భేతాళుడు 2016 లో విడుదలైన తమిళ అనువాద తెలుగు చిత్రం. తమిళ చిత్రం సైతాన్ కు ఇది తెలుగు అనువాద సినిమా.[2]

భేతాళుడు
దర్శకత్వంప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
రచనసుజాత రంగరాజన్
ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
జో డి క్రజ్
కార్తీక్ కృష్ణ
నిర్మాతఫాతిమా విజ‌య్ ఆంటోని
తారాగణం
ఛాయాగ్రహణంప్రదీప్ కలిపురయత్
కూర్పువీర సెంధిల్ రాజ్
సంగీతంవిజ‌య్ ఆంటోని
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఆరా సినిమాస్
విడుదల తేదీ
1 డిసెంబరు 2016 (2016-12-01)
సినిమా నిడివి
123 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్10 crore (US$1.3 million)
బాక్సాఫీసు45 crore (US$5.6 million)

దినేష్‌ (విజ‌య్ ఆంటోని) ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో వ‌ర్క్ చేస్తుంటాడు. అనాథ అయిన ఐశ్వ‌ర్య‌ (అరుంధ‌తిరాయ్‌) ను పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉంటున్న దినేష్ జీవితంలో అనుకోని మార్పులు సంభ‌విస్తాయి. ఎవ‌రో త‌న‌ను పిలుస్తున్న‌ట్లు, చనిపొమ్మ‌ని ప్రేరేపిస్తున్న‌ట్టు దినేష్ అనుభూతిచెందుతాడు. ముందుగా ఈ విష‌యాన్ని త‌న కుటుంబ స‌భ్యుల‌తో దినేష్ చెప్ప‌డు. కానీ దినేష్ ప్ర‌వ‌ర్త‌న‌తో చుట్టు ప‌క్క‌ల ఉండేవారు ఇబ్బంది ప‌డుతుంటారు. కొన్ని రోజుల‌కు దినేష్ త‌న ప‌రిస్థితిని త‌ల్లికి, భార్య‌కు చెబుతాడు. ఓ మానసిక వైద్యుడిని క‌లిసి త‌న‌కు ఎదువుతున్న అనుభ‌వాల‌ను వివ‌రిస్తాడు. అప్పుడు వైద్యుడు, దినేష్‌ను వశీకరణ చేసి త‌న గ‌త జీవితం గురించి ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెడ‌తాడు. అప్పుడు జ‌య‌ల‌క్ష్మి గురించి దినేష్ వైద్యుడుకు చెబుతాడు. ఇంత‌కు జ‌య‌ల‌క్ష్మి ఎవ‌రు? అస‌లు దినేష్‌కు వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డానికి కార‌ణం ఎవ‌రు? శ‌ర్మ ఎవ‌రు? శ‌ర్మ‌కు, దినేష్‌కు ఉన్న సంబంధం ఏమిటి? దినేష్ స‌మ‌స్య‌ల‌కు ఐశ్వ‌ర్య‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఇంత‌కు భేతాళుడు ఎవ‌రు? అనే విష‌యాలు మిగిలిన కథలో భాగం.[3]

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • బ్యాన‌ర్ : మాన‌స రిషి ఎంట‌ర్‌ప్రైజెస్‌, విన్ విన్ విన్ క్రియేష‌న్స్‌, విజ‌య్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేష‌న్
  • స‌మ‌ర్ప‌ణ : ఫాతిమా విజ‌య్ ఆంటోని
  • సంగీతం : విజ‌య్ ఆంటోని
  • సినిమాటోగ్ర‌ఫీ : ప్ర‌దీప్ క‌లిపుర‌య‌త్‌
  • ఎడిటింగ్ : వీర సెంథిల్ రాజ్‌
  • మాట‌లు, పాట‌లు : భాష్య శ్రీ
  • నిర్మాత : ఫాతిమా విజ‌య్ ఆంటోని
  • ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి

మూలాలు

మార్చు
  1. "Saithan (12A)". British Board of Film Classification. 16 November 2016. Retrieved 16 November 2016.
  2. 2.0 2.1 http://www.newindianexpress.com/entertainment/review/2016/dec/02/saithan-review-a-semi-inspired-performance-of-a-novel-adapted-to-the-big-screens-1544923.html
  3. http://telugu.greatandhra.com/movies/reviews/bethaludu-movie-review-76299.html

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=భేతాళుడు&oldid=4375611" నుండి వెలికితీశారు