ఆరవ్
ఆరవ్ (జననం 1990 అక్టోబరు 31), తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటుడు, మోడల్. విజయ్ ఆంటోనీ నటించిన సైతాన్ (2016) చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసాడు. ఆ తరువాత, కమల్ హాసన్ హోస్ట్ చేసిన తమిళ రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ మొదటి సీజన్ గెలుచుకుని ఆయన ప్రసిద్ధి చెందాడు.[1]
ఆరవ్ | |
---|---|
జననం | నఫీజ్ కిజార్ నాగర్‌కోయిల్, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | నటుడు, మోడల్ |
క్రియాశీలక సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
భార్య / భర్త | రాహేయ్ (m. 2020) |
పిల్లలు | 2 |
కెరీర్
మార్చుదక్షిణ తమిళనాడు నాగర్‌కోయిల్ లో 1990 అక్టోబరు 31న నఫీజ్ కిజార్ గా ఆరవ్ జన్మించాci. అతని తండ్రి తిరుచ్చి ప్రభుత్వ న్యాయ కళాశాల ప్రొఫెసర్ గా పనిచేసాడు. తిరుచ్చిలోని కమలా నికేతన్ మాంటిస్సోరి పాఠశాలలో ఆయన చదువుకున్నాడు. ఆ తరువాత, ఆయన చెన్నైకి వెళ్ళి హిందూస్తాన్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసాడు[2]
మణిరత్నం రూపొందించిన ఓ కాదల్ కన్మణి (2015)లో దుల్కర్ సల్మాన్ పాత్రకు సహచరుడిగా ఆయన కనిపించాడు.[3] ఆ తరువాత, ప్రదీప్ కృష్ణమూర్తి సైకలాజికల్ థ్రిల్లర్, సైతాన్ (2016)లో విజయ్ ఆంటోనీ, అరుంధతి నాయర్ లతో కలిసి ప్రతికూల సహాయక పాత్రను పోషించాడు. భయానక చిత్రం మీండుమ్ వా అరుగిల్ వా (2017) లో ఆయన పోలీసు అధికారి ప్రధాన పాత్రలో కనిపించాడు.[4][5][6]
2017లో కమల్ హాసన్ హోస్ట్ చేసిన టెలివిజన్ షో బిగ్ బాస్ లో ఆరవ్ పాల్గొన్నాడు. మొదటి రోజున ఇంట్లోకి ప్రవేశించిన ఆయన వంద రోజులు హౌజ్ లో నిలదొక్కుకుని మొదటి సీజన్ విజేతగా నిలిచాడు.[7][8]
వ్యక్తిగత జీవితం
మార్చుసెప్టెంబరు 2020లో నటి రహీని వివాహం చేసుకున్నాడు.[9] వారికి నవంబరు 2021లో ఒక కుమారుడు, అక్టోబరు 2023లో ఒక కుమార్తె జన్మించారు.[10][11]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
2015 | ఓ కాదల్ కన్మణి | ఆది సహ ఉద్యోగి | తెలుగులో ఓకే బంగారం గా విడుదలైంది |
2016 | సైతాన్ | నటరాజ్ | తెలుగులో భేతాళుడు గా విడుదలైంది |
2019 | మార్కెట్ రాజా ఎంబీబీఎస్ | మార్కెట్ రాజా | |
2022 | కళగ తలైవన్ | అర్జున్ | |
2023 | మారుతి నగర్ పోలీస్ స్టేషన్ | నెదున్చెజియాన్ | |
2025 | విడాముయార్చి | టీబీఏ |
లఘు చిత్రాలు
మార్చుటెలివిజన్
మార్చు- బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 (2017) పోటీదారుగా/విజేతగా
- బిగ్ బాస్ తమిళ సీజన్ 2 (2018) (88వ రోజు నుండి 89వ రోజు వరకు అతిథిగా)
- బి. బి. జోడిగల్ అతిథి - గ్రాండ్ లాంచ్
మూలాలు
మార్చు- ↑ "I don't think I should have avoided Oviya: Arav". indiatimes.com. Archived from the original on 9 October 2017. Retrieved 29 October 2017.
- ↑ "Bigg Boss Tamil: Few interesting facts about Aarav, winner of Season 1- News Nation". newsnation.in. 1 October 2017. Archived from the original on 3 February 2018. Retrieved 27 August 2018.
- ↑ Hooli, Shekhar H (October 2017). "Bigg Boss Tamil winner: 6 things you need to know about Aarav". ibtimes.co.in. Archived from the original on 10 October 2017. Retrieved 29 October 2017.
- ↑ "Arav's next is a dark horror". indiatimes.com. Archived from the original on 9 August 2017. Retrieved 29 October 2017.
- ↑ "Arav to play a cop in his next, a thriller". indiatimes.com. Archived from the original on 15 September 2017. Retrieved 29 October 2017.
- ↑ "'Meendum Vaa Arugil Vaa' is a nail-biting horror thriller". Sify. Archived from the original on 30 July 2017. Retrieved 29 October 2017.
- ↑ "Aarav confesses to kissing Oviya in Big Boss house - Tamil Movie News - IndiaGlitz". indiaglitz.com. 7 August 2017. Archived from the original on 3 September 2017. Retrieved 29 October 2017.
- ↑ "Bigg Boss Tamil: Aarav's confession, Juliana's exit, while an assertive Kamal Haasan shows he is the Bigg Boss". indianexpress.com. 7 August 2017. Archived from the original on 3 September 2017. Retrieved 29 October 2017.
- ↑ "'Bigg Boss' fame Arav weds actor Raahei in private ceremony". The News Minute (in ఇంగ్లీష్). 2020-09-06. Archived from the original on 15 April 2022. Retrieved 2022-04-15.
- ↑ "Arav and Raahei are blessed with a baby boy". The Times of India (in ఇంగ్లీష్). 24 November 2021. Archived from the original on 15 April 2022. Retrieved 2022-04-15.
- ↑ "'Bigg Boss' Arav's wife actress Raahei gives birth to second child". IndiaGlitz.com. 2023-10-09. Retrieved 2023-10-12.
- ↑ "Theatre's T-20 format lures Chennai youth on stage". dtnext.in. 3 July 2017. Archived from the original on 29 October 2017.
- ↑ "want-some-coffee". The Hindu. thehindu.com. 17 February 2015. Archived from the original on 29 October 2017. Retrieved 17 February 2015.
- ↑ "CISFF - Chennai International Short Film Festival". www.cisff.in. Archived from the original on 7 December 2016. Retrieved 29 October 2017.
- ↑ "Ist Ahmednagar Short Film Festival" (PDF). Archived from the original (PDF) on 6 January 2016. Retrieved 2016-05-03.