E / 16.6°N 81.3833°E / 16.6; 81.3833
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి జిల్లా
మండలంఆకివీడు మండలం
విస్తీర్ణం
 • మొత్తం11.25 km2 (4.34 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం24,506
 • సాంద్రత2,200/km2 (5,600/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1048
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08816 Edit this on Wikidata )
పిన్(PIN)534235 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

చరిత్ర సవరించు

దస్త్రం:Akiveedu-1.jpg
ఆకివీడు పాత బస్టాండ్ సెంటరు

ఆకివీడు పట్టణంలో అందరూ వరి పంట ఎక్కువుగా పండిచేవారు. అందువలన ఒకానొక సమయంలో రాష్ట్రములోనే అత్యధికంగా బియ్యం మిల్లులు ఉండేవి. పరిసర ప్రాంతాలు అన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 1990లో చేపల, రొయ్యల పెంపకం జోరు అందుకుంది. ఆ తరువాత బియ్యం మిల్లులు తగ్గుముఖం పట్టాయి.

భౌగోళికం సవరించు

ఇది జిల్లా కేంద్రమైన భీమవరం నుండి పశ్చిమంగా 18 కి. మీ.దూరంలో ఉంది. ఆకివీడు సముద్ర తీరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని అక్షాంశ రేఖాంశాలు: 16°36'N,81°23'E.

జనగణన గణాంకాలు సవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6775 ఇళ్లతో, 24506 జనాభాతో 1125 హెక్టార్లలో విస్తరించి ఉంది. పట్టణంలో మగవారి సంఖ్య 11963, ఆడవారి సంఖ్య 12543.[2]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24259. ఇందులో పురుషుల సంఖ్య 12124, మహిళల సంఖ్య 12135, గ్రామంలో నివాసగృహాలు 5944 ఉన్నాయి.

పరిపాలన సవరించు

ఆకివీడు నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు సవరించు

సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల దుంపగడపలోను, ఇంజనీరింగ్ కళాశాల భీమవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఏలూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు భీమవరంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల దుంపగడపలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఏలూరు లోనూ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు సవరించు

జాతీయ రహదారి 165 (ఆంగ్లవికీవ్యాసం) పట్టణం గుండా పోతుంది. విజయవాడ నిడదవోలు శాఖా రైలు మార్గంలో ఈ ఊరు వుంది. ఇక్కడకి దగ్గరలోని విమానాశ్రయమువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం

భూమి వినియోగం సవరించు

ఆకివీడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 304 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 821 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 821 హెక్టార్లు
 • కాలువలు: 821 హెక్టార్లు

ఉత్సవాలు/జాతరలు సవరించు

ఆకివీడు పురవాస ప్రజలకు భక్తి, శ్రధ్ధలు ఎక్కువ. ప్రతీ ఏటా ఉత్సవాలను సంప్రదాయరీతిలో ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. అందులో ముఖ్యమైనవి

 • వీరభధ్రస్వామి సంబరం: ప్రతీ ఏటా మహాశివరాత్రి నాడు శంకరుడిని పూజిస్తూ శివాంశ సంభూతుడైన వీరభధ్రస్వామిని కొలుస్తూ సాలిపేటలో వెలసిన వీరభధ్రస్వామి గుడి దగ్గర సంబరాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయరీతిలో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది శివభక్తులు శివశూలాలను దవడ మీద గుచ్చుకుని ఎడ్లబండ్ల మీద ఊరంతా తిరుగుతారు. ఈ సంబరాన్ని చూడటానికి రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. శివరాత్రినాడు రాత్రి జరిగే "నిప్పుల సంబరం" ప్రత్యేక ఆకర్షణ. ఈ "నిప్పుల సంబరం"లో పాల్గొనాలనుకునే శివభక్తులు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. అలా ఉన్న భక్తులు మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిప్పులు మీద నడవగలరని ఒక విశ్వాసం. ఈ సంబరంలో ఏదో విధంగా పాల్గొన్న వారికి ఆ సంవత్సరం అంతా బాగా నడుస్తుందని విశ్వాసం.
 • సుబ్రహ్మణ్యస్వామి షష్టి: సుబ్రహ్మణ్యస్వామి షష్టిని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వకాలంలో చాలా వైభవంగా జరిగేది. ఊరులోని జనమంతా ఆ జాతరలోనే సమయం గడిపేవారు.
 • దేశాలమ్మ సంబరం

పర్యాటక ఆకర్షణలు సవరించు

 • కొల్లేరు సరస్సు - రాష్ట్రంలో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు
 • కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం.
 • కొల్లేరు పెద్దింట్లమ్మవారి మందిరం
 • గాంధీ పార్క్
 • సర్ అర్ధర్ కాటన్ మెమోరియల్ పార్కు

గ్రామ ప్రముఖులు సవరించు

ఉత్పత్తి సవరించు

వరి

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

 1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=ఆకివీడు&oldid=3844437" నుండి వెలికితీశారు