క్రిమినల్ (సినిమా)

క్రిమినల్ 1994లో మహేశ్ భట్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె. ఎస్. రామారావు నిర్మించాడు. కీరవాణి స్వరాలు సమకూర్చాడు. తెలుసా మనసా అనే పాట ప్రజాదరణ పొందినది. ఆంగ్ల చిత్రం The Fugitive చిత్రం ఆధారంగా, ఈ చిత్రం నిర్మించబడినది.[1] ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తీశారు. తెలుగులో చెప్పుకోదగ్గ విజయం సాధించినా హిందీలో మాత్రం పర్వాలేదనిపించింది.[2]

క్రిమినల్
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం మహేష్ భట్
తారాగణం అక్కినేని నాగార్జున,
రమ్యకృష్ణ,
మనీషా కొయిరాలా
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • డాక్టర్ అజయ్ కుమార్ గా నాగార్జున
 • డాక్టర్ శ్వేత గా మనీషా కొయిరాలా
 • ఏసీపీ రమ్యగా రమ్యకృష్ణ
 • అడ్వకేట్ చంద్రశేఖర్ గా సత్యనారాయణ
 • శ్రీనివాసరావు గా కోట శ్రీనివాసరావు
 • ఎస్ పి తేజ గా నాసర్
 • డాక్టరు ప్రతాప్ గా శరత్ బాబు
 • యశోద గా సుధ
 • కాంపౌండర్ చిట్టిబాబు గా బ్రహ్మనందం
 • ఇనస్పెకర్ గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం
 • కమిషనర్ గా దేవదాస్ కనకాల
 • లాయర్ గా కోట శంకరరావు .

పాటలు మార్చు

 • తెలుసా మనసా, ఇది ఏ నాటి అనుబంధమో, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
 • ముద్దంటే వద్దంటే , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
 • పాప్ కీ పాప్కి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,కె ఎస్ చిత్ర, ఎం ఎం కీరవాణి
 • హాల్లో గురూ , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
 • జమ జమ జమా, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర , సుజాత
 • తెలుసా మనసా 2.సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎం ఎం కీరవాణి, కె ఎస్ చిత్ర.

మూలాలు మార్చు

 1. Eenadu. "'తెలుసా.. మనసా..' 25ఏళ్లయినా ఎవర్‌గ్రీన్‌! - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2019-10-16. Retrieved 2019-10-16.
 2. Sakshi (13 May 2020). "'క్రిమినల్‌'కు పాతికేళ్లు ఈ సందర్భంగా." Sakshi. Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.