మడివాలా సరస్సు
మడివాలా సరస్సు కర్ణాటకలోని బెంగుళూరులో ఉన్న అతిపెద్ద సరస్సులలో ఒకటి. ఇది 114.3 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[1]
మడివాలా సరస్సు | |
---|---|
Location | మడివాలా,బెంగళూరు, కర్ణాటక |
Nearest city | బెంగళూరు |
Coordinates | 12°54′21″N 77°36′53″E / 12.90583°N 77.61472°E |
చరిత్ర
మార్చుఈ సరస్సును చోళులు ఒక్క రోజులో నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. 1990 సంవత్సరం వరకు సరస్సులోని నీటిని త్రాగడానికి ఉపయోగించే వారు. కానీ ఆతర్వాత నుండి పారిశ్రామిక వ్యర్థాలు, మురికినీరు సరస్సులోకి ప్రవేశించడం వల్ల ఇది క్రమంగా కలుషితమైంది.[2]
పరిరక్షణ
మార్చుఇది అనేక వలస పక్షులకు నిలయం. ఈ సరస్సు కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ పరిపాలన క్రింద పరిరక్షించబడుతుంది. సరస్సు సాధారణ, ప్రాథమిక నిర్వహణ బాధ్యతలు ఈ శాఖ నిర్వహిస్తుంది. పిల్లల పార్కు కూడా ఉంది. ఈ సరస్సు బెంగుళూరు లేక్ డెవలప్‌మెంట్ అథారిటీ నుండి 2016 లో రూ. 25 కోట్ల గ్రాంట్‌ను పొందింది.[3]
పక్షులు
మార్చుమడివాలా సరస్సు దగ్గరకు శీతాకాలంలో (నవంబర్-డిసెంబర్) భారీ సంఖ్యలో స్పాట్-బిల్ పెలికాన్ అనే పక్షులు వలస వస్తాయి. ఈ స్పాట్-బిల్ పెలికాన్స్ సమూహాలుగా నివసిస్తాయి. వాటి ప్రధాన ఆహారం చేపలు. చేపలను వేటాడడానికి పెలికాన్స్ సరస్సు మీదుగా ప్రయాణం చేస్తాయి. ఈ వలస పక్షులను శ్రీలంకలో కూడా చూడవచ్చు. ఈ పక్షులు భూమి పై వాలుతున్నపుడు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. సాధారణంగా వాటి రెక్కలు దాదాపు 8.5 అడుగుల పొడవు వరకు ఉంటాయి. ఈ పక్షులతో పాటు ఎగ్రెట్స్ పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు.[4]
మూలాలు
మార్చు- ↑ Bharadwaj, Arun (20 June 2016). Seen & Unseen Bangalore. Notion Press. ISBN 9789386073181 – via Google Books.ISBN 9789386073181
- ↑ "Artificial 'floating islands' clean Madiwala Lake". Deccan Herald. 23 March 2019.
- ↑ "Thousands of snails pile up on Madiwala Lake banks in southeast Bengaluru - Times of India". The Times of India. Retrieved 2018-11-18.
- ↑ "Islands of 'hope' at Madiwala Lake". Bangalore Mirror.