మనుషుల్లో దేవుడు

1974లో విడుదలైన తెలుగు చిత్రం

మనుషుల్లో దేవుడు 1974 లో బి. వి. ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో ఎన్. టి. ఆర్, వాణిశ్రీ ముఖ్య పాత్రలు పోషించారు.

మనుషుల్లో దేవుడు
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.ప్రసాద్
నిర్మాణం అట్లూరి పుండరీకాక్షయ్య
తారాగణం ఎన్.టి.రామారావు,
వాణిశ్రీ,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం సాలూరు హనుమంతరావు,
టి.వి.రాజు
నిర్మాణ సంస్థ శ్రీ భాస్కర చిత్ర
భాష తెలుగు

కథ మార్చు

తల్లిని, చెల్లాయిని పేదరికం నుంచి బయట పడవేయాలనే ఉద్దేశ్యంతో పెద్ద చదువులు చదవాలనే తలంపుతో పట్నం పారిపోయి వచ్చి వారాలు తింటూ, వీధి దీపాల దగ్గర చదువుకునే రాజా అనే కుర్రవాడిని మంచివాడయిన ఒక సంపన్న వైద్యుడు దగ్గరకు తీస్తాడు. రాజా పెద్ద వాడయి, ఆ వైద్యుని కుటుంబం కోసం ఎనలేని త్యాగాలు చేస్తాడు. ప్రేమించిన ప్రియురాలిని కూడా దూరం చేసుకుంటాడు[1].

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  1. అమ్మమ్మోయీ ఈ రోజుల్లో కుర్రవాళ్ళు - పి.సుశీల - రచన: కొసరాజు - సంగీతం: ఎస్.హనుమంతరావు
  2. ఏయ్ రేఖా శశిరేఖా కోపమా తాపమా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె - సంగీతం: టి.వి.రాజు
  3. గోపాల ననుపాలింప రావా - ఎస్.జానకి - రచన: దాశరథి - సంగీతం: ఎస్.హనుమంతరావు
  4. చల్లని స్వామీ చీకటి బ్రతుకున నీవు - ఎస్.జానకి - రచన: దాశరధి - సంగీతం: ఎస్.హనుమంతరావు
  5. చెట్టంత మగవాడు చెంతనే ఉన్నాడు - పి.సుశీల - రచన: సినారె - సంగీతం: టి.వి.రాజు
  6. వరూధిని ప్రవరాఖ్య (నాటకం) - ఘంటసాల,పి.సుశీల - రచన:సినారె - సంగీతం: ఎస్.హనుమంతరావు
  7. హల్లో మేడమ్ హల్లో మేడమ్ మిష్టర్ - ఘంటసాల - రచన: కొసరాజు - సంగీతం: ఎస్.హనుమంతరావు

మూలాలు మార్చు

  1. వెంకట్రావు (9 April 1974). "చిత్రసమీక్ష మనుషుల్లో దేవుడు". ఆంధ్రపత్రిక దినపత్రిక. p. 2. Retrieved 27 December 2017.[permanent dead link]

బయటి లింకులు మార్చు