మదాలస శర్మ

భారతీయ చలనచిత్ర నటి

మదాలస శర్మ భారతీయ చలనచిత్ర నటి. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, జర్మన్, పంజాబీ భాషల చిత్రాలలో నటించింది.[3]

మదాలస శర్మ చక్రవర్తి
జననం (1991-09-26) 1991 సెప్టెంబరు 26 (వయసు 33)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుమదాలస, మద్దాలస,[1] మితి[2]
వృత్తిమోడల్, నటి
జీవిత భాగస్వామి
మహాక్షయ్ చక్రవర్తి
(m. 2018)

జననం - విద్యాభ్యాసం

మార్చు

మదాలస శర్మ 1991, సెప్టెంబరు 26న సినీ నిర్మాత, దర్శకుడు సుభాష్ శర్మ, నటి షీలా శర్మ దంపతులకు ముంబైలో జన్మించింది.[4] మార్బుల్ ఆర్చ్ పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసి, ముంబైలోని మిథిబాయి కాలేజీలో[5] ఇంగ్లీష్ లిటరేచర్[1] ను అభ్యసించింది. చిన్నప్పటినుండి నటి కావాలని ఎల్లప్పుడు కోరుకునేది.[6] కిషోర్ నమిత్ కపూర్ దగ్గర నటన, గణేష్ ఆచార్య, షియామాక్ దావర్ ఆధ్వర్యంలో నృత్యం నేర్చుకున్నది.[4]

వివాహం

మార్చు

2018, జూలై 10న మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిని వివాహం చేసుకుంది.

సినిమారంగం

మార్చు

2009లో ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఫిట్టింగ్ మాస్టర్ మదాలస శర్మ తొలి తెలుగుచిత్రం.[7] ఈ చిత్రం విజయవంతమై, ఈవిడ నటనకు ప్రసంశలు అందుకుంది. 2010లో శౌర్య సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ చిత్రం తన సినీజీవితానికి ఉపయోగపడింది.[8] 2010లో సురేష్ ప్రొడక్షన్స్ ఆలస్యం అమృతం సినిమాలో నటించింది.[9][10][11][12]

కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య[13] ద్వారా బాలీవుడ్ చిత్రరంగంలోకి ప్రవేశించగా 2011, ఫిబ్రవరిలో తొలిచిత్రం ఏంజెల్ విడుదలైంది.[14] తరువాత తెలుగులో మేం వయసుకు వచ్చాం సినిమాలో నటించింది.[15] ఈమె నటనను టైమ్స్ ఆఫ్ ఇండియా,[16] ఫుల్ హైడ్.కాం[17] ప్రస్తావిస్తూ ప్రసంశలు అందించాయి.

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2009 ఫిట్టింగ్ మాస్టర్ మేఘన తెలుగు
2010 శౌర్య శ్వేత కన్నడ
2010 ఆలస్యం అమృతం వైదేహి తెలుగు
2010 తంబిక్కు ఇంద ఊరు ప్రియ తమిళం
2011 ఏంజెల్ సొనాల్ మహజన్ హిందీ
2012 మేం వయసుకు వచ్చాం ఖుషి తెలుగు
2013 పతఏరం కోడి భూమిక తమిళం
2013 ది గర్ల్ విత్ ది ఇండియన్ ఎమెరాల్డ్[18][19] మాల జర్మన్
2014 పటియాల డ్రీమ్స్ రీత్ పంజాబీ
2014 సామ్రాట్ & కో[20] డింపి సింగ్ హిందీ
2014 చిత్రం చెప్పిన కథ[21] తెలుగు
2015 రామ్ లీల[22] ప్రత్యేక పాత్ర తెలుగు
2015 పైసా హో పైసా భూమిక హిందీ
2015 డవ్ కన్నడ
2016 దిల్ సాల సంకీ హిందీ
సూపర్ 2 తెలుగు
2018 మౌసం ఇక్రార్ కె దో పాల్ ప్యార్ కె అంజలి హిందీ

ఇతర వివరాలు

మార్చు
  1. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈటివి తెలుగు సూపర్-2 రియాలిటీ షో నటించి, ప్రజాదరణ పొందింది.
  2. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన "ఇమామి నవరత్న టాల్క్" ప్రచార చిత్రంలో నటించింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Maddalasa adds 'D' for good luck – The Times of India". Timesofindia.indiatimes.com. 11 October 2011. Retrieved 10 September 2019.
  2. "Madalsa Sharma turns Mithi". 19 April 2012. Retrieved 10 September 2019.
  3. "The Tribune, Chandigarh, India – The Tribune Lifestyle". Tribuneindia.com. 9 January 1974. Retrieved 10 September 2019.
  4. 4.0 4.1 P Vasudeva rao. "Eyeing young & bubbly roles". The New Indian Express. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 10 September 2019.
  5. "Cinema Connect". The Indian Express. 30 April 2014. Retrieved 10 September 2019.
  6. "Cinema Connect | The Indian Express | Page 99". The Indian Express. 30 April 2014. Retrieved 10 September 2019.
  7. "Comedy, EVV style". The Hindu. 13 January 2009. Retrieved 11 September 2019.
  8. Wire, Sampurn. "Madalasa Sharma's Kannada Debut". The New Indian Express. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 11 September 2019.
  9. 123telugu. "Alasyam Amrutham Movie Review". 123telugu.com. Retrieved 11 September 2019.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  10. "Alasyam Amrutham Review". CineGoer.com. 5 December 2010. Archived from the original on 6 May 2014. Retrieved 11 September 2019.
  11. "Thambikku Indha Ooru is ridiculous – Rediff.com Movies". Movies.rediff.com. 8 March 2010. Retrieved 11 September 2019.
  12. "'Thambikku Intha Ooru' has no depth – IBNLive". Ibnlive.in.com. 29 April 2010. Archived from the original on 7 మే 2014. Retrieved 11 September 2019.
  13. "Times of India Publications". Webcache.googleusercontent.com. 21 October 2010. Archived from the original on 6 July 2009. Retrieved 11 September 2019.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. "Nowshowing". The Hindu. 12 February 2011. Retrieved 11 September 2019.
  15. "Maddalasa is on cloud nine – The Times of India". Timesofindia.indiatimes.com. 28 June 2012. Retrieved 11 September 2019.
  16. "Mem Vayasuki Vacham movie review: Wallpaper, Story, Trailer at Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 11 September 2019.
  17. "Mem Vayasuku Vacham review: Mem Vayasuku Vacham (Telugu) Movie Review - fullhyd.com". Movies.fullhyderabad.com. Retrieved 11 September 2019.
  18. "Rajeev Khandelwal deserves the role that he is playing in Samrat & Company – Madalsa Sharma". Tellychakkar.com. 7 April 2014. Retrieved 11 September 2019.
  19. "Madalasa To Debut in Kavita Barjatya's Detective thriller 'Samrat & Co' – Telugu Movie News". IndiaGlitz.com. Retrieved 11 September 2019.
  20. "Cast & Crew". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 11 September 2019.
  21. y. sunita chowdhary (9 March 2014). "In Uday's memory". The Hindu. Retrieved 11 September 2019.
  22. "Bounce back Role". 25 February 2015. Archived from the original on 1 March 2015. Retrieved 11 September 2019.

ఇతర లంకెలు

మార్చు