చిత్రపు నారాయణమూర్తి

చిత్రపు నారాయణమూర్తి (1913-1985) తొలితరం చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. ఇతడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఇతడు తన మొదట తన సోదరుడు చిత్రపు నరసింహమూర్తికి సహాయకుడిగా సీతాకళ్యాణం, సతీతులసి, మోహినీరుక్మాంగద, కృష్ణ జరాసంధ మొదలైన సినిమాలకుపనిచేశాడు. దర్శకుడిగా ఇతని తొలిచిత్రం భక్త మార్కండేయ. ఈ చిత్రం ఇతడిని మంచి దర్శకుడిగా నిలబెట్టింది. తరువాత ఇతడు తెలుగు, తమిళ,కన్నడ భాషలలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు 1961లో కృష్ణకుచేల అనే సినిమాను నిర్మించాడు. అది అతనికి ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టింది.

మైరావణ

దర్శకత్వం వహించిన సినిమాలు

మార్చు
విడుదలైన సంవత్సరం సినిమా పేరు భాష నటీనటులు
1938 భక్త మార్కండేయ తెలుగు వేమూరి గగ్గయ్య, శ్రీరంజని (సీనియర్)
1940 మైరావణ తెలుగు వేమూరి గగ్గయ్య,చిత్తజల్లు కాంచనమాల
1941 దక్షయజ్ఞం తెలుగు వేమూరి గగ్గయ్య, సి.కృష్ణవేణి, త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి, సదాశివరావు, బెజవాడ రాజారత్నం, టీ.జి. కమలాదేవి, జి.వరలక్ష్మి
1942 భక్త ప్రహ్లాద తెలుగు వేమూరి గగ్గయ్య, జి.వరలక్ష్మి
1943 భక్త కబీర్ తెలుగు
1944 భీష్మ తెలుగు జంధ్యాల గౌరీనాథశాస్త్రి, కృష్ణవేణి, లక్ష్మీరాజ్యం, సి.ఎస్.ఆర్, పారుపల్లి సుబ్బారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, పారుపల్లి సత్యనారాయణ
1944 సంసార నారది తెలుగు మద్దాలి కృష్ణమూర్తి
1947 బ్రహ్మరథం తెలుగు బి.జయమ్మ, సి.కృష్ణవేణి, అద్దంకి శ్రీరామమూర్తి,పారుపల్లి సుబ్బారావు, ఏ.వి.సుబ్బారావు, కళ్యాణం రఘురామయ్య
1948 మదాలస తెలుగు సి.కృష్ణవేణి, అంజలీ దేవి, శ్రీరంజని, కళ్యాణం రఘురామయ్య, ఏ.వి.సుబ్బారావు
1949 బ్రహ్మరథం తెలుగు
1952 ఎన్ తంగై తమిళం ఎం.జి.రామచంద్రన్, ఇ.వి.సరోజ
1953 నా చెల్లెలు తెలుగు జి.వరలక్ష్మి, సూర్యకళ, రామశర్మ, అమరనాథ్
1954 ఎదిర్ పరాధదు తమిళం శివాజీ గణేశన్, ఎస్.వరలక్ష్మి,పద్మిని, చిత్తూరు నాగయ్య
1955 ఆదర్శ సతి కన్నడ ఆర్.నాగేంద్రరావు, జమున, షావుకారు జానకి
1956 నాగులచవితి తెలుగు ఆర్.నాగేంద్రరావు, షావుకారు జానకి
1957 పతిని దైవమ్ తమిళం జి.వరలక్ష్మి, కె.ఎ.తంగవేలు
1958 అణ్ణయిన్ ఆణై తమిళం శివాజీ గణేశన్, సావిత్రి, పండరీబాయి, ఎస్.వి.రంగారావు
1958 మనమలై తమిళం కె.బాలాజి, సావిత్రి, కె.ఎ.తంగవేలు
1958 నాన్ వాలార్త తంగై తమిళం ప్రేమ్‌ నజీర్, మైనావతి, పండరీబాయి
1959 దైవమే తునై తమిళం అక్కినేని నాగేశ్వరరావు,పద్మిని, కె.ఎ.తంగవేలు
1960 భక్తశబరి తెలుగు శోభన్ బాబు, చిత్తూరు నాగయ్య, పండరీబాయి
1960 భక్తశబరి కన్నడ నగేష్, పండరీబాయి
1960 భక్తశబరి తమిళం
1961 కృష్ణ కుచేల తెలుగు సి.ఎస్.ఆర్., కన్నాంబ, ముక్కామల, రాజశ్రీ,పద్మనాభం
1963 చిత్తూరు రాణీ పద్మిని తమిళం శివాజీ గణేశన్, వైజయంతిమాల,కె.ఎ.తంగవేలు
1964 పతివ్రత తెలుగు సావిత్రి, రాజసులోచన, జి.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావు,కుచలకుమారి, జెమినీగణేశన్
1967 భక్త ప్రహ్లాద తెలుగు రోజారమణి, ఎస్.వి.రంగారావు

మూలాలు

మార్చు