విశాఖ మహానగరపాలక సంస్థ

(మహా విశాఖ నగర పాలక సంస్థ నుండి దారిమార్పు చెందింది)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జి.వి.ఎమ్.సి), విశాఖపట్నం నగరాన్ని పాలించే ప్రధాన పరిపాలన సంస్థ. ఇది 540 చ. కి.మీ. (210 చ.మైళ్ళు) విస్తీర్ణ పరిధిలో ఉంది.[2] ఇది విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) ప్రణాళికా విభాగంలో ఒక భాగం.[3]

విశాఖ
మహానగరపాలక సంస్థ
రకం
రకం
చరిత్ర
స్థాపితం1858[1]
సీట్లు98
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
నినాదం
విధాయక నగరం (City of Destiny)
సమావేశ స్థలం
తెన్నేటి భవన్, రాంనగర్, విశాఖపట్నం
తెన్నేటి భవన్ విశాఖపట్నం

చరిత్ర

మార్చు

విశాఖపట్నం 1858 లో పురపాలక సంఘంగా ఏర్పాటు చేయబడి, 1979 లో నగరపాలకసంస్థగా అభివృద్ధి చేయబడింది. జాతీయ పట్టణ అభివృద్ధి పధకం ద్వారా విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వ నిర్ణయంప్రకారం 2005 నవంబరు 21నాడు మహా నగరపాలక సంస్థగా మార్చబడింది.[4][5] విశాఖపట్నం చుట్టుపక్కల వున్న 32 గ్రామాలను, గాజువాక పురపాలక సంఘాన్ని ఇందులో విలీనం చేసారు.[6] 9.82 లక్షల జనాభా వున్న విశాఖ, ఈ 32 గ్రామాలు, గాజువాక పురపాలక సంఘం కలిసిన తరువాత 14.25 లక్షల జనాభాకి పెరిగింది. ఈ విలీనం వల్ల 111 చదరపు కిలోమీటర్లు పరిధిలో విస్తరించిన విశాఖ, 534 చ.కీ.మీ. విస్తీర్ణానికి పెరిగింది

మహా విశాఖ పరిధిలోకి చేరిన గ్రామాలు

మార్చు

(1) మధురవాడ, (2) పరదేశి పాలెం, (3) కొమ్మాది, (4) బక్కన్న పాలెం, (5) పోతిన మల్లయ్య (పి.ఎమ్) పాలెం, (6) యారాడ (యారాడ మలుపు రోడ్డు ప్రమాదాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఎల్లప్పుడూ 108 అంబులెన్స్ వుంటుంది), (7) గుడ్లవాని పాలెం, (8) ఎల్లపువాని పాలెం, (9) వేపగుంట, (10) పురుషోత్తమపురం, (11) చిన్న (చిన) ముసిడివాడ, (12) పులగాలిపాలెం, (13) పెందుర్తి, (14) లక్ష్మీపురం, (15) పొర్లుపాలెం, (16) నరవ, (17) వెదుళ్ళ నరవ, (18) సతివానిపాలెం, (19) నంగినారపాడు, (20) గంగవరం (పోర్టు వుంది), (21) ఇ.మర్రిపాలెం, (22) లంకెల పాలెం, (23) దేశపాత్రునిపాలెం, (24) దువ్వాడ (రైల్వే స్టేషను వుంది), (25) అగనంపూడి (ఆల్ ఇండియా రేడియో స్టేషను వుంది), (26) కె.టి.నాయుడిపాలెం, (27) దేవాడ, (28) పాలవలస, (29) చిన్నిపాలెం, (30) అప్పికొండ (సోమేశ్వరాలయం ప్రసిద్ధి) (31) అడివివరం (32) మంత్రి పాలెం.

జనాభా గణాంకాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం కార్పొరేషన్ జనాభా 20,91,811 గా ఉంది.[7]

పరిపాలన

మార్చు

మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రాంత విస్తీర్ణం మొత్తం 681.96 చ.కి.మీ. (263.31 చ.మైళ్ళు). మేయర్ నేతృత్వంలోని ఒక ఎన్నికైన సంస్థచే నగర పాలక సంస్థ నిర్వహణలో ఉంది. 2021 జనవరి 21 నాటికి వార్డుల సంఖ్య 81 నుండి 98 కి పెరిగింది[8] సంస్థ పరిపాలన కొరకు 11 విభాగాలున్నాయి. రెవెన్యూ శాఖ, అక్కౌంట్సు (పద్దులు) శాఖ, సాధారణ పరిపాలన, బట్వాడా శాఖ (సంస్థలోని మిగతా శాఖలు రాసిన ఉత్తరాలు, నోటీసులు పంపించటం), ఇంజినీరింగ్ శాఖ, ప్రజారోగ్య శాఖ (ప్రజల ఆరోగ్యం, వీధులు, మురికి కాలువలు శుభ్రం చేయటం, ఆసుపత్రులు ), టౌన్ ప్లానింగ్ శాఖ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (నగర అభివృద్ధి సంస్థ), విద్యా శాఖ, ఆడిట్ శాఖ (అక్కౌంట్సు శాఖ రాసిన జమా ఖర్చులు సరిగా ఉన్నాయా లేవా అని పరిశీలించి, తప్పులను, అనవసరంగా చేసిన ఖర్చులను వెదికి అభ్యంతరాలను నమోదు చేస్తుంది), లీగల్ సెల్ (మహా విశాఖ నగరపాలక సంస్థ మీద ఎవరైనా దావాలు వేసిన వాటికి సమాధానాలు ఇవ్వటం, కొన్ని న్యాయసంబంధమైన సలహాలు సంస్థకు ఇవ్వటం, వంటి పనులు చేస్తుంది). ఈ 11 శాఖలకు అధిపతులు ఉంటారు. ఈ 11మంది అధిపతులు, మహా విశాఖ నగర పాలక సంస్థ అధిపతి (కమీషనరు, ఐ.ఏ.ఎస్ అధికారి) ఆధ్వర్యంలో పనిచేస్తారు. విశాఖపట్నం నగర అభివృద్ధి కొరకు విశాఖపట్నం మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుచేయబడింది.

నియోజక వర్గాలు

మార్చు
 1. శృంగవరపుకోట శాసనసభ నియోజకవర్గం
 2. భీమిలి శాసనసభ నియోజకవర్గం - సింహాచలం (కొంత భాగం), భీమిలి (భీమునిపట్నం) మునిసిపాలిటీ, భీమిలి మండలం, పద్మనాభం, ఆనందపురం.
 3. తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం - 1 నుంచి 11 వార్డులు,
 4. దక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం - 12 నుంచి 34, 42, 43 వార్డులు.
 5. ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం - 26 నుంచి 33 వార్డులు.
 6. గాజువాక శాసనసభ నియోజకవర్గం - గాజువాక, పెద గంట్యాడ మండలాల్లో వున్న 50 నుంచి 65 వార్డులు.
 7. పశ్చిమ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం - 35 నుంచి 49, 66 నుంచి 69 వార్డులు.
 1. పెందుర్తి శాసనసభ నియోజకవర్గం (విశాఖపట్నం 69 నుంచి 72 వార్డులు. పెందుర్తి, సింహాచలం మండలాలు.)

కమిషనర్‌లు

మార్చు

మూలాలు

మార్చు
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-21. Retrieved 2018-01-17.
 2. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 8 August 2016. Retrieved 29 January 2016.
 3. "Profile". Greater Visakhpatnam Municipal Corporation. Archived from the original on 31 January 2016. Retrieved 12 May 2015.
 4. "History". Greater Visakhpatnam Municipal Corporation. Archived from the original on 6 April 2015. Retrieved 21 May 2015.
 5. "Andhra Pradesh First Greater Muncipal Corporation". thehindu. Retrieved 29 Nov 2005.
 6. G.O. Ms.No.938 MA & UD (Elec.II) Dept. తేది 2005 నవంబరు 21
 7. "GVMC Profile". Vijayawada Municipal Corporation. Archived from the original on 19 March 2016. Retrieved 29 March 2016.
 8. Jan 5, TNN /; 2020; Ist, 05:32. "Now, GVMC area to be reorganised into 98 wards | Visakhapatnam News - Times of India". The Times of India. Retrieved 2021-02-16. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
 9. Andrajyothy (20 March 2021). "జీవీఎంసీ కమిషనర్‌గా సృజన". Archived from the original on 9 November 2021. Retrieved 14 November 2021.
 10. Andrajyothy (30 October 2021). "జీవీఎంసీ కమిషనర్‌గా డాక్టర్ లక్ష్మీశ". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.

వెలుపలి లంకెలు

మార్చు