శివ పంచాక్షరీ మంత్రము

ఓం నమః శివాయ లేదా ఓం నమశ్శివాయ శి వ పంచాక్షరీ మంత్రము శైవంలో భక్తులు ధ్యానించే దివ్య మంత్రం. శైవంలోని స్వార్ధంలేనితనం, శివునిలోని భోలాతనం కలగలిపిన నిరాడంబరత, నిస్వార్థం అవలంబించటంతో జీవి పరిపూర్ణ స్థితిలో భక్తిలో మామేకమై శరీరధర్మాల నుండి ఆ సర్వేశ్వరుని పాదాల చెంతచేరి ముక్తిని ప్రసాదించమని వేడుకోవటం ఈ మంత్రంలోని విశేషం.

వశిష్ట మహర్షి తన శిష్యబృందం చేత పలక మీద మొదటగా వ్రాయించేది ఈ శివ పంచాక్షరీ మంత్రమని పురాణాలు చెబుతున్నాయి. పంచాక్షరి అనగా ఆదిశక్తి, ఆదిదేవుడు, ఓంకారం, బిందువు, శివశక్తిల కలయికయే నాథబిందు కళోపాసన.