మదన్ ప్రసాద్ జైస్వాల్

మదన్ ప్రసాద్ జైస్వాల్ (27 ఫిబ్రవరి 1936 - 20 ఫిబ్రవరి 2009[1]) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన మూడుసార్లు బెట్టియా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మదన్ ప్రసాద్ జైస్వాల్

పదవీ కాలం
1996 – 2004
ముందు ఫైయాజుల్ ఆజం
తరువాత రఘునాథ్ ఝా
నియోజకవర్గం బెట్టియా

ఎంఎల్ఏ
పదవీ కాలం
1990 – 1995
ముందు గౌరీ శంకర్ పాండే
తరువాత గౌరీ శంకర్ పాండే
నియోజకవర్గం బెట్టియా

వ్యక్తిగత వివరాలు

జననం (1936-02-27)1936 ఫిబ్రవరి 27
బెట్టియా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుత పశ్చిమ చంపారన్, బీహార్, భారతదేశం)
మరణం 2009 ఫిబ్రవరి 20(2009-02-20) (వయసు 72)
పాట్నా, , బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
సరోజ్ జైస్వాల్
(m. 1964)
సంతానం 4 ( సంజయ్ జైస్వాల్తో సహా 2 కుమార్తెలు& 2 కుమారులు )
మూలం [1]

జననం, విద్యాభాస్యం

మార్చు

మదన్ ప్రసాద్ జైస్వాల్ 27 ఫిబ్రవరి 1936న రమ్యద్ రామ్ జైస్వాల్, రామ్ దులారీ జైస్వాల్ దంపతులకు జన్మించాడు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లోని ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీ నుండి పాఠశాల విద్యను , పి.డబ్ల్యూ మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్, బీహార్‌లోని పాట్నాలోని పాట్నా విశ్వవిద్యాలయం నుండి జనరల్ మెడిసిన్ (ఎండీ)లో మాస్టర్స్, యూఎస్ లోని చికాగో నుండి ECFMG ఫెలోషిప్‌ను పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

మదన్ ప్రసాద్ జైస్వాల్ 1980 మధ్యలో రాజకీయాల్లోకి వచ్చి బెట్టయ్య మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. అతను ఆ తరువాత 1980లో బీహార్‌లో తన వ్యవస్థాపక సభ్యునిగా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీని స్థాపించాడు. మదన్ ప్రసాద్ 1990లో బెట్టియా శాసనసభ నియోజకవర్గం నుండి బీహార్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై 1992 - 1995 మధ్య బీహార్ శాసనసభలో అంతర్గత వనరుల కమిటీ కన్వీనర్‌గా, 1993 - 1994 మధ్య అంచనాల కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 1995లో బీహార్‌లోని బీజేపీ మెడికల్ సెల్ (చికిత్స మంచ్) అధ్యక్షుడిగా నియమితులయ్యాడు.

మదన్ ప్రసాద్ జైస్వాల్ 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బెట్టియా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికై 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 1998, 1999లో వరుసగా 12వ లోక్‌సభ, 13వ లోక్‌సభకు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మదన్ ప్రసాద్ జైస్వాల్ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయి ఆ తరువాత ఆయన బిజెపిని వీడి రాష్ట్రీయ జనతాదళ్ చేరాడు.

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1978 - 1983 మధ్య బెట్టయ్య మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్.
  • 1980లో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు.
  • 1990 నుండి బీహార్‌లో భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు.
  • 1990 - 1995 మధ్య బీహార్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • 1992 - 1995 మధ్య బీహార్ శాసనసభలో అంతర్గత వనరుల కమిటీకి కన్వీనర్‌గా పని చేశాడు.
  • 1992 - 1995 మధ్య బీహార్ శాసనసభలో అంచనాల కమిటీకి ఛైర్మన్‌గా పని చేశాడు.
  • బీహార్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ చికిత్సా మంచ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
  • 1996లో 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
  • 1996 - 1997 మధ్య వాణిజ్య కమిటీ సభ్యునిగా పని చేశాడు.
  • 1996 - 1997 మధ్య రక్షణ మంత్రిత్వ శాఖలో కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా పని చేశాడు.
  • 1998లో 12వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు.
  • 1998లో భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.
  • 1998 - 1999 మధ్య బొగ్గులు, జౌళి మంత్రిత్వ శాఖలో కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా పని చేశాడు.
  • 1999లో 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు.
  • 1999 - 2000 మధ్య రైల్వేల కమిటీ సభ్యునిగా & పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులపై జాయింట్ కమిటీ సభ్యునిగా పని చేశాడు.
  • 1999 - 2001 మధ్య పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా పని చేశాడు.

మూలాలు

మార్చు
  1. "Former BJP MP Madan Prasad Jaiswal dead - Hindustan Times". www.hindustantimes.com. Archived from the original on 5 September 2012. Retrieved 2 February 2022.
  2. Lok Sabha (2022). "Madan Prasad Jaiswal :". Lok Sabha. Archived from the original on 6 September 2022. Retrieved 6 September 2022.