మదన్

సినీ దర్శకుడు

మదన్ ఒక తెలుగు సినీ దర్శకుడు.[1] పలు పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న ఆ నలుగురు సినిమాకు రచయితగా పనిచేశాడు.[2]

ఆర్.ఆర్. మదన్
జననం
రామిగాని మదన్ మోహన్ రెడ్డి

మరణం2022 నవంబరు 19
హైదరాబాదు
మరణ కారణంబ్రెయిన్ స్ట్రోక్
వృత్తిదర్శకుడు, రచయిత, నిర్మాత

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

మదన్ చిత్తూరు జిల్లా, మదనపల్లి లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని డిగ్రీ వరకు చదువు అక్కడే సాగింది. కాలేజీ రోజుల్లో నాటకాలు రాసి, దర్శకత్వ వహించాడు.[1]

కెరీర్

మార్చు

సినిమా రంగం మీద ఆసక్తితో హైదరాబాదుకు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. మొదట్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ తరపున కొన్ని టీవీ కార్యక్రమాలు రూపొందించాడు. డాక్యుమెంటరీలు తీశాడు. తరువాత మనసంతా నువ్వే, సంతోషం సినిమాల కోసం కెమెరామెన్ ఎస్. గోపాలరెడ్డి దగ్గర సహాయకుడిగా చేరాడు. కెమెరా గురించి తెలుసుకోవడం వల్ల రచనలను దృశ్యరూపంలోకి మార్చేటపుడు ఉపయోగపడుతుందని అలా కొద్ది రోజులు పనిచేశాడు. తరువాత కళ్యాణ రాముడు, ఖుషీ ఖుషీగా సినిమాల్లో రచనా విభాగంలో పనిచేశాడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా కథా చర్చల్లో పాల్గొన్నాడు.

దర్శకుడిగా మొదటి సినిమా పెళ్లయిన కొత్తలో చిత్రం కాగా కాఫీ విత్ మై వైఫ్, ప్రవరాఖ్యుడు, గరం, గుండె ఝల్లుమంది, గాయత్రి వంటి చిత్రాలకు దర్శకత్వం చేపట్టారు.

ఆర్‌. ఆర్‌. మదన్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 నవంబరు 20న మరణించాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 జీవి. "దర్శకుడు మదన్ తో ఇంటర్వ్యూ". idlebrain.com. జీవి. Retrieved 14 October 2016.
  2. "ఆ నలుగురు సినిమా పురస్కారాలు". telugumoviepedia.com. చిత్ర్. Retrieved 17 October 2016.[permanent dead link]
  3. Namasthe Telangana (19 November 2022). "సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు మదన్‌ కన్నుమూత". Archived from the original on 19 November 2022. Retrieved 19 November 2022.
  4. Andhra Jyothy (20 November 2022). "'పెళ్లైన కొత్తలో' దర్శకుడు ఇకలేరు" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=మదన్&oldid=3784801" నుండి వెలికితీశారు