పిఆర్ వరలక్ష్మి

పిఆర్ వరలక్ష్మి (ఆంగ్లం: P. R. Varalakshmi) భారతీయ నటి. ఆమె 1970లు, 1980లలో ప్రధానంగా మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించింది. ఆమె 1980లలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది. హిందీ చిత్రాలలో కూడా నటించిన ఆమె ప్రస్తుతం పలు టీవి ధారావాహికలలో నటిస్తోంది. ఆమె 1972లో కె.ఎస్‌.గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన వఝైయాది వఝై సినిమాతో అరంగేంట్రం చేసి అన్నీ భాషల్లో దాదాపు 800 సినిమాల్లో నటించింది.[1]

పిఆర్ వరలక్ష్మి
జాతీయతఇండియన్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1966 - 2008
2017 - ప్రస్తుతం
పిల్లలుఇద్దరు ఆడపిల్లలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రామారావుతో కలిసి నటించింది. ఆమె ముత్తురామన్, అతని కుమారుడు కార్తీక్; శివాజీ గణేశన్, అతని కుమారుడు ప్రభు; తెలుగు సూపర్ స్టార్ కృష్ణ, అతని కుమారుడు మహేష్ బాబు.. ఇలా రెండు తరాలకు చెందిన నటులతో ఆమె నటించింది. ఆమె ప్రముఖ హీరోలు జెమినీ గణేశన్, కమల్ హాసన్ వంటి వారి సరసన నటించింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు

తెలుగు

మార్చు
సంవత్సరం సినిమా
1967 శ్రీ కృష్ణావతారం
1972 కొడుకు కోడలు
1973 ధనమా? దైవమా?
1974 మనుషుల్లో దేవుడు
1974 ఇంటి కోడలు
1975 తోట రాముడు
1975 జెబు దొంగ
1975 మాయా మచ్ఛీంద్ర
1976 ఈ కాలపు పిల్లలు
1976 సీతా కళ్యాణం
1976 భక్త కన్నప్ప
1981 స్వర్గం
1981 గడసరి అత్త సొగసరి కోడలు
1982 కలవారి సంసారం
1984 మయూరి
1988 ఇల్లు ఇల్లాలు పిల్లలు
1988 స్టేషన్ మాస్టర్
1989 శ్రీదేవి కామాక్షి కటాక్షం
1989 చెన్నపట్నం చిన్నోళ్లు
1990 ఇదేం పెళ్లాం బాబోయ్
1992 సంసారాల మెకానిక్
1992 అసాధ్యులు
1993 అంకురం

హిందీ

మార్చు
  • సీతా స్వయంవర్ (1976)
  • దేవి దుర్గా శక్తి (2001)
  • పార్ధై కీ పిచాయ్

టెలివిజన్ సీరియల్స్

మార్చు
Year Serial Role Language Channel
1999–2000 ఇది కథ కాదు తెలుగు ETV Telugu
2001–2002 అత్తమ్మ Gemini TV
2005–2006 సెల్వి సరస్వతి తమిళం Sun TV
2007–2009 అరసి
2007–2010 అమ్మాయి కాపురం తెలుగు Gemini TV
2007–2008 చెల్లమది నీ ఎనక్కు తమిళం Sun TV
2010–2012 చెల్లామెయ్
2017–2018 నినైక తేరింత మనమే కామాక్షి Star Vijay
2018–2019 నీలకుయిల్
2019 యారది నీ మోహిని కులగిని Zee Tamil
2019–2020 తేన్మొళి B. A. దేవనై Star Vijay
2019–2022 రోజా అరుళ్వఖు అముతనాయకి Sun TV
2021–present కాట్రుకెన్న వెలి Star Vijay
2021–present సుందరి గంతిమతి Sun TV
2022 అమ్మన్ తాయమ్మ Colors Tamil
2022–present పచ్చకిలి
2022 నినైతలే ఇనిక్కుమ్ స్పెషల్ అప్పియరెన్స్ Zee Tamil

మూలాలు

మార్చు
  1. "Senior Actress P R Varalakshmi About Her Personal Life Struggles - Sakshi". web.archive.org. 2023-01-24. Archived from the original on 2023-01-24. Retrieved 2023-01-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)