మద్రాస్ రెజిమెంట్

మద్రాస్ రెజిమెంట్ భారత దేశంలో గల పురాతన రెజిమెంట్లలో ఒకటి.దీనిని 1750'ల్లో ఏర్పాటుచేసారు.ఈ రెజిమెంట్ భారతదేశ స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ ఇండియా సైన్యంలో ఉండేది.ఇప్పుడు భారత సైనిక దళం లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

మద్రాస్ రెజిమెంట్
మద్రాస్ రెజిమెంట్
క్రియాశీలకం1758–ఇప్పటికీ
దేశంIndia భారత దేశం
శాఖభారత సైనిక దళం
రకముLine infantry
పరిమాణం21 బెటాలియన్లు
Regimental CentreWellington, ఉదకమండలం ఊటీ, తమిళనాడు
నినాదంSwadharme Nidhanam Shreyaha (It is a glory to die doing one’s duty)
War cryVeera Madrassi, Adi Kollu, Adi Kollu (Brave Madrassi, Hit and Kill, Hit and Kill!)
Decorations1 అశోక చక్ర పురస్కారం, 5 మహావీర చక్ర పురస్కారాలు, 36 వీర చక్ర పురస్కారాలు, 304 సేన పతకాలు,15 పరమ విశిష్ట సేవా పతకాలు , 9 కీర్తి చక్ర పురస్కరాలు, 27 శౌర్య చక్ర పురస్కారాలు, 1 ఉత్తమ యుద్ధ సేవా పతకం , 2 యుద్ధ సేవా పతకాలు, 23 అతి విశిష్ట సేవా పతకాలు, 47 విశిష్ట సేవా పతకాలు,
Battle honoursPost Independence Tithwal, Punch, Kalidhar, Maharajke, Siramani and Basantar River.
కమాండర్స్
ప్రస్తుత
కమాండర్
Lt General Rajeev Chopra[1]
Insignia
Regimental InsigniaAn Assaye Elephant posed upon a shield with two crossed swords

చరిత్ర

మార్చు

1639 బ్రిటీష్ వారు అప్పటి విజయనగర రాజైన పెద వేంకటరాయలు అనుమతితో కోరమాండల్ తీరములో చిన్న భాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాన్ని పెట్టుకోవడానికి, వర్తకం జరుపుకోవడానికి తీసుకొన్నారు. ఈ ప్రదేశం అప్పట్లో వండవాసి పాలకుడు దామెర్ల వేంకటపతి నాయకుని ఆధ్వర్యములో ఉండేది. 1644 నాటికి సెయింట్ జార్జి కోటను బ్రిటీష్ వారు నిర్మించుకొన్నారు. తరువాత కొన్ని రోజులలో ఈ ప్రదేశము అంతా వారి వలసకు కేంద్ర స్థావరము అయ్యింది.1758 లో బ్రిటీష్ వారు 100 భారతీయ సైనికులతో ఒక కంపెనీని ఏర్పాటుచేసారు.అదే సంవత్సరం చివరి నాటికి మొదటగా రెండు పదాతి దళాలను ఏర్పాటుచేసి వాటికి కెప్టెన్ లను నియమించారు. మద్రాస్ రెజిమెంట్ ను మద్రాస్ యూరోపియన్ రెజిమెంట్ అను పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ 1660ల్లో ఏర్పాటుచేసింది.ఇది ఆనాటి భారత దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటుచేసిన రెండవ కంపెనీ,ఇది 1748 లో బెటాలియన్ గా మేజర్ లారెన్స్ నాయకత్వంలో ఏర్పడింది.ఈ బెటాలియన్ భారదేశంలో గల ఫ్రెంచివారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధాల్లో పాల్గొంది.

మూలాలు

మార్చు
  1. https://www.covaipost.com/coimbatore/new-colonel-of-madras-regiment-to-assume-charge-on-june-1/