మధు బంగారప్ప
మధు బంగారప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు సొరబ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర ప్రైమరీ & సెకండరీ విద్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]
మధు బంగారప్ప | |||
| |||
రాష్ట్ర ప్రాథమిక, సెకెండరీ విద్య శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 27 మే 2023 | |||
గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
---|---|---|---|
ముందు | బి. సి. నగేష్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 2023 | |||
ముందు | కుమార్ బంగారప్ప | ||
నియోజకవర్గం | సొరబ్ | ||
పదవీ కాలం 2013 – 2018[1] | |||
ముందు | హెచ్. హాలప్ప | ||
తరువాత | కుమార్ బంగారప్ప | ||
నియోజకవర్గం | సొరబ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ (జులై 2021 నుండి - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా దళ్ (సెక్యూలర్) (జులై 2021 వరకు) | ||
తల్లిదండ్రులు | ఎస్. బంగారప్ప, శకుంతల | ||
జీవిత భాగస్వామి | అనిత మధు | ||
బంధువులు | కుమార్ బంగారప్ప (సోదరుడు) శివ రాజ్‌కుమార్ (బావ) | ||
వృత్తి | సినీ నిర్మాత, నటుడు, రాజకీయ నాయకుడు |
వ్యక్తిగత జీవితం
మార్చుమధు బంగారప్ప కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కుమారుడు. అతనికి అన్నయ్య కుమార్ బంగారప్ప & ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అందులో ఒకరు నటుడు శివరాజ్‌కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్.
రాజకీయ జీవితం
మార్చుమధు బంగారప్ప 2013లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థిగా సొరబ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో షిమోగా లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3] మధు బంగారప్ప 2023లో కర్ణాటక శాసనసభకు సొరబ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర ప్రైమరీ & సెకండరీ విద్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4]
సినీ జీవితం
మార్చుసంవత్సరం | సినిమా | ఇతర విషయాలు |
---|---|---|
1989 | శరవేగద శారదరా | కార్యనిర్వాహక నిర్మత |
1990 | అశ్వమేధ | కార్యనిర్వాహక నిర్మత |
1992 | పురుషోత్తమ | నిర్మాత |
1992 | బెల్లియప్ప బంగారప్ప | నిర్మాత |
1994 | గండుగలి | నటుడు |
1995 | థాయీ ఇల్లడ తవరు | ప్రెజెంటర్ |
1996 | ఆదిత్య | నటుడు |
2003 | గోకర్ణ | నటుడు |
2006 | కల్లరాలి హూవాగి | నిర్మాత |
మూలాలు
మార్చు- ↑ "Sitting and previous MLAs from Sorab Assembly Constituency". elections.in. Retrieved 31 Jul 2021.
- ↑ Sakshi (27 May 2023). "కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ The Hindu (30 July 2021). "Madhu Bangarappa joins Congress" (in Indian English). Archived from the original on 6 June 2023. Retrieved 6 June 2023.
- ↑ Namasthe Telangana (27 May 2023). "కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధూ దగ్గరే ఆర్థిక శాఖ.. డీకేకు నీటి పారుదల శాఖ". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.