మద్దిపాటి వెంకటరాజు
మద్దిపాటి వెంకటరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గోపాలపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
మద్దిపాటి వెంకటరాజు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | తలారి వెంకట్రావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | గోపాలపురం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1980 ప్రకాశరావుపాలెం గ్రామం, నల్లజర్ల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | యోహాన్ | ||
జీవిత భాగస్వామి | సౌజన్య | ||
సంతానం | ద్యుతి, కృతి |
రాజకీయ జీవితం
మార్చుమద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గోపాలపురం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా దక్కలేదు. ఆయన ఆ తరువాత 2016లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకొని పూర్తి స్థాయిగా రాజకీయాలలోకి అడుగుపెట్టి పార్టీ కార్యక్రమాలను నిర్వహించాడు. వెంకటరాజు 2019లో టికెట్ ఆశించగా దక్కలేదు ఆ తరువాత పార్టీకి ఆయన సేవలకు గుర్తించి రాష్ట్ర లిడ్ క్యాప్ డైరక్టర్‌గా , నాయకత్వ శిక్షణ శిబిర డైరక్టర్‌గా నియమించింది.
మద్దిపాటి వెంకటరాజు ఆ తరువాత తెదేపా కార్యక్రమాల కమిటీ ఇన్‌చార్జ్‌గా నియమితుడై ఆ తరువాత 16 అక్టోబర్ 2022న గోపాలపురం శాసనసభ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[2] ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గోపాలపురం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తానేటి వనితపై 26,784 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు[3].[4]
మూలాలు
మార్చు- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (16 October 2022). "గోపాలపురం తెదేపా సారథి వెంకటరాజు". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ Prajasakti (4 June 2024). "మంత్రి వనితపై మద్దిపాటి విజయం". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.