మనీషా కోయిరాలా

నటి, సామాజిక కార్యకర్త

మనీషా కొయిరాలా (జ. 16 ఆగస్టు 1970) ఒక నేపాలీ నటి. పలు భారతీయ భాషల సినిమాల్లో నటించింది. నేపాల్ లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్ కు 22వ ప్రధాన మంత్రిగా పని చేశాడు. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో అనేక ఇతర పురస్కారాలు అందుకుంది. 2001 లో ఈమె నేపాల్ రాజ ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది.

మనీషా కొయిరాలా
2017 లో డియర్ మాయా చిత్ర ప్రమోషన్ లా మనీషా
జననం (1970-08-16) 1970 ఆగస్టు 16 (వయసు 54)[1][2]
ఖాట్మండు, నేపాల్
పౌరసత్వంనేపాలీ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1989–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సామ్రాట్ దహల్
(m. 2010; div. 2012)
తల్లిదండ్రులు
  • ప్రకాష్ కొయిరాలా (తండ్రి)

కొయిరాలా పాఠశాలలో చదువుతుండగానే 1989 లో ఫేరి భేతౌలా అనే నేపాలీ సినిమాలో మొదటిసారి నటించింది. చిన్నప్పటి నుంచి వైద్యురాలు అవ్వాలనుకున్న ఆమె మొదట మోడల్ గా పని చేసింది. 1991 లో వచ్చిన హిందీ సినిమా సౌదాగర్ తో బాలీవుడ్ లో ప్రవేశించింది. తర్వాత వచ్చిన సినిమాలు వ్యాపార పరంగా సాధించకపోయిన 1942 - ఎ లవ్ స్టోరీ (1994), తమిళ చిత్రం బాంబే (1995) సినిమాలతో నాయికగా మంచి పేరు సంపాదించింది. తర్వాత వచ్చిన అగ్నిసాక్షి (1996), ఇండియన్ (1996), గుప్త్ - ది హిడెన్ ట్రూత్ (1997), కచ్చే ధాగే (1999), కంపెనీ (2000), ఏక్ చోటీసి లవ్ స్టోరీ (2002) సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.

మనీషా కోయిరాలా నటించిన తెలుగు చిత్రాలు

మార్చు

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2000 సవాల్ దస్ కోటి కా సహ-హోస్ట్
2003 లార్జర్ దన్ లైఫ్ డాక్యుమెంటరీ
2015 ఫెమినా మిస్ ఇండియా 2015 న్యాయమూర్తి
2024 హీరమండి: డైమండ్ బజార్ మాలికాజాన్ నెట్‌ఫ్లిక్స్ విడుదల

మూలాలు

మార్చు
  1. "The Tribune, Chandigarh, India – World". Tribuneindia.com. Retrieved 19 August 2012.
  2. Roy Mitra, Indrani (20 December 2005). "I need to move on: Manisha Koirala". Rediff.com. Retrieved 14 March 2008.