మజ్జి శారద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ సభ్యురాలు.

మజ్జి శారద

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2007 - 2011

వ్యక్తిగత వివరాలు

జననం 1955
తలగం గ్రామం, టెక్కలి మండలం, శ్రీకాకుళం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు మజ్జి తులసీదాస్‌, కుసుమ
జీవిత భాగస్వామి ఉప్పాడ గోవిందరావు
సంతానం విష్ణు విక్రమ్‌, అశోక్‌ విక్రమ్‌, విష్ణు తులసి

జననం, విద్యాభాస్యం మార్చు

మజ్జి శారద 1955లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం, తలగం గ్రామంలో మజ్జి తులసీదాస్‌, కుసుమ దంపతులకు జన్మించింది. ఆమె శారద ప్రాథమిక విద్యను మందస, డిగ్రీ, ఇతర చదువులు శ్రీకాకుళంలోపూర్తి చేసి అనంతరం ఉపాధ్యాయురాలిగా పని చేసి గ్రూప్‌-1 ఉద్యోగం సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో అధికారిగా పని చేసింది.

రాజకీయ జీవితం మార్చు

మజ్జి శారద తన తండ్రి మజ్జి తులసీదాస్‌ మరణాంతరము గ్రూప్ 1 ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా, మహిళా కాంగ్రెస్‌ జాయింట్‌ సెక్రటరీగా, ఏఐసీసీ సభ్యురాలిగా వివిధ హోదాల్లో పని చేసింది. మజ్జి శారద 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సోంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో పలాస నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా, 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడింది. ఆమె 2007లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికై నాలుగేళ్లు ఆ పదవిలో పని చేసింది.

మరణం మార్చు

మజ్జీ శారద 15 అక్టోబర్ 2019న హైదరాబాద్ రామంతాపూర్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించింది. ఆమెకు భర్త ఉప్పాడ గోవిందరావు (రిటైర్డ్‌ అటవీశాఖ అధికారి), కుమారులు విష్ణు విక్రమ్‌, అశోక్‌ విక్రమ్‌, కుమార్తె విష్ణు తులసి ఉన్నారు.[1][2][3][4]

మూలాలు మార్చు

  1. Andhrajyothy (16 October 2019). "మజ్జి శారద ఇకలేరు". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  2. TV9 Telugu (16 October 2019). "మాజీ ఎమ్మెల్సీ శారద కన్నుమూత". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (15 October 2019). "గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మృతి". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  4. Suryaa (16 October 2021). "కాంగ్రెస్‌నేత మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద హ‌ఠాన్మ‌ర‌ణం". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.