మంచె అనగా జొన్న, సజ్జ చేలల్లో పంటను నాశనం చేసె పిట్టలను తోలడానికి, చేల మధ్యలో కర్రలతో ఏర్పాటు చేసిన ఎత్తైన వేదిక. రైతులు దీనిపైకెక్కి వడిసెలలో రాళ్లు పెట్టి విసిరి కంకులపై వాలిన పిట్టలను తరుముతారు. [1]అన్నదాతలు కష్టించి పంటలను పండిస్తారు. ఆ పంటలు చేతికొచ్చే సమయానిని వానరాలు (కోతులు), పక్షులు నాశనం చేయకుండా ఉండేందుకు వారు ప్రతీ రోజూ పొలానికి వెళ్ళి రక్షణ చర్యలు చేపడుతుంటారు. కోసేందుకు సిద్ధంగా ఉన్న పంటలను వానరాలు, పక్షుల బారిన పడకుండా ఉండేందుకు పొలం మధ్యలో మంచెగా ఏర్పాటు చేసుకొని దానిపై కాపలా ఉంటారు.[2]

భోజరాజు కథలో ప్రస్తావన

మార్చు

భోజరాజు కథలో పరివారంతో వెళుతున్న రాజుకు మంచెపై ఉన్న రైతు మంచెపై ఉన్నప్పుడు “రాజా మీరు మీ సైన్యం ఎండనపడి వెళుతున్నారు*  *అలసిపోయి  ఉన్నారు,  జొన్నచేను కంకులు తినడానికి సిద్దంగా ఉన్నాయి  సందేహం లేకుండా  అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని  విశ్రాంతి తీసుకుని వెళ్ళండి.  మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం” అని అంటాడు. మంచె దిగిన తరువాత ఆ రైతు “రాజ ఇదేమిటి, ధర్మవంతుడివి అని నీకు పేరు,  నీ పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు.  ఇది నీకెలా న్యాయంగా తోచింది?  నేను పేదవాడిని  కష్టపడి  జొన్న చేను పెంచుకున్నాను.  ఇదే నా ఆధారం.  కంచే చేను మేసినట్టుగా  ఇతరులకు  చెప్పవలసిన వారు మీరే ఇలా చేస్తే నాకు దిక్కేది?  ఇప్పుడు *నేనూ నాకుటుంబం జీవించేదెలా?”  అంటూ విలపించసాగాడు. రైతు మాటలలో తేడాను గమనించిన రాజు మంచె కింద నేలలో ఏదైనా విచిత్రం ఉందని భావించి మంచె క్రింద త్రవ్వితే విక్రమాదిత్యుని సింహాసనం లభిస్తుంది.[3][4]

సినిమా పాటలలో...

మార్చు
  1. మళ్ళున్నా...... మాన్యాలున్నా ...... మంచెమీద మగువుండాలి : చిత్రం: తోడూ-నీడా (1964), గానం: ఘంటసాల, సుశీల, సాహిత్యం: ఆత్రేయ, సంగీతం: కె.వి. మహదేవన్[5]
  2. మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకొ : చిత్రం: అదృష్టవంతులు - 1969, గానం: పి.సుశీల - రచన : కొనకళ్ల
  3. సన్నజాజి పడక... మంచె కాడ పడక.... చల్ల గాలి పడక.... మాట వినకుంది ఎందుకే...:చిత్రం: క్షత్రియపుత్రుడు, రచన: వెన్నెలకంటి, సంగీతం: ఇళయరాజా
  4. చీర లేని చిన్నదాన.. ఓయబ్బా...చిగురాకు వన్నెదానా...చిగురాకు వన్నెదానా...హేహె… ఓహో...మంచె కాడ నాటి రాతిరి...వంచెన చేసావే.. మరిచావా...వంచెన చేసావే…: చిత్రం: వాడే వీడు, సంగీతం: సత్యం
  5. ఊరంతా అనుకుంటున్నారు... ఏమనీ ఏమనీ ఏమనీ ఏమనీ.....చరణం:చిన్నోడి వాలకం చిత్రంగా ఉందనీ...సన్నజాజులంటేనే సరదా పెరిగిందనీ...మంచె మీద నిల్చొన్న...ఇంటికాడ కూర్చున్నా...పూలరంగడి మనసంతా...ఆ బుల్లెమ్మ మీదే ఉందనీ : చిత్రం: రైతు కుటుంబం

మొల్ల రామాయణంలో

మార్చు

మొల్ల రామాయణంలో హనుమంతుఁడు లంకలో సీతకై వెదుకుతున్న సందర్భంలోని పద్యం:

మేడలు, రచ్చకొట్టములు, మిద్దెలు, మంచెలు, నాటకూటముల్‌
మాడువు, లంగళుల్‌, దనుజ మందిరముల్‌, పుర గోపురావళుల్‌,
వాడలు, దేవ గేహములు, వప్ర చయంబులు, వేశ వాటికల్‌,
గోడలు, నాదిగాఁగఁ గపి కుంజరుఁ డప్పుడు చొచ్చి చూచుచున్‌.

ఈ పద్యం ఆధారంగా రామాయణ కాలంలో కూడా లంకా నగరంలో మంచెలు ఉన్నట్లు తెలుస్తుంది.

మూలాలు

మార్చు
  1. "IndoWordNet Navigation - మంచ". www.cfilt.iitb.ac.in. Retrieved 2021-06-10.
  2. "అలసి.. మంచెపై సొలసి..." EENADU. Archived from the original on 2021-06-10. Retrieved 2021-06-10.
  3. "భోజ రాజు". www.yuvnews.com. Retrieved 2021-06-10.
  4. "విక్రమాదిత్య సింహాసన మహాత్మ్యం". indiaherald.com. Retrieved 2021-06-10.
  5. "Mallunna Maanyalunna - మళ్ళున్న మాన్యాలున్న - Lyrics and Music by Ghantasala, Suseela arranged by Nukala". Smule (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-10.
"https://te.wikipedia.org/w/index.php?title=మంచె&oldid=3835123" నుండి వెలికితీశారు