సండ్ర వెంకటవీరయ్య
సండ్ర వెంకటవీరయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] మొదటిసారి సి.పి.ఎం. తరపున శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. తరువాత తెలుగుదేశం పార్టీ నుంచే వరుసగా మూడుసార్లు శాసనసభ్యునిగా విజయం సాధించాడు. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[2]
సండ్ర వెంకటవీరయ్య | |||
| |||
పదవీ కాలం 1994-1999, 2009 - 2023 డిసెంబర్ 03 | |||
ముందు | జలగం వెంకటరావు | ||
---|---|---|---|
తరువాత | మట్టా రాగమయి | ||
నియోజకవర్గం | సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రాజుపేట, కుసుమంచి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ | 1968 ఆగస్టు 15||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | బిక్షం - లక్ష్మి | ||
జీవిత భాగస్వామి | మహాలక్ష్మి | ||
సంతానం | ఇద్దరు కుమారులు |
జననం, విద్య
మార్చువెంటకవీరయ్య 1968, ఆగస్టు 15న బిక్షం - లక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో జన్మించాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
మార్చువెంకటవీరయ్యకు మహాలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
రాజకీయ జీవితం
మార్చు- అతను 1994లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నియోజకవర్గం నుండి సి.పి.ఎం అభ్యర్థిగా గెలుపొందాడు.[3]
- 1999లో అతను పాలేరు నియోజకవర్గంలో సి.పి.ఎం పార్టీ ఇన్‌ఛార్జ్ గా భాద్యతలు చేపట్టాడు.
- 2004లో పాలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్‌చార్జ్ గా వ్యవహరించాడు.
- వీరు ఖమ్మం జిల్లాకి చెందిన సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించి 2009 అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[4]
- 2014 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి పోటీచేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[5][6]
- అతను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా మూడు సార్లు ఎన్నికయ్యాడు (2016, 2017, 2018).[7][8]
- అతను 2018లో జాతీయ తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్షునిగా ఉన్నాడు.
- అతను 2018లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఎన్నికయినా[6] తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి చేరాడు.
- ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.[9]
ఇతర విషయాలు
మార్చుచైనా, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్ దేశాలు సందర్శించాడు.
ఎన్నికల చరిత్ర
మార్చుసంవత్సరం | కార్యాలయం | నియోజక వర్గం | పార్టీ | ఓట్లు | % | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు | % | ఫలితం | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1994 | ఆంధ్రప్రదేశ్ శాసనసభ | పాలేరు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | 63,328 | సంభాని చంద్రశేఖర్ | భారత జాతీయ కాంగ్రెస్ | 53,172 | గెలుపు | ||||
1999 | 40,380 | 51,638 | ఓటమి | |||||||||
2004 | తెలుగుదేశం పార్టీ | 54,500 | 78,422 | ఓటమి | ||||||||
2009 | సత్తుపల్లి | 79491 | 65,483 | గెలుపు | ||||||||
2014 | తెలంగాణ శాసనసభ | 74,776 | పిడమర్తి రవి | తెలంగాణ రాష్ట్ర సమితి | 72,434 | గెలుపు | ||||||
2018 | 100,044 | పిడమర్తి రవి | తెలంగాణ రాష్ట్ర సమితి | 81,042 | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ Batchali, Ravi (2020-06-05). "మంత్రి పదవిపై ఆశతో పార్టీ మారినా ఆ కల నెరవేరలేదే?". తెలుగు పోస్ట్. Archived from the original on 2020-12-12. Retrieved 2020-06-06.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1994". Elections in India. Archived from the original on 2021-11-07. Retrieved 2020-06-06.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Archived from the original on 2020-02-02. Retrieved 2020-06-06.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ 6.0 6.1 "Sathupalli Election Result 2018 Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Archived from the original on 2020-06-06. Retrieved 2020-06-06.
- ↑ Sakshi (28 April 2015). "ఫలించిన కల". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
- ↑ Sakshi (20 April 2018). "తితిదే బోర్డు మెంబర్ల నియామకం." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.