మరదలు పెళ్ళి క్రైమ్‌, డిటెక్టివ్ అంశాలతో వెలువడిన మొట్టమొదటి తెలుగు సినిమా. ముక్కామల ఈ సినిమా హీరో, దర్శక నిర్మాత.

మరదలు పెళ్ళి
(1952 తెలుగు సినిమా)
TeluguFilm MaradaluPelli.JPG
దర్శకత్వం ముక్కామల కృష్ణమూర్తి
నిర్మాణం ముక్కామల కృష్ణమూర్తి,
కేతరాజు భాస్కరరావు
సంగీతం చిత్తూరు నాగయ్య
టంగుటూరి సూర్యకుమారి
గీతరచన శ్రీశ్రీ
సంభాషణలు శ్రీశ్రీ,
బెల్లంకొండ రామదాసు
నిర్మాణ సంస్థ ఎం.కె.ఎం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథసవరించు

ప్రకాష్ (ముక్కామల) ఒక పిచ్చి ఆసుపత్రి డాక్టరు. అతడు తన మరదలు గిరిజ (కృష్ణకుమారి)ను పిచ్చిగా ప్రేమిస్తాడు. తన మార్గానికి అడ్డు అని భావించిన భార్య లక్ష్మికి విషం పెట్టి చంపుతాడు. హత్యానేరాన్ని తెలివిగా గిరిజను ప్రేమిస్తున్న తన అసిస్టెంట్ డాక్టరుపై మోపి, అతనిని జైలుకు పంపుతాడు. కాని నిజంగా తానే హంతకుడని ప్రపంచానికి క్రమేణా తెలియవస్తుంది. ఒక హత్య మరొక హత్యకు దారితీస్తుంది. డాక్టర్ ప్రకాష్ రెండు మూడు హత్యలు చేసి చివరకు "డిటెక్టివ్" చేతిలో చనిపోతాడు. గిరిజ, అసిస్టెంట్ డాక్టర్ పెళ్ళి చేసుకుంటారు. ఈ చిత్రానికి హిందీ సినిమా పాగల్ మాతృక[1].

నటీనటులుసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలను శ్రీశ్రీ రచించాడు. చిత్తూరు వి.నాగయ్య, టంగుటూరి కృష్ణకుమారి స్వరకల్పన చేశారు.[2]

 1. జాబిల్లి ఓ జాబిల్లి జలరాశి కెరటాల జిలుగు వెన్నెల చిలికి - టి.సూర్యకుమారి
 2. పిలిచే గోదావరోడ్డు నూరూరించే బందరు లడ్డు - వక్కలంక సరళ
 3. నేడు నాటిన మొలక రేపు ఫలమిస్తుంది నేడు కాంచిన కలలు
 4. అనురాగం అంబరమైతే ఆనందం సాగరమైతే
 5. ఆరిపోయే దీపిక ఆస్తమించెరా అమృతచంద్రిక
 6. జయ జయ వెంకట రమణ నిరుపమ కరుణా భరణా
 7. నరుడా జడుడా .. నిజం దాచడం నీ తరమా నా తరమా
 8. నిరాశా జీవీకీవేళ జగాన దారి లేదుగా బ్రతుకే కూలిపోయే
 9. మై డాక్టర్ కొట్నీస్ తూ లీలా చట్నీస్ మనఇద్దరి బ్రతుకే
 10. హైలెస్సా హైలెస్సా ..పదవే పదవే ఓ పడవా

మూలాలుసవరించు

 1. అలనాటి మేటి చిత్రాలు - భీశెట్టి - ఆంధ్ర సచిత్రవారపత్రిక - 26-10-1990 - పేజీ 34
 2. "మరదలు పెళ్ళి - 1952". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 18 June 2016.[permanent dead link]