మదాలస
మాధాలస 1948 మే 29న విడుదలైన తెలుగు సినిమా. శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై మీర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. కె.రఘురామయ్య, సి.కృష్ణవేణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.హనుమంతరావు సంగీతాన్నందించాడు. [1]
మదాలస (1948 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
---|---|
నిర్మాణం | మిర్జాపురం రాజా |
తారాగణం | సి.కృష్ణవేణి, అంజలీ దేవి, శ్రీరంజని, కళ్యాణం రఘురామయ్య, ఏ.వి.సుబ్బారావు, పువ్వుల అనసూయ |
సంగీతం | సాలూరి హనుమంతరావు |
నృత్యాలు | వెంపటి సత్యం |
గీతరచన | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
ఛాయాగ్రహణం | పాల్కే |
కళ | టి.వి.ఎస్.శర్మ |
నిర్మాణ సంస్థ | శోభనాచల పిక్చర్స్ |
విడుదల తేదీ | మే 29,1948 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- కృష్ణవేణి
- అంజలీదేవి
- జూనియర్ శ్రీరంజని
- జ్యోషి
- నాగరత్నం'
- ఇందిర
- కుమారి బాలా త్రిపుర సుందరి
- వసుంధర
- రఘురామయ్య
- సదాశివ భ్రహ్మం
- పి.వి.సుబ్బారావు
- రామిరెడ్డి
- రేలంగి
- కుంపట్ల
- రాఘవన్
- కృష్ణమూర్తి
- భుజంగరావు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
- స్టూడియో: శోభనాచల పిక్చర్స్
- నిర్మాత: మీర్జాపురం రాజా;
- స్వరకర్త: ఎస్.హనుమంత రావు
- నృత్యం: వెంపటి చినసత్యం
- ఛాయాగ్రహణం: సి.యం.మారి
- శబ్ద గ్రహణం: యం.వి.నార్కే
- శిల్పము: టి.వి.యన్.శర్మ
- కార్యనిరాహకుడు: కె.వి.సుబ్బారావు
పాటలు
మార్చు- చీరతోనిదే సింగారమంతా అంతా, రచన, తాపీ ధర్మారావు, గానం .
- సుమజ్ఞ మీ పరీసరమా , రచన: తాపీ ధర్మారావు, గానం. సి. కృష్ణవేణీ బృందం
- జయతు జయతు దేవో : శ్లోకం , గానం. కుంపట్ల్ల బృందం
- జయజయాయ సూర్యాయ నమో , గానం. కుంపట్ల
- సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి
- ఏమి జన్మంబేమి జీవనమూ...
- సాంభ సదాశివ సాంభ సదాశివ...
- అహ మహరాజ ఓహో దానవేంద్రా
- స్వాతంత్రం కన్నా స్వర్గలోకము లేదు , రచన: తాపీ ధర్మారావు, గానం. వి. బాలత్రిపురసుందరీ
- ఇందులకేనా భవానీ., రచన: తాపీ ధర్మారావు, గానం. సి. కృష్ణవేణీ.
- ఇదియటరా నీ కీలకమంత్రం పతులు మతులు, రచన: తాపీ ధర్మారావు
- ఓరాణి మహారాణి మంగళ స్నానమునకు లెమ్ము, రచన: తాపీ ధర్మారావు
- జయ జయాయ సూర్యాయనమో సర్వలోక సాక్షి, రచన: తాపీ ధర్మారావు, గానం.కుంపట్ల
- జై జై మాతా సరస్వతి సంగీత కళాసరస్వతి, రచన: తాపీ ధర్మారావు
- జై జై సరస్వతి జయ మంగళహారతి జయహారతి,రచన: తాపీ ధర్మారావు
- జయతు సకల భాషా సరసర్వ భూషా(శ్లోకం)
- త్వంహి బ్రహ్మ శివచ్చత్వం కేశవస్త్వం ,(శ్లోకం), గానం.కుంపట్ల
- పాడవే మధురీతి పరమమై త్రిగీతి భావజీవా శ్రుతుల్, రచన: తాపీ ధర్మారావు, గానం. కృష్ణవేణీ
- పాలకడలి కలసి సురాసురులు కలసి పంతముతో, రచన: తాపీ ధర్మారావు,
- ప్రియసఖా ప్రణయగీతి వినగదోయి మన జీవితమే, రచన: తాపీ ధర్మారావు, గానం.కృష్ణవేణి
- బ్రతుకేమి జగాన ప్రతి బాసిన చానా వెతలకేనా మిగిలినది, రచన: తాపీ ధర్మారావు, గానం.సి.కృష్ణవేణి
- హాయ్ హాయ్ అందలపాప నిదురపోతి విదియేరా, రచన: తాపీ ధర్మారావు
- మంగళమని పాడరే సారంగలోచనులు మంగళకరుడైన , రచన: తాపీ ధర్మారావు
- రమణీ మనోహరా సఫలమాయే నా ఆశా, రచన: తాపీ ధర్మారావు, గానం.కళ్యాణం రఘురామయ్య
- శరణం తవ చరణమే కరుణామయి జననీ, రచన: తాపీ ధర్మారావు, గానం. సి. కృష్ణవేణి
- శుభకరీ భువనపావనీ భవానీ అభయమొసగవే,రచన: తాపీ ధర్మారావు.
మూలాలు
మార్చు- ↑ "Madhalasa (1948)". Indiancine.ma. Retrieved 2021-05-10.
. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.