మనసును మాయ సేయకే 24 జనవరి 2014 లో విడుదల అయింది.

మనసును మాయ సేయకే
(24 జనవరి 2014 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేష్ పి కుమార్
నిర్మాణం జైసన్ పులికొట్టిల్ – విన్స్ మంగడన్
తారాగణం ప్రిన్స్
సేతు, రిచా పనాయ్, దిశా పాండే
సంగీతం మణికాంత్
విడుదల తేదీ 2014
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథసవరించు

జై (సేతు) ఒకపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎండి. జై భార్య మైథిలి (రిచా పనాయ్). జై ప్రేమించి మైథిలిని పెళ్ళి చేసుకున్నప్పటికీ తనతో సరిగ్గా ఉండడు. ఇది పక్కన పెడితే అనాథ అయిన శివ (ప్రిన్స్) వన్యప్రాణి ఫోటో గ్రాఫర్. శివ సివిల్ ఆర్కిటెక్ట్ అయిన లాస్య (దిశా పాండే) ని చూసి ప్రేమలో పడతాడు. శివ తన ప్రేమని చెప్పాలనుకునే టైంలోనే లాస్య ఆత్మ హత్య చేసుకుంటుంది. అక్కడి నుండి కట్ చేస్తే శివ ఆకాశ రామన్నలా జైకి కాల్ చేసి తన చేతే తన ఫ్రెండ్స్ ని చంపిస్తుంటాడు. అసలు లాస్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అసలు శివ జై చేత తన సొంత ఫ్రెండ్స్ ని ఎందుకు చంపేలా చేసాడు? జైకి శివకి ఉన్న సంబంధం ఏమిటి? అనేది సినిమా క్లైమాక్స్.

బయటి లింకులుసవరించు