మట్టా రాగమయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2023 శాసనసభ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1][2][3]

మట్టా రాగమయి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు సండ్ర వెంకటవీరయ్య
నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965
పోతిరెడ్డిపాడు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు ఎన్‌వై రత్నం
జీవిత భాగస్వామి డాక్టర్‌ మట్టా దయానంద్‌
నివాసం సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ

జననం, విద్యాభాస్యం మార్చు

మట్టా రాగమయి 1971లో జన్మించింది. ఆమె 1997లో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, 2009లో కర్నూలు మెడికల్ కాలేజీ నుండి క్షయ, ఛాతీ వ్యాధులలో (DTCD) డిప్లొమా పూర్తి చేసింది.[4][5]

వివాహం మార్చు

రాగమయి, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌తో వివాహం జరిగింది. వారికీ ముగ్గురు పిల్లలు నీలోత్పల, విరాజి, విపంచి ఉన్నారు.[6]

రాజకీయ జీవితం మార్చు

మట్టా రాగమయి తన భర్త డాక్టర్ మట్టా దయానంద్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసిన తన భర్తకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఆమె తన భర్తతో 2016 మేలో టీఆర్‌ఎస్‌లో చేరి ఆతరువాత 2023 మేలో కాంగ్రెస్‌లో చేరి[7][8] 2023 శాసనసభ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యపై 19,440 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[9][10][11]

మూలాలు మార్చు

  1. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  4. Namaste Telangana (4 December 2023). "అసెంబ్లీకి ఎన్నికైన 15 మంది డాక్టర్లు.. ఇంజనీర్లు కూడా..!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  5. Mana Telangana (4 December 2023). "ఎంఎల్ఎలుగా 15 మంది డాక్టర్లు". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  6. Andhrajyothy (25 December 2023). "ఎమ్మెల్యే అవుతాననుకోలేదు". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  7. Eenadu (27 May 2023). "కాంగ్రెస్‌ గూటికి మట్టా దయానంద్‌". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  8. Andhrajyothy (27 May 2023). "బీఆర్‌ఎ్‌సకు దయానంద్‌ గుడ్‌బై". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  9. Eenadu (20 December 2023). "సత్తుపల్లి రాగమయి 'హస్త'గతం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  10. BBC News తెలుగు (4 December 2023). "తెలంగాణ: యశస్విని, పర్ణిక, లాస్య నందిత, రాగమయి.. ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది మహిళలు ఎవరు?". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  11. "EC Sathupally Results 2023". 3 December 2023. Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.