ఎం. ఎల్. వసంతకుమారి
ఎం.ఎల్.వసంతకుమారి (M. L. Vasanthakumari) (జూలై 3, 1928 - అక్టోబర్ 31, 1990) 1950లలో కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో నేపథ్యగాయని. ఆమె పూర్తి పేరు మద్రాసు లలితాంగి వసంతకుమారి. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మికు ఉన్నంత పేరుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్ ఆమెకు సమకాలీనులు. నటి శ్రీవిద్య అమే కూతురు. 1958లో విడుదలైన భూకైలాస్ చిత్రంలో ఆమె పాడిన మున్నీట పవళించు నాగశయనా పాట, తెలుగులోనే కాకుండా ఆమె పాడిన పాటల్లో అత్యుత్తమమైనది. మాయాబజార్ (1957) చిత్రంలో ఆమె పాడిన శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా పాట కూడా బాగా పేరుపొందింది.
ఎం.ఎల్.వసంతకుమారి | |
---|---|
జననం | మద్రాసు లలితాంగి వసంతకుమారి జూలై 3, 1928 మద్రాసు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం |
మరణం | అక్టోబరు 31, 1990 చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | ఎం.ఎల్.వి. |
వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసురాలు, చలనచిత్ర నేపథ్యగాయని |
మతం | హిందూ మతం |
భార్య / భర్త | వికటం ఆర్.కృష్ణమూర్తి |
పిల్లలు | కె.శంకరరామన్, కీ.శే.శ్రీవిద్య (నటి) |
చిత్రసమాహారం
మార్చుతెలుగు
మార్చు- బీదలపాట్లు (1950)
- నవ్వితే నవరత్నాలు (1951)
- కోడరికం (1953)
- నా ఇల్లు (1953)
- అమ్మలక్కలు (1953)
- కాళహస్తి మహాత్యం (1954)
- నాగులచవితి (1956)
- మాయాబజార్ (1957)
- నలదమయంతి (1957)
- భలే అమ్మాయిలు (1957)
- వరుడు కావాలి (1957)
- సతీ అనసూయ (1957)
- భూకైలాస్ (1958)
- జయభేరి (1959)
- వచ్చిన కోడలు నచ్చింది (1959)
పురస్కారాలు - బిరుదులు
మార్చు- 1976 - మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్
- 1977 - సంగీత కళానిధి బిరుదు
- భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ పురస్కారం