మంత్రిపాలెం (నగరం మండలం)

మంత్రిపాలెం బాపట్ల జిల్లా, నగరం మండలానికి చెందిన పెద్ద రెవెన్యూయేతర గ్రామం.

మంత్రిపాలెం
—  గ్రామం  —
మంత్రిపాలెం is located in Andhra Pradesh
మంత్రిపాలెం
మంత్రిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°15′04″N 81°00′26″E / 16.251223°N 81.007304°E / 16.251223; 81.007304
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522262
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

  1. ఈ పాఠశాలలో పనిచేయుచున్న గణపతి, సురేఖాదేవి అను ఇద్దరు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్నారు.
  2. ఈ పాఠశాల వరుసగా నాలుగు సార్లు 100% ఉత్తీర్ణత సాధించి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుచుచున్నది.
  3. ప్రభుత్వం కొన్ని గ్రామీణ పాఠశాలలను ఎంపికచేసి, దశలవారీగా కార్పొరేటు స్థాయికి అభివృద్ధిచేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన "సక్సెస్" పాఠశాలలకు రూపకల్పన చేసారు. ఈ పథకం క్రింద మంత్రిపాలెం పాఠశాలను ఎంపిక చేసి, రు.33 లక్షలను విడుదల చేసింది.
  4. ఉత్తమ ఫలితాలు సాధించుచున్న ఈ పాఠశాలకు, 40 లక్షల రూపాయల నిధులతో, నూతన భవన సముదాయ నిర్మాణం ప్రారంభమైనది.
  5. ఈ పాఠశాలలో చదువుచున్న చెరుకూరి అంకిత అను విద్యార్థిని, ఈ ఏడాది ప్రభుత్వ ప్రతిభా పురస్కారానికి ఎంపికైనది.

గ్రామములోని మౌలిక సదుపాయాలు మార్చు

త్రాగునీటి సౌకర్యం మార్చు

ఈ గ్రామములో, 2014, అక్టోబరు-2న గాంధీజయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు.

బాంకులు మార్చు

ఇండియన్ బ్యాంక్.

అంనవాడీ కేంద్రం మార్చు

గ్రామ పంచాయతీ మార్చు

  1. బొడ్డువారిపాలెం (నగరం), మంత్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జూలైలో మంత్రిపాలెం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో రావి విజయలక్ష్మి, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ హనుమత్, సీతా, లక్ష్మణ సమేత శ్రీ కోదండరామాలయం మార్చు

  1. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నివహించెదరు.
  2. ఈ ఆలయంలోని ధ్వజదండం, దేవాలయం నిర్మించిన సమయంలో ఏర్పాటుచేసింది. ఈ ధ్వజదండం కాలక్రమేణా మరమ్మత్తులకు గురికావడంతో, గ్రామస్థులు గమనించి, జీర్ణోద్ధరణకు పూనుకొని, నూతన ధ్వజదండాన్ని కొనుగోలు చేసారు. ఈ నూతన ధ్వజదండ ప్రతిష్ఠ సందర్భంగా, 2015,జూన్-1వ తేదీ సోమవారంనుండి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతులలో యోగపూజలు, అభిషేకాలు, అగ్ని, హోమపూజలు నిర్వహించారు. నూతన జీవధ్వజదండ పునఃప్రతిష్ఠా మహోత్సవం, 4వ తేదీ గురువారం ఉదయం 8-52 గంటలకు, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్థులు శ్రీ వసంతం శివనాగమల్లేశ్వరరావు, శ్రీ వసంతం శ్రీనివాసరావు, శ్రీ వసంతం రాధాకృష్ణమూర్తి, ఈ నూతన జీవధ్వజదండమును సమర్పించి, అత్యంతవైభవోపేతంగా ప్రతిష్ఠా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులతో మంత్రిపాలెం గ్రామం క్రిక్కిరిసిపోయి, తిరునాళ్ళసందడి నెలకొన్నది. ఈ జీర్ణోధరణ కార్యక్రమం అనంతరం, భక్తులకు అన్నసమారాధన నిర్వహించెచారు.

గామంలో ప్రధాన వృత్తులు మార్చు

ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.

గ్రామంలో ప్రధానమైన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామ ప్రముఖులు మార్చు

ఈ ఊరిలోని ప్రధాన సామాజిక వర్గం కమ్మ వారు. ఈ ఊరినుండి కొందరు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కలరు.

శ్రీ మేకా రాధాకృష్ణమూర్తి:- ఈ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మేకా రాధాకృష్ణమూర్తి, విద్యార్థిదశ నుండే కలంతో పాటు హలం చేపట్టారు. ఉద్యోగావకాశాలను వదలుకొని వ్యవసాయరంగంలో స్థిరపడ్డారు. వీరు గత ఐదు సంవత్సరాలుగా, సేంద్రీయ పద్ధతిలో పంటలను పండించి, అధిక దిగుబడులు పొందటమే కాకుండా రసాయనాల వాడకం లేనందువలన మానవాళికి హానిచేసే రసాయనాలను లేకుండా పంటలు పండించి, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుచున్నారు. ఈయన గత 2 సంవత్సరాలుగా వెద పద్ధితిలో వరిసాగు చేసి, వ్యవసాయాధికారులనూ, తోటి రైతులనూ విస్మయపరిచారు. నేడు తీరంలో వెద పద్ధతిలో, ఎక్కువమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారంటే, దానికి ఈయనే మారదర్శకుడు. ఈయన ఔషధ మొక్కలు గూడా సాగుచేయుచూ, పరిసరగ్రామాలవారికి ప్రకృతి వైద్యంతో వ్యాధులు నయం చేస్తున్నారు. తన ప్రయోగాలకు అనుకూలంగా నివాసాన్ని పొలంలోనికి మార్చుకున్నారు. ఈయన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పంటలను తనపెరట్లో పండించుచున్నారు. వీరు డిల్లీ, హైదరాబాదు, ముంబై, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రా, మొదలగు ప్రాంతాలలో జరిగిన రైతు సదస్సులలో పాల్గొన్నారు. 1996లో 60 మంది రైతులతో కలిసి, రష్యా దేశంలో పర్యటించారు. 2002 లో డిల్లీలో జరిగిన అంతర్జాతీయ రైతు సదస్సులో పాల్గొన్నారు. వీరు 2006 లో గుంటూరులో ఆదర్శరైతు పురస్కారం అందుకున్నారు. 2010లో గుంటూరులో సుభాష్ పాలేకర్ రైతు మేళాలో ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు.

  • రావి రవీంద్రనాథ్ ఠాగూర్
  • కంతేటి రవీంద్ర బాబు
  • మేకా శివ రామ ప్రసాదు