జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె3

(భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎంకె III నుండి దారిమార్పు చెందింది)

జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించి, అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ వాహక నౌక. ఈ నౌకను కొన్నాళ్ళపాటు లాంచ్ వెహికిల్ మార్క్3 అని కూడా పిలిచారు. ఎల్‌విఎమ్‌3. భూ స్థిర ఉపగ్రహాలను ప్రయోగించేందుకు, మానవసహిత యాత్రలను జరిపేందుకు ఇస్రో ఈ వాహనాన్ని ఉద్దేశించింది. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజను కలిగిన ఈ నౌక 4 టన్నుల పేలోడ్‌ను భూ స్థిర బదిలీ కక్ష్యకు చేర్చే సామర్థ్యం కలిగి ఉంటుంది.[10][11][12]

ఎల్‌విఎమ్‌3 (జిఎస్‌ఎల్‌వి - ఎమ్‌ కె III)

భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వాహనం III మోడల్
విధి మీడియం లిఫ్ట్ ప్రయోగ వాహనం
తయారీదారు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
దేశము భారత దేశము
పరిమాణము
ఎత్తు 43.43 మీ. (142.5 అ.)
వ్యాసము 4.0 మీ. (13.1 అ.)
ద్రవ్యరాశి 630,000 కి.గ్రా. (1,390,000 పౌ.)
దశలు 3
సామర్థ్యము
LEO
కు పేలోడు
10,000 కి.గ్రా. (22,000 పౌ.)
GTO
కు పేలోడు
4,000 కి.గ్రా. (8,800 పౌ.)-5,000 కి.గ్రా. (11,000 పౌ.)[1]
ప్రయోగ చరిత్ర
స్థితి Launch Rehearsal[2]
ప్రయోగ స్థలాలు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
బూస్టరు దశ - S-200
పొడవు 21.9 మీ. (72 అ.)[3]
వ్యాసం 3.2 మీ. (10 అ.)[3]
ఇంజన్లు 2 ఘన
థ్రస్టు 5,150 కి.N (525 tf) each[3][4][5]
Specific impulse 227 (sea level)
274.5 (vacuum)[3]
మండే సమయం 130 సె[4]
ఇంధనం ఘన
కోర్ దశ - L-110
పొడవు 17 మీ. (56 అ.)[6]
వ్యాసం 4 మీ. (13 అ.)[6]
ఇంజన్లు 2 వికాస్
థ్రస్టు 140 tf (1,400 కి.N)*[6][7]
Specific impulse 281 sec [6]
మండే సమయం 200 సె[7]
ఇంధనం UH 25/N2O4[8]
అప్పర్ దశ - C-25
ఇంజన్లు 1 సిఈ-20
థ్రస్టు 200 కి.N (20 tf)[9]
Specific impulse 450 sec
మండే సమయం 580 సె
ఇంధనం ఎల్‌ఓఎక్స్/ఎల్‌హెచ్2

చరిత్ర

జిఎస్ఎల్వి ఎంకె3 ప్రాజెక్టును 2000 సంవత్సరంలో మొదలు పెట్టారు. 2009-2010 లో తొలి ప్రయోగం చెయ్యాలనే ప్రణాళికతో ఈ ప్రాజెక్టు మొదలైంది.[13] అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమంలో జాప్యం జరిగింది. ఇస్రో అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఉన్నత దశ 2010 ఏప్రిల్ 15 న విఫలమవడం ఈ కారణాల్లో ఒకటి.[14]

2014 డిసెంబరు 18 న జిఎస్ఎల్వి ఎంకె3 యొక్క సబ్ ఆర్బిటాల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. పేలోడ్, కక్ష్యలో ఒక్క పూర్తి పరిభ్రమణం కూడా చెయ్యకుండా తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించడాన్ని సబ్ ఆర్బిటాల్ యాత్ర అంటారు. మానవ సహిత యాత్రలకు ఉపయోగించబోయే క్రూ మాడ్యూల్‌ను ఈ యాత్రలో పరీక్షించారు.[15] మొదటి ఆర్బిటాల్ యాత్ర 2017 లోను, [16] తొలి మానవ సహిత యాత్ర 2020 తర్వాతా జరగవచ్చని అంచనా.[14]

ఎస్-200 స్థావర పరీక్ష

2010 జనవరి 24న ఎస్-200 ఘన ఇంధన రాకెట్ బూస్టర్‌ను విజయవంతంగా పరీక్షించారు. బూస్టర్‌ను 130 సెకండ్లు మండించగా, దాదాపు 500 టన్నుల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేసింది. పర్యవేక్షించిన 600 పారామితులన్నీ సాధారణ పనితీరును కనబరచాయి. 2011 సెప్టెంబరు 4 న రెండవ స్థావర పరీక్షను కూడా విజయవంతంగా నిర్వహించారు.[4]

ఎల్-110 స్థావర పరీక్ష

ఎల్110 కోర్ యొక్క మొదటి స్థావర పరీక్షను లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పిఎస్‌సి) లో 2010 మార్చి 5న నిర్వహించారు. ఇంజనును 200 సెకండ్ల పాటు మండించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఒక నియంత్రణ వ్యవస్థలో లీకేజీ జరగడంతో పరీక్షను 150 సెకండ్ల వద్ద ముగించారు.[17] మళ్ళీ 2010 సెప్టెంబరు 8 న విజయవంతంగా పరీక్షించారు.[18]

క్రయోజెనిక్ ఇంజను పరీక్ష

జిఎస్‌ఎల్‌వి3 యొక్క మూడవ దశ కోసం ఇస్రో ఓ కొత్త, శక్తివంతమైన క్రయోజెనిక్ ఇంజన్ CE-20 ని అభివృద్ధి చేస్తోంది. ఈ ఇంజను దాదాపు 2 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జిఎస్‌ఎల్‌విలో వాడిన ఇంజను సామర్థ్యం 1 మెవా. CE20 ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అప్పర్ స్టేజి క్రయోజెనిక్ ఇంజన్లలో ఒకటి.[19]

2015 ఏప్రిల్ 28 న ఈ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించారు. మహేంద్రగిరి లోని ప్రొపల్షన్ కాంప్లెక్సులో నిర్వహించిన ఈ పరీక్ష 635 సెకండ్ల పాటు జరిగింది. అన్ని పరామితులూ సంతృప్తికరంగా ఉన్నాయి. ఈ పరీక్షకు ముందు నాలుగు స్వల్ప వ్యవధి పరీక్షలు- 5.5, 7.5, 20, 30 సెకండ్ల పాటు - జరిగాయి.

2016 ఫిబ్రవరి 19 న CE-20 హాట్ టెస్ట్ జరిగింది. 640 సెకండ్ల పాటు జరిగిన ఈ పరీక్షలో ఇంజను, అన్ని ఉపవ్యవస్థలతో సహా తన సామర్థ్యాన్ని తిరిగి ప్రదర్శించింది.[20] 2016 డిసెంబరులో జిఎస్‌ఎల్‌వి3 మొదటి డెవలప్‌మెంటల్ ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్ చెప్పాడు.[21]

సబ్ ఆర్బిటాల్ యాత్ర

సబ్‌ ఆర్బిటాల్ యాత్రకు సిద్ధంచేసిన ఎల్‌విఎమ్3 (జిఎస్‌ఎల్‌వి3) నౌక యొక్క కూర్పు కింది విధంగా ఉంది.

  • మొదటి దశ: ఎస్ 200 సాలిడ్ రాకెట్ బూస్టర్లు (ఘన ఇంధనం)
  • రెండవ లేదా కోర్ దశ: ఎల్100 లిక్విడ్ (ద్రవ ఇంధనం)
  • మూడవ దశ లేదా క్రయోజెనిక్ దశ: అయితే ఈ ప్రయోగంలో ఇంజను పని చెయ్యకుండా, డమ్మీగా ఉంచారు.
  • పేలోడ్: 3.7 టన్నుల బరువైన క్రూ మాడ్యూల్ ను పేలోడ్ గా ఉంచారు. భవిష్యత్తులో చెయ్యబోయే మానవ సహిత యాత్రలకు ఈ మాడ్యూల్ ను ఉపయోగిస్తారు. ఈ యాత్రలో దీని వాతావరణ పునఃప్రవేశాన్ని పరీక్షించారు. ఈ పరీక్షను క్రూ మాడ్యూల్ ఎట్మాస్ఫెరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ (CARE) అని పిలిచారు.

యాత్ర మొదలైన 5 నిముషాల తరువాత, 126 కిమీ ఎత్తున రాకెట్, క్రూ మాడ్యూలును అంతరిక్షంలోకి నెట్టివేసింది. ఆ పైన మాడ్యూలు, దానిలో ఉన్న మోటార్లు నియంత్రిస్తూండగా, వేగంగా కిందికి దిగడం మొదలుపెట్టింది. 80 కిమీ ఎత్తున థ్రస్టర్లను ఆపేసారు. మాడ్యూలు బాలిస్టిక్ పథంలో ప్రయాణిస్తూ వాతావరణ పునఃప్రవేశం చేసింది. ఈ దశలో మాడ్యూల యొక్క ఉష్ణ కవచం (హీట్‌షీల్డు) 1600 °సెం ఉష్ణోగ్రతకు గురౌతుంది. 15 కిమీ ఎత్తున మాడ్యూల యొక్క ఎపెక్స్ కవరును తొలగించి పారాచూట్లను నియోగించారు. అండమాన్ నికోబార్ దీవుల వద్ద క్రూ మాడ్యూలు బంగాళాఖాతంలో దిగింది[22][23][24]

వాహనం వివరణ

మొదటి దశ - ఘన బూస్టర్లు

ఎల్‌విఎమ్‌3 మొదటి దశలో రెండు 'ఎస్-200' ఘన ఇంధన బూస్టర్లను ఉపయోగిస్తుంది. ఒక్కో బూస్టర్ 3.2 మీటర్ల వ్యాసం, 25 మీటర్ల పొడవు కలిగి, 200 టన్నుల ప్రొపెల్లెంట్ కలిగి ఉంటుంది. ఈ బూస్టర్లు 130 సెకన్ల పాటు మండి 5,150 కిలోన్యూటన్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తాయి.[3] S200 బూస్టర్లు తయారు చేసేందుకు శ్రీహరికోట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఎస్-200 నాజిల్‌కు జింబాల్ ఏర్పాటు ద్వారా రాకెట్ రోల్, యా లను నియంత్రిస్తారు.[25] పిఎస్‌ఎల్‌వి మొదటి దశలో ఈ నియంత్రణను సెకండరీ ఇంజెక్షన్ థ్రస్ట్ వెక్టర్ కంట్రోల్ సిస్టమ్ (SITVC) ద్వారా చేస్తారు.

బూస్టర్ల నుండి వచ్చే థ్రస్టు తగ్గుముఖం పట్టినట్లుగా రాకెట్‌లోని సెన్సర్లు గుర్తించగానే రెండవ దశ ‘L110’ లోని రెండు వికాస్ ఇంజన్లను మండిస్తాయి. S200 బూస్టర్లు విడిపోయి పడిపోయే లోగా అవి, వికాస్ ఇంజన్లు కలిసి కొంత సేపు పనిచేస్తాయి.[25]

రెండవ దశ - లిక్విడ్ మోటారు

ఎల్-110 గా పిలిచే కోర్ దశ లేదా రెండవ దశ 4 మీటర్ల వ్యాసంతో, 110 టన్నుల ప్రొపెల్లెంట్ కలిగి ఉంటుంది. ఇది భారత్ తయారుచేసిన క్లస్టర్ డిజైన్ కలిగిన మొదటి ద్రవ ఇంధన ఇంజను. ఇది మెరుగుపరచిన రెండు వికాస్ ఇంజిన్లను ఉపయోగిస్తుంది.[6][7] ప్రతి ఇంజను 700 కిలోన్యూటన్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. యుహెచ్ 25 (75% యుడిఎంహెచ్ బర్నింగ్, 25% (హైడ్రాజిన్ను), N2O4 వాడుతుంది.[8] ఈ వికాస్ ఇంజిన్ రీజనరేటివ్ కూలింగ్ వ్యవస్థను వాడి మెరుగైన స్పెసిఫిక్ ఇంపల్స్‌ అందిస్తుంది.[26] ఎల్-110 కోర్ దశ ప్రయాణం మొదలైన 113 సెకండ్ల తర్వాత మొదలై 200 సెకండ్ల పటు మండుతుంది.[7]

మూడవ దశ - క్రయోజెనిక్ ఉన్నత దశ

సి-25 గా పిలవబడే క్రయోజెనిక్ ఉన్నత దశలో భారత్ తయారుచేసిన సిఇ-20 క్రయోజెనిక్ ఇంజన్ను వాడుతారు. ఇంధనంగా LH2 ను ఆక్సీకరణిగా LOX ను వడుతుంది. ఇది 186 కిన్యూ థ్రస్టును ఉత్పత్తి చేస్తుంది. సి-25 4 మీటర్ల వ్యాసం, 13.5 మీటర్ల పొడవు కలిగి, 25 టన్నుల ప్రొపెల్లెంట్‌ను వాడుతుంది.[27]

2016 ఫిబ్రవరి 19 న జరిగిన పరీక్ష విజయవంతమవడంతో సిఇ-20 ఇంజను జిఎస్‌ఎల్‌వితో సంఘటితం చేసేందుకు మరో ముదడుగు వేసింది. జిఎస్‌ఎల్‌వి మొదటి దెవలప్‌మెంట్ ప్రయోగం 2016 డిసెంబరులో గానీ[21], 2017 మొదట్లో గానీ చేసేఅవకాశం ఉంది.[28]

పేలోడ్ ఫెయిరింగ్

పేలోడ్ ఫెయిరింగ్ 5 మీటర్లు (16 అడుగులు) వ్యాసంతో 100 క్యూబిక్ మీటర్ల పేలోడ్ వాల్యూమ్ (3,500 క్యూ ఆ) కలిగి ఉంటుంది.[1]

ప్రయోగం

అనుకున్నట్లుగానే భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ని 2014 సం., డిసెంబరు నెల, 18 వ తారీఖు ఉదయం 9.30 గం.లకు ఆంధ్ర ప్రదేశ్ శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు. క్రూమాడ్యూల్ అండమాన్ దగ్గర, బంగాళాఖాతంలో విజయవంతముగా దిగింది. భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III విజయవంత మయిందని, అంతరిక్ష ప్రయోగాలలో ఇది గుర్తుంచుకోదగిన రోజు అనీ ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ చెప్పాడు. ఇస్రో ఈ విజయంతో మానవ సహిత యాత్ర దిశలో ముందడుగు వేసింది.

ప్రారంభ చరిత్ర

ఫ్లైట్ నంబర్ తేదీ / సమయం ( UTC ) రాకెట్,

కాన్ఫిగరేషన్

లాంచ్ సైట్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ) పేలోడ్ పేలోడ్ మాస్ కక్ష్య వినియోగదారు ప్రయోగ

ఫలితం

X 2014 డిసెంబరు 18

04:00

LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీ-ఎంట్రీ ప్రయోగం (CARE) 3,775 kg (8,322 lb) ఉప కక్ష్య ఇస్రో విజయం
నాన్-ఫంక్షనల్ క్రయోజెనిక్ స్టేజ్‌తో సబ్-ఆర్బిటల్ డెవలప్‌మెంట్ టెస్ట్ ఫ్లైట్
D1 2017 జూన్ 5

11:58

LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ GSAT-19 3,136 కిలోలు (6,914 పౌండ్లు) GTO ఇన్సాట్ విజయం
ఫంక్షనల్ క్రయోజెనిక్ దశతో మొదటి కక్ష్య పరీక్ష ప్రయోగం
D2 2018 నవంబరు 14

11:38

LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ GSAT-29 3,423 kg (7,546 lb) GTO ఇన్సాట్ విజయం
రెండవ కక్ష్య పరీక్షా విమానం. L110 కోర్ అధిక థ్రస్ట్‌తో అప్‌గ్రేడ్ చేసిన వికాస్ ఇంజిన్‌లను ఉపయోగించింది.
M1 2019 జూలై 22

09:13

LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ చంద్రయాన్-2 3,850 కిలోలు (8,490 పౌండ్లు) EPO ఇస్రో విజయం
GSLV MK-III యొక్క మొదటి కార్యాచరణ విమానం.
M2 2022 అక్టోబరు 22

18:37:40

LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ OneWeb × 36 5,796 కిలోలు (12,778 పౌండ్లు) LEO OneWeb విజయం
OneWeb కోసం GSLV Mk III (LVM3) యొక్క మొదటి వాణిజ్య ప్రయోగం .  605 km వృత్తాకార ధ్రువ కక్ష్యకు 36 OneWeb ఉపగ్రహాల ప్రయోగం. ఇప్పటి వరకు GSLV Mk III (LVM3), ISRO ద్వారా ప్రయోగించబడిన అత్యంత బరువైన పేలోడ్ ఇది[29].

ప్రణాళికాబద్ధమైన తదుపరి ప్రయోగాలు

తేదీ / సమయం ( UTC ) రాకెట్,

కాన్ఫిగరేషన్

లాంచ్ సైట్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ) పేలోడ్ కక్ష్య
2023 ఫిబ్రవరి LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ OneWeb × 36 (~5400 kg) LEO
OneWeb కోసం GSLV Mk III (LVM3) యొక్క రెండవ వాణిజ్య ప్రయోగం, ఫ్లైట్ M3గా పేర్కొనబడింది.
2023 జూన్ LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ చంద్రయాన్-3 TLI
చంద్ర ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్-2 యొక్క మిషన్ పునరావృతం .
TBD (తేదీ నిర్ణయం చేయాలి) LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ GSAT-20 (CMS-03) GTO
2023/2024 చివరిలో LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ G1 LEO
భారతదేశ సిబ్బంది మాడ్యూల్ యొక్క మొదటి సిబ్బంది లేని కక్ష్య ప్రదర్శన విమానం.
2024 LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ G2 LEO
సిబ్బంది మాడ్యూల్ యొక్క రెండవ అన్‌క్రూడ్ ఆర్బిటల్ ప్రదర్శన.
2024 LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ H1 LEO
భారతదేశం యొక్క మొదటి సిబ్బంది మిషన్. సర్వీస్ మాడ్యూల్‌తో లాంచ్ మాస్ 7,800 kg (17,200 lb),  క్యాప్సూల్ ద్రవ్యరాశి 3,735 kg.
2024 డిసెంబరు LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ శుక్రయాన్-1 TBD
ప్రయోగ ద్రవ్యరాశి 2,500 కిలోలు; వీనస్ ఆర్బిటర్, వాతావరణ బెలూన్.
2024 LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ మంగళయాన్ 2 TBD
అంగారక గ్రహానికి భారతదేశం యొక్క రెండవ ఆర్బిటర్ మిషన్.
TBA (తేదీ నిర్ణయం ప్రకటించాలి) LVM 3 రెండవ లాంచ్ ప్యాడ్ GSAT-22 GTO

సరిపోలే రాకెట్లు

  • అంగార ఎ3
  • ఏరియన్5
  • అట్లాస్ వి
  • డెల్టా 4
  • ఫాల్కన్ 9
  • హెచ్-IIఎ
  • లాంగ్‌మార్చి 3బి
  • టైటన్ IIIసి

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. 1.0 1.1 "The GSLV-III". Indian Space Research Organisation. 2009-12-07. Archived from the original on 2012-11-25. Retrieved 2012-11-23.
  2. "GSLV Mark-III launch rehearsal to begin tonight". Science and Technology Section. The Times of India. 14 December 2014. Retrieved 15 December 2014.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "ISRO Press Release: S200 First Static Test (S-200-ST-01)" (PDF). Archived from the original (PDF) on 2013-03-11. Retrieved 2014-12-18.
  4. 4.0 4.1 4.2 "Isro successfully tests world's 3rd largest solid booster". dna. Retrieved 4 October 2014.
  5. "India to test world's third largest solid rocket booster". Science and Technology Section. The Hindu News Paper. 2009-12-07. Retrieved 2009-12-07.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 "GSLV Mk3". Space Launch Report. Retrieved 23 October 2014.
  7. 7.0 7.1 7.2 7.3 "L110 test to follow S200". IndianSpaceWeb. Archived from the original on 14 జూలై 2019. Retrieved 15 October 2014.
  8. 8.0 8.1 "ISRO tests Vikas engine". The Hindu. Retrieved 15 October 2014.
  9. "LPSC Handouts at Aer India-2009". Specifications of CE-20. Liquid Propulsion Systems Centre. 2009-03-13. Archived from the original on 2018-01-18. Retrieved 2009-08-29.
  10. "Indian Space Research Organisation preparing for three more PSLV launches". English: The Hindu. 2011-04-29. Retrieved 15 July 2011.
  11. [1] [dead link]
  12. "GSLV MkIII, the next milestone : Interview: K. Radhakrishnan". 2014-02-07. Retrieved 2014-01-30.
  13. "India's GSLV Mk-3 First Flight Pushed Back to April 2014". Sawfnews.com. 2013-04-05. Archived from the original on 2013-04-10. Retrieved 2013-04-28. The launcher was initially expected to become operational by 2010/2011 with first flight in 2009-10.
  14. 14.0 14.1 "India's GSLV Mk-3 First Flight Pushed Back to April 2014". Sawfnews. 4 April 2013. Archived from the original on 10 ఏప్రిల్ 2013. Retrieved 18 డిసెంబరు 2014.
  15. "ISRO inches closer to manned mission". Timesofindia.indiatimes.com. 2014-01-10. Archived from the original on 2014-01-12. Retrieved 2014-01-10. We will be checking the crew capsule for all parameters.
  16. "Now, ISRO Well on Course to Test Giant Rocket GSLV Mk-III". The New Indian Express. Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 4 October 2014.
  17. "ISRO successfully conducts static testing of new age rocket". The Hindu. Retrieved 4 October 2014.
  18. "ISRO Press Release:Successful Static Testing of L 110 Liquid Core Stage of GSLV - Mk III". Archived from the original on 2014-02-02. Retrieved 2014-12-18.
  19. "హై థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజను అభివృద్ధి". Archived from the original on 2016-08-08. Retrieved 2016-08-03.
  20. "CE-20 పరీక్ష విజయవంతం". Archived from the original on 2016-08-03. Retrieved 2016-08-03.
  21. 21.0 21.1 2016 డిసెంబరులో ప్రయోగానికి ఏర్పాట్లు
  22. As it happened: Isro's launch of India's heaviest rocket Times of India 18 December 2014
  23. Sangeetha Kandavel. "GSLV Mark III takes to the skies in test flight". The Hindu.
  24. "Isro to test GSLV Mk-III, crew module on December 18". The Times of India. Retrieved 11 December 2014.
  25. 25.0 25.1 http://www.thehindu.com/todays-paper/tp-features/tp-sci-tech-and-agri/gslv-mark-iii-faces-its-first-experimental-flight/article6660089.ece
  26. "Space Transportation". GSLV - Mk III - Status of CE-20. Indian Space Research Organisation. 2009-07-15. Archived from the original on 2009-07-26. Retrieved 2009-09-15.
  27. "Space Transportation". GSLV - Mk III - Status of CE-20. Indian Space Research Organisation. 2009-07-15. Archived from the original on 2009-07-26. Retrieved 2009-09-05.
  28. Anil Wanvari. "India has 833 private TV channels". Indiantelevision.com. Retrieved 4 October 2014.
  29. "ISRO's dedicated commercial satellite mission LVM3-M2/OneWeb India-1 lifts off". The Indian Express (in ఇంగ్లీష్). 2022-10-23. Retrieved 2022-10-26.

బయటి లింకులు