మధ 2020లో తెలుగులో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇందిరా బసవ నిర్మించిన ఈ సినిమాకు శ్రీవిద్య బసవ దర్శకత్వం వహించింది. తృష్ణ ముఖర్జీ, రాహుల్ వెంకట్, అనీష్ కురువిల్లా, బిక్రమ్ జీత్, అజయ్ మంకెనపల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020, మార్చి 13న విడుదలైంది.[1]

మధ
దర్శకత్వంశ్రీవిద్య బ‌స‌వ‌
రచనప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి
నిర్మాతఇందిరా బ‌స‌వ‌
తారాగణంత్రిష్నా ముఖర్జీ, రాహుల్ వెంకట్, అనీష్ కురువిల్ల
ఛాయాగ్రహణంఅభిరాజ్ నాయ‌ర్‌
కూర్పురంజిత్ ట‌చ్‌రివ‌ర్‌
సంగీతంన‌రేశ్ కుమ‌ర‌న్‌
నిర్మాణ
సంస్థ
థర్డ్ ఐ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2020 మార్చి 13 (2020-03-13)
సినిమా నిడివి
105 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

నిషా (త్రిష్ణ ముఖర్జీ) మూడేళ్ల వయసులో తల్లితండ్రుల్ని కోల్పోయి అనాథగా అనాథ ఆశ్రమంలో పెరిగింది. ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న నిషాకు అనుకోకుండా పబ్ లో కలిసిన అర్జున్ (వెంకట్ రాహుల్) తో ప్రేమలో పడుతుంది. అర్జున్ కి ఓ సినిమాలో సినిమాటోగ్రాఫర్‌గా చేసే అవకాశం ఆఫర్ రావడంతో రెండు వారాలు నిషాకి దూరంగా వెళ్తాడు. అఈ సమయంలో ఒంటరిగా ఉన్న నిషా అనుకోని ఘటనల వల్ల బాగా డిస్టర్బ్ కావడంతో ఆమెను మెంటల్ ఆసుపత్రిలో చేరుస్తారు. హాస్పిటల్లో చేరిన నిషా ఎలాంటి సమస్యలను ఎదురుకుంది? అక్కడి నుండి ఎలా బయట పడింది అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • తృష్ణ ముఖర్జీ
  • రాహుల్ వెంకట్ [3]
  • అనీష్ కురువిల్లా
  • బిక్రమ్ జీత్
  • అప్పాజీ
  • రవి వర్మ
  • అజయ్ మంకెనపల్లి
  • శైలజ చతుర్వేది
  • తనూజ్ చౌహన్
  • ప్రమోద్ చౌదరి
  • మోహన్ చౌదరి
  • లక్ష్మికాంత్ దేవ్
  • ఫారూఖ్
  • హర్షద్ బాబు
  • బన్నీ అభిరామ్
 
రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన బతుకమ్మ ఫిల్మోత్సవం (2021) లో "మధ" చిత్ర యూనిట్ సభ్యులకు సత్కారం

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: థర్డ్ ఐ ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఇందిరా బసవ [4]
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీవిద్య బసవ
  • సంగీతం:నరేశ్ కుమారన్
  • సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్
  • కథ, డైలాగ్స్: ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి
  • ఎడిట‌ర్‌: రంజిత్ ట‌చ్‌రివ‌ర్‌
  • పాటలు: రాకేందు మౌళి
  • మిక్స్‌: అర‌వింద్ మీన‌న్‌
  • ఎస్.ఎఫ్‌.ఎక్స్‌: సింక్ సినిమా

మూలాలు మార్చు

  1. ZeeCinemalu (13 March 2020). "'మధ' మూవీ రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  2. The Times of India (11 October 2021). "Madha Movie Review: A technically strong film with an intriguing storyline". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  3. 10TV (8 March 2020). "ఆసక్తికరంగా 'మెగా మేనల్లుడు' రాహుల్ ప్రధాన పాత్రలో నటించిన'మ‌ధ' టీజ‌ర్." (in telugu). Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Sakshi (8 January 2019). "తల్లి ప్రొడ్యూసర్‌.. కూతురు డైరెక్టర్‌". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మధ&oldid=3931981" నుండి వెలికితీశారు