మరుగేలర ఓ రాఘవ (కీర్తన)
(మరుగేలర ఓ రాఘవ నుండి దారిమార్పు చెందింది)
మరుగేలర ? ఓ రాఘవ అనేది ఒక సాంప్రదాయ కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.
ఈ కీర్తన నటభైరవి జన్యమైన జయంతశ్రీ రాగం, దేశాదితాళం లో గానం చేస్తారు.[1]
కీర్తన
మార్చుమరుగేలర ఓ రాఘవ
మరుగేల చరాచర రూప పరా -
త్పర సూర్య సుధాకర లోచన
భారతీయ సంస్కృతి
మార్చు- ఎం. ఎల్. వసంతకుమారి[2], మహారాజపురం సంతానం[3] మొదలైన ఎందరో సంగీత విద్వాంసులు ఈ కీర్తనను శాస్త్రీయంగా గానం చేశారు.
- సప్తపది సినిమాలో ఈ కీర్తనను ఎస్.జానకి గానం చేశారు.[4] దీనిని కె.వి.మహదేవన్ స్వరపరచారు. దర్శకులు కె.విశ్వనాథ్ ఈ పాటని భమిడిపాటి సవిత పై చిత్రీకరించారు.
పూర్తి పాఠం
మార్చు- వికీసోర్స్ లో మరుగేలర ఓ రాఘవ పూర్తి కీర్తన.