మరో చరిత్ర 1978 లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన విషాదాంత ప్రేమకథా చిత్రం. ఇందులో కమల్ హాసన్, సరిత ముఖ్య పాత్రల్లో నటించారు. అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపులో విడుదలైన సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు సినీ రంగంలో కమల్ హాసన్, సరితలకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది.

మరో చరిత్ర
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
నిర్మాణం రమా అయ్యంగన్నల్
కథ కె.బాలచందర్
తారాగణం కమల్ హాసన్
సరిత
మాధవి
సంగీతం ఎం. ఎస్. విశ్వనాథన్
నేపథ్య గానం వాణీ జయరాం,
ఎస్.జానకి,
ఎల్.ఆర్.ఈశ్వరి,
రమోల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన ఆచార్య ఆత్రేయ
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం బి.ఎస్.లోకనాధన్
నిర్మాణ సంస్థ అండాళ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ మే 19, 1978 (1978-05-19)
నిడివి 169 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక హిందూ యువతి విశాఖపట్నంలో ప్రేమలో పడతారు. ఇద్దరూ దృఢమైన వ్యక్తిత్వం కలవారు. అడ్డుచెప్పిన పెద్దలతో వాదనకు దిగుతారు. ఒక సంవత్సరం ఒకరినొకరు కలుసుకొనకుండా తమ ప్రేమ నిజమైనదని నిరూపించడానికి సంసిద్ధమవుతారు. కానీ పరిస్థితుల ప్రభావంతో ఇద్దరూ కలిసి మరణిస్తారు.

సంక్షిప్త కథ

మార్చు

బాలు (కమల్ హాసన్) విశాఖపట్నంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి తమిళనాడునుండి విశాఖపట్నం వస్తాడు. వారి పక్కింటి అమ్మాయి స్వప్న (సరిత) తో ప్రేమలో పడతాడు. వచ్చీరాని తెలుగుతో బాలు, సరితల ప్రేమాయణం సరదాగా సాగుతుంది. అన్ని కథలలాగానే వారి ప్రేమ వ్యవహారం బయట పడుతుంది. ఇద్దరి తల్లిదండ్రులు (ముఖ్యంగా బాలు తండ్రి, స్వప్న తల్లి) వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తమ మనసు మార్చుకొనేది లేదని బాలు, స్వప్న తెగేసి చెబుతారు. ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా, ఉత్తరాలు కూడా రాసుకోకుండా ఉండమనీ, తరువాత కూడా వాళ్ళు పెళ్ళి చేసుకోవాలని ఇష్టపడితే అప్పుడు ఆలోచిస్తామని పెద్దవాళ్ళు షరతు పెడతారు.

బాలు విశాఖపట్నంనుండి హైదరాబాదు వస్తాడు. అక్కడ అతనికి ఒక నర్తకి (మాధవి) తో పరిచయమౌతుంది. స్వప్నతో బాలు ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొన్న మాధవి అతనిని ప్రోత్సహించి నాట్యం నేర్పుతుంది. మధ్యలో ఒకసారి విహారయాత్రలో కలుసుకొనే అవకాశం వచ్చినా గాని స్వప్న దృఢంగా అతనికి కనపడకుండా ఉంటుంది. యేడాది పూర్తి అయినాక బాలు విశాఖపట్నం తిరిగి వస్తాడు. ఆ రోజును సంతోషంగా జరుపుకోవాలనుకొన్న స్వప్న అపాయంలో చిక్కుకుంటుంది. ఎప్పటినుండో ఆమెపై కన్ను వేసిన మరొక యువకుడు ఆమెపై అత్యాచారానికి పూనుకొంటాడు. బాలును అపార్థం చేసుకున్న మాధవి అన్నయ్య అతడిని చంపేందుకు రౌడీలను పంపుతాడు. అలా అత్యాచారానికి గురైన స్వప్న, చావుదెబ్బలు తిన్న బాలు చావుబతుకుల మధ్య కలుస్తారు. చివరికి కొండపై నుంచి పడి ఇద్దరూ మరణిస్తారు.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

చక్కని పాటలు, బాలచందర్ దర్శక ప్రతిభ, పాత్రలకు తగిన నటన, సంభాషణలు, వైజాగ్, భీమిలి, గాజువాక అందాలు ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి. ఇందులో కలకాలం నిలిచిపోయిన పాటలు:

పాట రచయిత సంగీతం గాయకులు
ఏ తీగ పూవునొ, ఏకొమ్మ తేటినొ కలిపింది ఏవింత అనుబంధమో ఆచార్య ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథన్ కమల్ హాసన్, పి.సుశీల
కలసి వుంటే కలదు సుఖం కలసివచ్చిన అదృష్టము ఆచార్య ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథన్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, రమోలా
పదహారేళ్ళ వయసుకు, నీలో నాలో చేసే చిలిపి పనులకు కోటి దండాలు శతకోటి దండాలు ఆచార్య ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథన్ ఎస్.జానకి
భలె భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ ఆచార్య ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథన్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి
విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేననీ ఆచార్య ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథన్ వాణీ జయరాం

ఏ తీగ పువునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమో , రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

ఇతర విశేషాలు

మార్చు
  • ఈ సినిమా డబ్బింగ్ లేకుండా తమిళనాడులో విడుదల చేయబడి మద్రాసులో సంవత్సరంపాటు నడచింది.
  • 1981లో ఇదే సినిమాను ఎల్.వి.ప్రసాద్ హిందీలో "ఏక్ దూజె కేలియె" అన్న పేరుతో పునర్నిర్మించాడు. హిందీలో కమల్ హాసన్, రతి అగ్నిహోత్రి నటించారు. హిందీలో పాటలు కూడా బాలు పాడాడు. హిందీ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ("తేరె మేరె బీచ్ మె, కైసా హై యె బంధన్ అన్‌జానా", "హమ్ బనె తుమ్ బనె ఏక్ దూజె కెలియె" వగైరా)
  • తెలుగు, హిందీ సినిమాలు కూడా హైదరాబాదులో 365రోజులు ఆడాయి.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు