మమిట్
మమిట్, మిజోరాం రాష్ట్రంలోని మమిట్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. గ్రామాల పునర్వ్యవస్థీకరణ ద్వారా మమిట్ పట్టణం ఏర్పడింది.
మమిట్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°56′N 92°29′E / 23.93°N 92.48°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా | మమిట్ |
Elevation | 718 మీ (2,356 అ.) |
Population (2001) | |
• Total | 5,261 |
భాషలు | |
• అధికారిక | మిజో |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎంజెడ్ |
భౌగోళికం సవరించు
మమిట్ పట్టణం 23°56′N 92°29′E / 23.93°N 92.48°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] సముద్రమట్టానికి 718 మీటర్లు (2,355 అడుగులు) ఎత్తులో ఉంది.
జనాభా సవరించు
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] మమిట్ పట్టణంలో 7,884 మంది జనాభా ఉన్నారు. ఇందులో 4,074 మంది పురుషులు, 3,810 మంది స్త్రీలు ఉన్నారు. మమిట్ సగటు అక్షరాస్యత 95.40% కాగా, జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 95.86% కాగా, స్త్రీల అక్షరాస్యత 94.92%గా ఉంది. ఈ పట్టణ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
విద్య సవరించు
ఇక్కడ మిజోరాం విశ్వవిద్యాలయం పరిధిలోని మమిట్ కళాశాల, అనేక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
రవాణా సవరించు
మమిట్ పట్టణానికి, ఐజాల్ నగరానికి మధ్య 89 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, మాక్సిక్యాబ్ లతో రవాణా సౌకర్యం ఉంది.
మీడియా సవరించు
మమిట్ పట్టణంలో మమిట్ టైమ్స్ అనే ప్రధాన వార్తాపత్రిక ఉంది.[3]
మూలాలు సవరించు
- ↑ Falling Rain Genomics, Inc - Mamit
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 29 December 2020.
- ↑ "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 జూన్ 2013. Retrieved 29 డిసెంబరు 2020.