మకాని నారాయణరావు

జాతీయ బీసీ కమిషన్‌ అధ్యక్షుడిగా నియమితులైన తెలుగు వ్యక్తి. 1936 ఏప్రిల్‌ 22న నెల్లూరులో జన్మించిన మకాని నారాయణరావు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య పూర్తి చేసాడు. 1973లో జిల్లా సెషన్స్‌ జడ్జిగా నియమితులయ్యాడు. 1979 నుంచి న్యాయశాఖలో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసాడు. అనంతరం లండన్‌లోని అడ్వాన్డ్స్‌ లీగల్‌ స్టడీస్‌ ఇన్సిట్యూట్‌లో పనిచేశారు. 1986లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించాడు. 1997 నవంబరు నుంచి 1998 వరకు హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసాడు. ఆ తర్వాత, ఆయన సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా కొనసాగాడు.