రమోలా 1970వ దశకంలో ఒక వెలుగు వెలిగిన సినీ నేపథ్యగాయని. ఈమె గాయని మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్టు, రంగస్థల నటి, శాస్త్రీయ నృత్యకారిణి కూడా.

రమోలా
దస్త్రం:Ramola Singer.jpg
సినీ నేపథ్యగాయిని రమోలా
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లురామం
జననంసెప్టెంబరు 24,1946
విజయనగరం, విజయనగరం జిల్లా
సంగీత శైలినేపథ్యగానం, కర్ణాటక సంగీతము
వృత్తిగాయని
వాయిద్యాలుగాత్ర సంగీతం,డబ్బింగ్ ఆర్టిస్టు, రంగస్థల నటి, శాస్త్రీయ నృత్యకారిణి
క్రియాశీల కాలం1957-2005

విశేషాలు

మార్చు

ఈమె అసలు పేరు రామం. ఈమె విజయనగరంలో 1946, సెప్టెంబరు 24వ తేదీన జన్మించింది.[1] ప్రముఖ నటి వైజయంతిమాల ఈమె పేరును 'రమోలా'గా మార్చింది. ఈమె తండ్రిపేరు ఉపద్రష్ట సూర్యనారాయణ, తల్లి పేరు సీతారామమ్మ. ఈమె పది మంది సంతానంలో తొమ్మిదవ సంతానం. మహాకవి శ్రీశ్రీ భార్య సరోజ ఈమెకు ఒక అక్క కాగా హాస్యనటుడు రాజబాబు భార్య లక్ష్మీ అమ్ములు ఈమె చెల్లెలు. ఈమె 8వ తరగతి వరకు విజయనగరంలో చదువుకుని పిమ్మట మద్రాసుకు చేరుకుంది. మద్రాసు ఆంధ్రమహిళా సభలో మెట్రిక్ చేసింది. ఈమె చిన్నతనంలోనే అన్ని కార్యక్రమాలలో పాల్గొనేది. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య ఈమెను ప్రోత్సహించారు. మొదట సినిమాలలో కోరస్‌లు పాడటంతో మొదలైన ఈమె సినీ ప్రస్థానం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 3000కు పైగా పాటలు, 75 చిత్రాలలో పాత్రధారణ, మరెన్నో చిత్రాలలో గాత్రధారణలతో ముగిసింది.

ఈమె ఎందరో హీరోయిన్‌లకు, క్యారెక్టర్ యాక్టర్లకు డబ్బింగ్ చెప్పింది. మరపురాని మనిషి, జీవనజ్యోతి, కృష్ణవేణి, నాయుడుబావ, నామాల తాతయ్య, జాతకరత్న మిడతంభొట్లు మొదలైన సినిమాలలో నటించింది. రంగస్థలంపై కుమ్మరిమొల్ల, సప్తపది మొదలైన నాటకాలలో జె.వి.సోమయాజులు, పొట్టి ప్రసాద్, జె.వి.రమణమూర్తి మొదలైన వారి సరసన నటించి గొప్ప పేరు సంపాదించుకుంది.

భరతనాట్యంలో శిక్షణ పొంది వైజయంతిమాల డాన్స్ ట్రూపులో చేరి రాధాకృష్ణ, చండాలిక మొదలైన నృత్యరూపకాలలో నాట్యం చేసి, ఢిల్లీ, అహ్మదాబాద్, కలకత్తా, మాంచెస్టర్ వంటి చోట్ల వందలాది ప్రదర్శనలిచ్చింది.

ఈమె గాయని, డబ్బింగ్ కళాకారిణి, నృత్య కళాకారిణి, నటి మాత్రమే కాక రచయిత్రి కూడా. ఈమె సుమారు 35 పాటలను రచించింది.

తెలుగు సినిమా పాటల జాబితా

మార్చు

ఈమె గానం చేసిన వందలాది తెలుగు పాటలలో కొన్ని ఈ క్రింది జాబితాలో:

(ఈ సమాచారం సరికాదనిపిస్తున్నది.పైన చెప్పిన ప్రకారం ఈమె 1946లో పుడితే 1957 నుంచి అంటే పదకొండేళ్ళ వయసు నుండే నేపధ్యగానం చేస్తున్నారా?)[2]

క్రమ సంఖ్య సినిమా పేరు పాట పల్లవి సహ గాయకుడు/ గాయని సంగీత దర్శకుడు గేయ రచయిత సినిమా విడుదలైన సంవత్సరం
1 రత్నగిరి రహస్యం నాటు రాజా అయ్యా నాటురా కొంచెం నాగరీకం కె.రాణి ఎం.ఎస్.రాజు,
టి.జి.లింగప్ప
శ్రీశ్రీ 1957
2 రత్నగిరి రహస్యం యవ్వనమే ఈ యవ్వనమే అద్భుతరాగం అంది ఫలించు కె.రాణి ఎం.ఎస్.రాజు,
టి.జి.లింగప్ప
శ్రీశ్రీ 1957
3 చిలకా గోరింక ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి బరువెక్కెను బరువెక్కెను జయదేవ్ ఎస్.రాజేశ్వరరావు శ్రీశ్రీ 1966
4 సంబరాల రాంబాబు విన్నారా విన్నారా.. ఈ చిత్రం కన్నారా... సంబరాల రాంబాబు శ్రీమంతుడయ్యాడు వి.కుమార్ రాజశ్రీ 1970
5 శ్రీదేవి గుండుమల్లె చెండుచూసి గుండెలోనే పొంగు జి.కె.వెంకటేష్ జి.కె.వెంకటేష్ శ్రీశ్రీ 1970
6 కొరడారాణి కనులలోన కతలు దాచి నడకలోన కులుకు దాచి ఎస్.పి.బాలు సత్యం రాజశ్రీ 1972
7 దత్తపుత్రుడు మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా ఘంటసాల టి.చలపతిరావు సి.నా.రె. 1972
8 నిజం నిరూపిస్తా బంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగ ఎస్.పి.బాలు సత్యం ఆరుద్ర 1972
9 కలవారి కుటుంబం చిలిపి చూపుల దాన చిక్కవే జాణా అవునన్నాకాదన్నా ఎస్.పి.బాలు సత్యం కొసరాజు 1972
10 ధనమా?దైవమా? కుడి ఎడమైతే పొరబాటు (పేరడి పాట) పట్టాభి,
విల్స్‌న్,
జ్యోతిఖన్నా,
విజయలక్ష్మి కన్నారావు,
కౌసల్య
టి.వి.రాజు సి.నా.రె 1973
11 వాడే వీడు చీరలేని చిన్నదానా ఓయబ్బా చిగురాకు వన్నె ఘంటసాల సత్యం సి.నా.రె 1973
12 మల్లమ్మ కథ ముత్యాల బొమ్మకు మొగుడొస్తాడే ఈ మురిపాల పి.సుశీల,కౌసల్య ఎస్.పి.కోదండపాణి సి.నా.రె. 1973
13 బంట్రోతు భార్య ఆనింగి ఈనేల ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలు,
రఘురాం
రమేష్ నాయుడు దాశరథి 1974
14 బంట్రోతు భార్య పిడికెడు ఎస్.పి.బాలు,
పి.సుశీల,
ఎల్.ఆర్.అంజలి,
చంద్రశేఖర్,
రఘురాం
రమేష్ నాయుడు దాశరథి 1974
15 ఈ కాలపు పిల్లలు యేమన్నాడే అతడు అవునన్నాడా యేం చేశాడే పి. సుశీల సత్యం దాశరథి 1975
16 జీవన జ్యోతి ఎందుకంటె ఏం చెప్పను ఏమిటంటే ఎలా చెప్పను ఎస్.పి. బాలు కె.వి.మహదేవన్ సి.నా.రె. 1975
17 రక్త సంబంధాలు అరే మాకీ మీకీ మంచి జోడా కలవాలా మత్తులోన ఎస్.పి.బాలు సత్యం ఆరుద్ర 1975
18 పాడవోయి భారతీయుడా పాపయికి నడకొచ్చింది పకపకా నవ్వొచ్చింది ఎస్.పి.బాలు కె.వి.మహదేవన్ దాశరథి కృష్ణమాచార్య 1976
19 ముద్దబంతి పువ్వు ముద్దబంతి పువ్వు ఉహూ ఉహూ ముగిసిందా నవ్వు ఎస్.పి.బాలు రమేష్ నాయుడు సి.నా.రె 1976
20 సీతాకల్యాణం సీతమ్మకు సింగారం చేతాము పి. సుశీల,
బి.వసంత,
ఉడుతా సరోజిని
కె.వి.మహదేవన్ ఆరుద్ర 1976
21 అమరదీపం అంతలేసి అందాలు దాచుకున్న అమ్మాయి రామకృష్ణ సత్యం ఆరుద్ర 1977
22 తొలిరేయి గడిచింది గుడ్ అంటే మంచిది బ్యాడ్ అంటే చెడ్డది గుడ్ అండ్ బ్యాడ్ పి. సుశీల సత్యం ఆచార్య ఆత్రేయ 1977
23 పంచాయితి గాలి అందరిదైతే నేల కొందరిదేనా ఎస్.పి.బాలు,పి. సుశీల కె.వి.మహదేవన్ సి.నా.రె. 1977
24 మరో చరిత్ర కలసి వుంటే కలదు సుఖం కలసివచ్చిన అదృష్టము ఎస్.పి.బాలు ఎం.ఎస్.విశ్వనాథన్ ఆచార్య ఆత్రేయ 1978
25 ఖైదీ నెం: 77 నేనే ఓ మాధవీ ఆహా నా మాధవీ అది ఏది కాదు ఎస్.పి. బాలు సత్యం సి.నా.రె. 1978
26 ఇది కథ కాదు ఇటు అటు కాని, హృదయం తోని - ఎందుకురా ఈ తొందర నీకు ఎస్.పి.బాలు ఎం.ఎస్.విశ్వనాథన్ ఆచార్య ఆత్రేయ 1979
27 ఇది కథ కాదు ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం ఎస్.పి.బాలు ఎం.ఎస్.విశ్వనాథన్ ఆచార్య ఆత్రేయ 1979
28 కుక్క కాటుకు చెప్పు దెబ్బ హే బేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలి ఎస్.పి.బాలు ఎం.ఎస్.విశ్వనాథన్ ఆచార్య ఆత్రేయ 1979
29 కలియుగ మహాభారతం బురు బురు పిట్టా బురు పిట్ట ఎస్.పి.బాలు,
ఎం.రమేష్,
ఎల్.ఆర్.అంజలి
సత్యం వేటూరి 1979
30 విజయ హే పెద్దలు రాక రాక వచ్చారు రాత్రి ఎల్.ఆర్. ఈశ్వరి,
రాజబాబు
చక్రవర్తి జంధ్యాల 1979
31 శ్రీ వినాయక విజయం డూ డూ డూ బసవన్నాభళిరా అందెల బసవన్నా రామకృష్ణ ఎస్.రాజేశ్వరరావు కొసరాజు 1979
32 ధర్మ యుద్ధం డిస్కో సౌండ్ ( ఇంగ్లీష్ పాట ) హరిరాం ఇళయరాజా రాజశ్రీ 1979
33 అగ్ని సంస్కారం కొండమీద కాపురముండు వాడా వరము కోరుకుంటి శ్రీనివాస్ ఎం. జనార్ధన్ 1980
34 పగడాల పడవ వల్లారి బాబోయి వల్లరి మావాయ్ ఏ ఊరన్న విల్సన్ ఘంటసాల విజయ కుమార్ దాశరథి 1980
35 పొదరిల్లు అల్లాడిపోతావే చూడు మల్లా కిల్ల్లడి ఓ కన్నె లేడిపిల్లా ఎస్.పి.బాలు జె.వి.రాఘవులు 1980
36 గురుశిష్యులు తగ్గు తగ్గు తగ్గు తల తిక్క ఒగ్గు ఏమిటా టెక్కు ఎస్.పి. బాలు కె.వి. మహదేవన్ ఆచార్య ఆత్రేయ 1981
37 ఇంద్రుడు చంద్రుడు వయసు బెత్తెడు నూరేళ్ళది నులి వేడిది ఇపుడున్నది ఎం.రమేష్ ఎస్.రాజేశ్వరరావు జాలాది 1981
38 నెలవంక ఎంత చెప్పిన వినవేమిరా జిత్‌మోహన్ మిత్ర,
ప్రకాశరావు
రమేష్ నాయుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 1983
39 అమాయకుడు కాదు అసాధ్యుడు ఏమిటో ననుకుంటి ఇదా అరె విన్నానులే అసలు కథ ఎస్.పి.బాలు సత్యం కొసరాజు 1983
40 ఆడవాళ్లే అలిగితే భయమెందుకే నీకు భార్యామణి పాకాలు శాకాలు ఎస్.పి.బాలు కృష్ణ - చక్రి డా.నెల్లుట్ల 1983
41 అనసూయమ్మ గారి అల్లుడు అత్తా అనసూయమ్మా నీతో సరసోయమ్మా మేనత్త రాకతో ఎస్.పి.బాలు చక్రవర్తి వేటూరి 1986
42 అత్త మెచ్చిన అల్లుడు ఘల్లు ఘల్లున కాలి గజ్జలు మ్రోగంగ కాళీయఫణి ఎస్.పి.బాలు కె.వి.మహదేవన్ సి.నా.రె. 1989
43 అబ్బాయిగారు తడికెందుకు అదిరింది ఎస్.పి.బాలు, చిత్ర, రమణ ఎం.ఎం.కీరవాణి భువనచంద్ర 1993

మూలాలు

మార్చు
  1. కంపల్లె, రవిచంద్రన్ (2013). "ఎప్పుడూ నాదొక వేరైటీయే". జ్ఞాపకాలు (తృతీయ ed.). చెన్నై: కళాతపస్వి క్రియేషన్స్. pp. 176–183.
  2. Brandsborg, O.; Boné, J.; Brandsborg, M.; Løvgren, N. A.; Amdrup, E. (1975). "Serum gastrin concentration before and after parietal cell vagotomy in man and dog". Acta Chirurgica Scandinavica. 141 (7): 654–656. ISSN 0001-5482. PMID 1957.
"https://te.wikipedia.org/w/index.php?title=రమోలా&oldid=4314086" నుండి వెలికితీశారు