మద్దెల పంచనాథం అనితరసాధ్యమైన కళాకారుడు. గొప్ప హరికథా విద్వాంసుడు. హోర్మోనిస్టు మద్దెల పంచనాథం.[1]గుంటూరు జిల్లా రేపల్లెకు సమీపంలోని జంగాలవారి విశిష్ట వ్యకలు పాలెం గ్రామంలో ధర్మపురి, ధర్మమ్మ దంపతులకు 1920లో పంచనాథం జన్మించారు. ఏడవ ఏటనే విశ్వ విఖ్యాత నటుడు బళ్లారి రాఘవతో నటించారు. కొమ్మూరి నారా యణమూర్తి వద్ద నటనలో శిక్షణ పొందిన పంచనాధం చంద్ర మతి, విద్యావతి వంటి స్త్రీ పాత్రలను చక్కగా పోషించి పేరు ప్రతి ష్టలు పొందారు. హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు, నక్షత్రకు డు వంటి పాత్రలను కూడా ఆయన ధరించారు. 1940లో జంగాల వారిపాలెంలో క్రైస్తవ యువజన నాట్యమండలిని స్థాపించి జగజ్జే యుడు, దావీదు విజయము వంటి నాటకాలను విస్తృతంగా ప్రద ర్శించారు. సురభి నాటక సమాజంలో సభ్యునిగా చేరి దశాబ్దన్నర కాలం వందలాది ప్రదర్శనలలో పాల్గొన్నారు. బేతా వెంకటరావు, మల్లాది సూర్యనారాయణ వంటి అగ్ర నటులతో అనేక నాటకా లలో నటించారు. తరం మారింది చిత్రంలో కీలక పాత్రను పోషిం చారు. తెల్లాపల వెంకటేశ్వరగుప్తా వద్ద హరికథలో శిక్షణను పొంది వందలాది ప్రాంతాలలో చెప్పారు. హార్మోనిస్తుగా కూడా గుర్తింపును పొందిన పంచనాధం అనేక నాటక సమాజాలకు సంగీతాన్ని సమకూర్చారు. ఏవీ సుబ్బారావుకు శ్రీకృష్ణ పాత్ర తీరు తెన్నులపై ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. విముక్తి, మోహినీ భష్మా సుర, తులసి జలంధర, రామభక్త హనుమాన్, సమ్రాట్, పృధ్వీ రాజ్, శ్రీవేమనయోగి, భూకైలాస్, మహాకవి కాళిదాసు వంటి నాట కాలను ఆయన రచించారు. రామభక్త హనుమాన్, మహాకవి కాళి దాసు నాటకాలకు సంగీత నాటక అకాడమి పురస్కారాలు లభిం చాయి. హైదరాబాద్ రవీంద్రభారతిలో అక్కినేని చేత కనకాభిషే కాన్ని పొందారు. ఆజన్మాంతం కళారంగానికి అంకితమైన పంచ నాదం 1985లో మరణించారు.

మూలాలు మార్చు