{{}}

మంగళ
(1951 తెలుగు సినిమా)
Mangala - 1951.jpg
దర్శకత్వం చంద్రూ
నిర్మాణం ఎస్.ఎస్.వాసన్
తారాగణం భానుమతి,
రంజన్,
దొరైస్వామి,
సూర్యప్రభ,
టి.ఆర్.రామచంద్రన్,
సురభి కమలాబాయి,
కొళత్తు మణి,
విజయరావు
సంగీతం ఎం.డి.పార్థసారథి,
ఈమని శంకరశాస్త్రి
నేపథ్య గానం భానుమతీ రామకృష్ణ
సంభాషణలు తాపీ ధర్మారావు
నిర్మాణ సంస్థ జెమినీ స్టూడియోస్
విడుదల తేదీ జనవరి 14, 1951
నిడివి 182 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మంగళ జెమినీ స్టూడియోస్ నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1951, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది. 1943లో జెమినీ సంస్థే తీసిన మంగమ్మ శపథం తమిళ సినిమా కథ ఈ చిత్రానికి ఆధారం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలలో నిర్మించారు. హిందీ సినిమా 1950లో విడుదలయ్యింది.

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: చంద్రూ
 • సంగీతం: ఎం.డి.పార్ధసారథి, ఈమని శంకరశాస్త్రి
 • పాటలు, మాటలు: తాపీ ధర్మారావు
 • రూపాలంకరణ: సహదేవరావు
 • కళ: సయ్యద్ అహ్మద్
 • ఛాయాగ్రహణం: కమల్ ఘోష్

తారాగణంసవరించు

 • పి.భానుమతి - మంగళ
 • రంజన్ - సుగుణపాలుడు, జయపాలుడు
 • సూర్యప్రభ - కుంజు
 • టి.ఆర్. రామచంద్రన్ - సింగారం
 • సి.హెచ్.నారాయణరావు - కాసా
 • సురభి కమలాబాయి - సింగారం తల్లి
 • దొరైస్వామి - వెంకటాచలం
 • టి.ఇ.కృష్ణమాచార్య - రాజు
 • శ్రీవాత్సవ వెంకటేశ్వరరావు - మంత్రి
 • లక్ష్మణన్
 • విజయారావు - సాధువు
 • కృష్ణమూర్తి
 • ఇందిరా ఆచార్య - రతి
 • పవన్ సరిన్ - బాల జయపాలుడు
 • కొళత్తు మణి - దొమ్మరి

చిత్రకథసవరించు

రైతుబిడ్డ మంగళ చేత పరాభవం పొందిన శృంగార పురుషుడైన రాకుమారుడు సుగుణపాలుడు బలవంతంగా ఆమెను వరించి ఒక అంతఃపురంలో బంధించి తన శపథం ప్రకారం ఆమెకు జీవితాంతం దాంపత్యసౌఖ్యం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. మంగళ తన కోట నుండి పుట్టింటి వరకు తండ్రి చేత సొరంగం త్రవ్వించుకుని, దొమ్మరి విద్యలు నేర్చుకుని భర్తను వంచించి, కుమారుని కని తన ప్రతిశపథం ప్రకారం దర్బారులో తన కుమారుడు తండ్రిని కొరడాతో కొట్టేంత పని చేయిస్తుంది. అబలలను హీనభావంతో చూడకూడదనే పాఠాన్ని సుగుణపాలుడు నేర్చుకుంటాడు[1].

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటల వివరాలు[2]:

 1. అయ్యయ్యయ్యో సెప్ప సిగ్గు ఆయెనే అయ్యామీద మనసు - పి. భానుమతి
 2. ఆనందమాయే పరమానందమాయే పైరులతో పంటలతో - పి. భానుమతి బృందం
 3. జయమే మనకు జయమే భయము నేటితో తోలిగెనే - పి. భానుమతి
 4. ఝనన ఝనన ఝనన అని అందెలు ధ్వని చేయగా గోపకుమారా - పి. భానుమతి
 5. తెలివిలేని పంతమూని వెతలపాలై పోతినే - పి. భానుమతి
 6. నా రూపుము వయసు ఓహో ఇదేమి సొగసు జగాన నెందు -
 7. నీవేకదా నా భాగ్యము చిన్ని నాయనా రావేలా వేళాయే - పి. భానుమతి
 8. ఇదిగో నే మారుకటారీ వినోదింతున్ మదిన్ జేరి -
 9. ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనుచు ఏల బ్రమసితివయ్యా -
 10. ఉన్నదోయి పిల్ల ఉన్నదోయి చిన్నదున్నదోయి -
 11. ఓ పిల్లా ఓ పిల్లా ఓ పిల్లా ఏమయ్యా ఏమయ్యా ఏమయ్యా -
 12. ఓహో పావురమిలా రావేలా కూకు హుక్కు హు కు అని రావేలా - పి. భానుమతి
 13. దిగులుపడకు బేలా మది బిగువువీడకీ లీల - పి. భానుమతి

మూలాలుసవరించు

 1. సుబ్బారావు (14 January 1951). "చిత్ర సమీక్ష -" మంగళ" జెమినీవారి తెలుగు చిత్రం". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 3 April 2020.[permanent dead link]
 2. కొల్లూరి భాస్కరరావు. "మ౦గళ - 1951". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 3 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=మంగళ&oldid=2942722" నుండి వెలికితీశారు