సంజయ్ జైస్వాల్ (జననం 29 నవంబర్ 1965) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన నాలుగుసార్లు పశ్చిమ్ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

సంజయ్ జైస్వాల్
సంజయ్ జైస్వాల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2009
ముందు నియోజకవర్గం సృష్టించారు
నియోజకవర్గం పశ్చిమ్ చంపారన్

పదవీ కాలం
14 సెప్టెంబర్ 2019 – 23 మార్చి 2023
ముందు నిత్యానంద రాయ్
తరువాత సామ్రాట్ చౌదరి

వ్యక్తిగత వివరాలు

జననం (1965-11-29) 1965 నవంబరు 29 (వయసు 58)
పాట్నా, బీహార్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మంజు చౌదరి
నివాసం బెట్టియా, బీహార్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

సంజయ్ జైస్వాల్ 14 సెప్టెంబర్ 2019 నుండి 23 మార్చి 2023 వరకు భారతీయ జనతా పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

మార్చు

సంజయ్ జైస్వాల్ 29 నవంబర్ 1965న బీహార్ రాష్ట్రంలోని బెట్టియా గ్రామంలో జన్మించాడు. ఆయన పాట్నా మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్, దర్భంగాలోని దర్భంగా మెడికల్ కాలేజీ నుండి ఎండీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

సంజయ్ జైస్వాల్ తన తండ్రి మదన్ ప్రసాద్ జైస్వాల్ అడుగుజాడల్లో రాజకీయాలలోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పశ్చిమ్ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఆపాటి చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఎంపీగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పశ్చిమ్ చంపారన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ తివారీపై 136568 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. The Indian Express (20 October 2020). "Sanjay Jaiswal: BJP's friendly face, with right legacy, right moves" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  2. The Times of India (15 September 2019). "Sanjay Jaiswal made new Bihar BJP chief". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  3. Election Commision of India (5 June 2024). "2024 Loksabha Elections Results - Paschim Champaran". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  4. TV9 Bharatvarsh (7 June 2024). "पश्चिमी चंपारण लोकसभा सीट से जीतने वाले बीजेपी के संजय जायसवाल कौन हैं, जानिए अपने सांसद को". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)