సరిత
సరిత దక్షిణ భారతీయ సినిమా నటీమణి. మరో చరిత్ర సినిమాతో బాగా పేరొందిన ఈమె సుమారు 160 చిత్రాలలో నటించింది.
సరిత | |
జన్మ నామం | సరిత |
జననం | మద్రాసు తమిళనాడు | 1960 జూన్ 7
భార్య/భర్త | ముఖేష్ (1989 - 2007) విడాకులు |
ప్రముఖ పాత్రలు | మరో చరిత్ర ఆడవాళ్ళు మీకు జోహార్లు |
వ్యక్తిగత జీవితం
మార్చుతమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నాయకిగా నటించి పేరు గాంచిన సరిత.. మలయాళ నటుడు ముఖేష్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కొంత కాలం తరువాత సరిత, ముఖేష్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఫలితం విడాకులకు దారి తీసింది. 2009లో ముఖేష్ సరిత నుంచి వివాహ రద్దు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ కేసు విచారణ రెండేళ్ల క్రితం ముఖేష్, సరితకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది.దీంతో ముఖేష్.. మిధుల అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం చెల్లదంటూ నటి సరిత కేరళ, కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ చెన్నై కోర్టులో ముఖేష్ వివాహ రద్దు కోరుతూ వేసిన పిటీషన్‌పై విచారణ జరిగే సమయంలో తాను దుబాయిలో ఉన్నానన్నారు. దీంతో కోర్టు జారీ చేసిన నోటీసులను తాను అందుకోలేకపోయానని వివరించారు. తాను కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.అందువలన ముఖేష్ రెండో వివాహం చెల్లదని తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా సరిత, ముఖేష్‌లిద్దరూ 2015 మార్చి 4, గురువారం కొచ్చి కుటుంబ సంక్షేమ కోర్టుకు హాజరయ్యారు.[1]
ఇతర విశేషాలు
మార్చు- ఈమె నటిగానే కాక డబ్బింగ్ కళాకారిణిగా కూడా రాణించింది.
పురస్కారాలు
మార్చుఫిలిం ఫేర్ పురస్కారాలు
మార్చు- 1980 – ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – తమిళం లో వండిచక్కరం
- 1982 – ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – కన్నడం లో హోసా బెలాకు
- 1984 – ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – తమిళం లో అచామిలై అచామిలై
- 1985 - ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – కన్నడం లో ముగిల మల్లిగె
- 1986 - ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – కన్నడం లో మౌన గీతె
- 1989 - ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం – కన్నడం లో సంక్రాంతి
నంది పురస్కారాలు
మార్చు- 1982- స్పెషల్ జ్యూరీ పురస్కారం - ఉత్తమ నటి - కోకిలమ్మ
- 1997 – ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి - మా ఆయన బంగారం
- 1999 – ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి - అంతఃపురం
- 2004 – నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం - అర్జున్
తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు
మార్చు- తమిళనాడు రాష్ట్రం నుండి కలైమణి పురస్కారం
- 1979 – ఉత్తమ నటి పురస్కారం - Oru Vellaadu Vengaiyagiradhu
- 1982 – ఉత్తమ నటి పురస్కారం - Agni Sakshi
- 1988 – ఉత్తమ నటి పురస్కారం - Poo Pootha Nandavanam
కర్ణాటక రాష్ట్ర పురస్కారాలు
మార్చు- 1989-ఉత్తమ నటి పురస్కారం - Sankranthi
నటించిన చిత్రాలు
మార్చుతెలుగు
మార్చు- అర్జున్
- కోకిల (1990)
- సత్యాగ్రహం (1987)
- అమ్మ కావాలి (1985)
- అనురాగబంధం (1985)
- బాల యేసు (1984)
- కాంచన గంగ (1984)
- ప్రేమసాగరం (1983)
- తోడు నీడ (1983)
- కోకిలమ్మ (1983)
- భాగ్యలక్ష్మి (1983)
- చందమామ (1982)
- కలహాల కాపురం (1982)
- శ్రీరస్తు శుభమస్తు (1981)
- రామదండు (1981)
- తొలికోడి కూసింది (1981)
- ఆడాళ్లూ మీకు జోహార్లు (1981)
- అత్తగారి పెత్తనం (1981)
- గూటిలోని రామచిలక (1980)
- విజయ (1979)
- గుప్పెడు మనసు (1979)
- ఇది కథ కాదు (1979)
- మరో చరిత్ర (1978)
మూలాలు
మార్చు- ↑ ""Mukesh's ex-wife Saritha faints in court". timesofindia.indiatimes.com. timesofindia. 4 March 2015. Retrieved 4 March 2015.