మలప్పురం జిల్లా

కేరళ లోని జిల్లా

మలప్పురం జిల్లా, (మలయాళం: [mɐlɐpːurɐm] (వినండి)), భారతదేశం కేరళ రాష్ట్రంలోని జిల్లా. [1]ఇది మునుపటి పాలక్కాడ్ జిల్లా, కోళికోడ్ జిల్లాలు విభజించుట ద్వారా 1969 జూన్ 16 న ఏర్పడింది.మలప్పురం జిల్లాలో 70 కిమీ (43 మైళ్ళు) తీరప్రాంతం ఉంది. ఇది కేరళలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా, ఇది రాష్ట్ర మొత్తం జనాభాలో దాదాపు 13% మందిని కలిగి ఉంది. ఇది సుమారు 3,554 కిమీ2 (1,372 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది విస్తీర్ణం ప్రకారం కేరళలో మూడవ అతిపెద్ద జిల్లా, అలాగే రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా, పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రం ఇరువైపులా సరిహద్దులుగా ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను ఎరనాడ్, కొండొట్టి, నిలంబూర్, పెరింతల్మన్న, పొన్నాని, తిరుర్, తిరురంగడి అనే ఏడు తాలూకాలుగా విభజించారు.

Malappuram district
മലപ്പുറം ജില്ല
District
Kottakkunnu hills in Malappuram, Biyyam Lake in Ponnani, Arya Vaidya Sala in Kottakkal, Bharathappuzha with Kuttippuram bridge, Flights parked at Karipur International Airport, Karipur Airport terminal, Cherumb eco-tourism village in Karuvarakundu, Malappuram Kathi, Teak Museum at Nilambur
Kottakkunnu hills in Malappuram, Biyyam Lake in Ponnani, Arya Vaidya Sala in Kottakkal, Bharathappuzha with Kuttippuram bridge, Flights parked at Karipur International Airport, Karipur Airport terminal, Cherumb eco-tourism village in Karuvarakundu, Malappuram Kathi, Teak Museum at Nilambur
Nickname: 
MLP
Countryభారత దేశం
రాష్ట్రంకేరళ
ప్రధాన కార్యాలయంMalappuram
Government
 • CollectorK.Biju
విస్తీర్ణం
 • Total3,000 కి.మీ2 (1,000 చ. మై)
జనాభా
 (2011)
 • Total41,10,956
 • Rank1
 • జనసాంద్రత1,158/కి.మీ2 (3,000/చ. మై.)
భాషలు
 • అధికారMalayalam,ఆంగ్లం
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-KL-MLP
Vehicle registrationKL-10, KL-53, KL-54, KL-55, KL-65, KL-71
లింగ నిష్పత్తి1096 /
అక్షరాస్యత93.55%

పేరువెనుక చరిత్ర

మార్చు

మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్ధం. జిల్లారూపొందించక ముందు జిల్లా కేంద్రం పేరును జిల్లాకు నిర్ణయించబడింది. జిల్లా రూపొందించక ముందు ఈ ప్రాంతాన్నీ ఎర్నాడు, వల్లువనాడు (సదరన్ మలబార్) అని పిలిచేవారు.

చరిత్ర

మార్చు

జిల్లా ప్రాంతం వేదాధ్యాయానికి, ప్రాంతీయ రాజకీయాలకు కేంద్రంగా ఉండేది. తిరునవయ సంప్రదాయ ఆయుర్వేద వైద్యానికి పుట్టిల్లు. కోత్తక్కల్ ముస్లిం విద్యాకేంద్రానికి కేంద్రానికి కేంద్రంగా ఉంది. మలప్పురం జిల్లాలో పొన్నై, మంజేరి,[2] పెరిందల్మన్న, కోత్తక్కల్ మొదలైన పట్టణాలు ఉన్నాయి. 1921లో ప్రస్తుత మలప్పురం జిల్లా విధ్వంసకర తిరుగుబాటు, మూకుమ్మడి హత్యలకు (మోపలా రిబెల్లియన్) సాక్ష్యంగా ఉనది. తరువాత ఆర్థిక, సాంఘిక, రాజకీయ అభివృద్ధి కొనసాగింది. కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పాలన ఆరంభకాలంలో లాండ్ రిఫార్ం ఆఫ్ కేరళ చట్టం కింద కేరళాలో భూసంస్కరణ జరిగింది. 1970లో పర్షియన్ గల్ఫ్ వద్ద బృహత్తర చమురు నిల్వలు వెలువడ్డాయి. తరువాత పర్షియన్ గల్ఫ్‌లో ఆర్థిక వెల్లువ కొనసాగింది. తరువాత వేలాది నైపుణ్యరహిత శ్రామికులకు పర్షియన్ గల్ఫ్‌లో పనిచేయడానికి అవకాశం లభించింది. పర్షియన్ గల్ఫ్‌లో పనిచేయడానికి వలస పోయిన శ్రామికులు ధనం పంపడం వలన జిల్లా ప్రాంతంలోని ఆర్థికవ్యవస్థ అభివృద్ధి పధంలో పరుగులు తీసింది. 20వ శతాబ్ధానికి జిల్లా ఆరోగ్య వ్యవస్థ ప్రథమస్థాయి - ప్రపంచ ఆరోగ్యసూచిక స్థాయికి చేరుకుంది. విద్యాపరంగా కూడా ప్రంపంచ స్థాయి ప్రమణాలకు చేరుకుంది. [3]

ఉద్యమాలు

మార్చు
 
Ali Musliyar, one of chief Moplah rebels

మలప్పురం 20వ శతాబ్దం ఆరంభంలో ఖిలాఫత్ ఉద్యమం, మొప్లాజ్ తిరుగుబాటులో భాగస్వామ్యం వహించింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ ఇండియాలో మద్రాసు ప్రెసిడెన్సీలో మలప్పురం జిల్లా భాగంగా ఉండేది. స్వతంత్రం తరువాత కూడా మలప్పురం మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1956 నవంబరు 1 న మలబార్ జిల్లా ప్రాంతం కేరళ రాష్ట్రం లోని ట్రావంకోర్- కొస్చిన్ లో భాగంగా మారింది. 1957-1969 మద్య కాలంలో భూభాగంలో పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. 1957లో కొత్తగా రూపొందించబడిన తిరూర్ తాలూకాలో ఎర్నాడు, పొన్నై తాలూకాలు విలీనం చేయబడ్డాయి. పొన్నై తాలూకాలోని ఇతర ప్రాంతం కొత్తగా రూపొందించబడిన చవక్కాడి తాలూకాలో విలీనం చేయబడింది. మిగిలిన భాగం ప్రస్తుత పొన్నై తాలూకాగా రూపొందింది. మునుపటి పెరిందల్మన్న తాలూకా నుండి వల్లువనాడు తాలూకా రూపొందించబడింది. ఎర్నాడు తాలూకా, తిరూర్ తాలూకాలు కోళికోడు జిల్లాలో భాగంగా ఉన్నాయి. పెరిందమల, పొన్నై తాలూకాలు పాలక్కాడు జిల్లాలో భాగంగా ఉన్నాయి. ఎర్నాడు, పెరిందమల, తిరూరు, పొన్నై తాలూకాలను చేర్చి మలప్పురం జిల్లా రూపొందించబడింది.

సంస్కృతి

మార్చు

జిల్లాకు సంపన్నమైన సాంస్కృతిక రాజకీయ చరిత్ర ఉంది. పొన్నై నౌకాశ్రయం రోం వ్యాపారానికి కేంద్రంగా ఉంది. చేర సామ్రాజ్యం తరువాత పలు సామ్రాజ్యాలు ఈ భూభాగాన్ని పాలించాయి. 9వ శతాబ్దం నాటికి ఈ భూభాగాన్ని మహోదయపురం చక్రవర్తి కులశేఖర చక్రవర్తి పాలించాడు. కులశేఖర రాజ్యపతనం తరువాత పలు నాయర్ రాజ్యాలు ఏర్పడ్డాయి. నయర్ రాజ్యాలలో వల్లువనాడు (సదరన్ మలనాడు), తనూర్ సామ్రాజ్యం, పరప్పనాడు, నెడియురుప్పు (జమోరిన్) మొదలైనవి ప్రధానంగా ఉన్నాయి. 13వ శతాబ్దం నాటికి కోళికోడ్‌కు చెందిన సమూదిరి మలబారు తీరం వెంట తమరాజ్యాన్ని విస్తరిస్తూ మలబార్ తీరప్రాంతం అంతటినీ తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. తిరునవయ మామనకం రాజధాని తిరునవయ మలప్పురం జిల్లాలో ఉంది. 15వ శతాబ్దంలో కాలనీ శక్తులు జిల్లాభూభాగంలో ప్రవేశించాయి. చిరుచిరు సమూతిరి సంస్థానాలు విదేశీ శక్తులతో సంబధాలు కలిగి ఉన్నాయి. 18వ శతాబ్దం నాటికి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సమూదిరి భూభాగంలో ప్రవేశించాడు.

విభాగాల

మార్చు
విషయాలు వివరణలు
తాలూకాలు 6 తిరుంగాడు, నిలంబూరు, ఎర్నాడు, పెరిందమల, తిరూరు, పొన్నై
పట్టణాలు 4 ఎర్నాడు, పెరిందమల, తిరూరు, పొన్నై
పంచాయితీలు 95
 
Kadalundi Bird Sanctuary

భౌగోళికం

మార్చు
 
Kadalundi river

సరిహద్దులు

మార్చు
సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు వాయనాడు జిల్లా
ఈశాన్య సరిహద్దు తమిళనాడు రాష్ట్రం
ఆగ్నేయం, దక్షిణం సరిహద్దు పాలక్కాడు జిల్లా
నైరుతీ సరిహద్దు త్రిస్సూర్ జిల్లా
పశ్చిమ సరిహద్దు అరేబియన్ సముద్రం
వాయవ్య సరిహద్దు కోజికోడ్

విభాగాల వివరణ

మార్చు
విషయాలు వివరణలు
రెవెన్యూ డివిషన్లు 2
తాలూకాలు 6
గ్రామాలు 135
మండలాలు 15
పురపాలకాలు 7
పంచాయితీలు 100

నదులు

మార్చు
  • భారతపుళా (నిల)
  • చలియార్:- జిల్లా ఉత్తర భాగంలో ఉంది. నది పొడవు 169 కి.మీ. ఇది తమిళనాడు లోని ఇల్లంబరియేరి కొండలలో జన్మించింది. దీనికి చలిపుళా, పున్నపుళా, పాండియార్, కరీంపుళా, చెరుపుళా, వడపురంపుళా ప్రధాన ఉపనదులు ఉన్నాయి. చలివార్ నది నిలంబూర్, మాంపాడి, ఎడవన్న, అరీకోడె ద్వారా ప్రయాణించి కోళీకోడ్ జిల్లాలోని బేపోర్ వద్ద సముద్రంలో సంగమిస్తుంది. ఈ నదులలో చలియార్ మాత్రమే జీవనది మిగిలిన నదులు వేసవిలో ఎండిపోతుంటాయి.మలప్పురం జిల్లా కరువు బారిన పడడానికి ఇది ఒక కారణం. కేరళా పర్యావరణ ఆందోళన చరిత్రలో " కె.ఆర్. రహ్మాన్ " నాయకత్వం వహించిన చలియార్ ఆందోళన విజయవంతమైనదిగా గుర్తింపు పొదింది. ఈ భూభాగంలో నదీజలాల కలుషితానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూనే ఉంది.
  • కడలుండిపుళా నది:- వెలియార్ పుళా, ఒలిపుళాల కలయికతో ఏర్పడింది. ఒలిపుళా చెరకొంబన్ కొండలలో జనిస్తుంది. వెలియార్ నది ఎరట్టకొంబన్ కొండలలో జనిస్తుంది. అవి సిలెంట్ వెల్లీ నేషనల్ పార్క మీదుగా ప్రవహించి ఎర్నాడు, వల్లువనాడు (సదరన్ మలనాడు) మీదుగా ప్రవహించి కొడలుండి మీదుగా సముద్రంలో విలీనం ఔతుంది. ఇది తన ప్రవాహ మార్గంలో మెలత్తూరు (కేరళ), పండిక్కాడు, పరప్పూరు, కూరియాడ్, పరప్పంగాడి మీదుగా ప్రవహిస్తుంది. నది పొడవు 130 కి.మీ.
  • తిరూరు నది.

పరిసరాలు

మార్చు

తిరూరు, పొన్నై తాలూకాలు, బియ్యం, వెలియంకోడ్, మనౌర్, కొడింహి చేపల వేట, బోటింగ్ వసతి కల్పిస్తుంది.

వనసంపద

మార్చు

మలప్పురం జిల్లాలో విస్తారమైన వన్యమృగసంపద, చిన్నచిన్న కొండలు, అరణ్యాలు, చిన్న నదులు, నీటి ప్రవాహాలు ఉన్నాయి. వరి, పోకచెక్క, నల్లమిరియాలు, అల్లం, పప్పులు, కొబ్బరి, అరటి, కర్రపెడెలం, రబ్బరు ప్లాంటేషన్ ఉన్నాయి. మలప్పురం ముస్లిం ప్రజలు అధికంగా ఉన్న జిల్లాలలో ఒకటి. జిల్లాలోని హిందూ ఆలయాలు, మోప్లా మసీదులలో వర్షిక వర్ణరంజిత ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. కేరళ రాష్ట్రంలో మలప్పురం చాలాప్రాబల్యత సంతరించుకున్న జిల్లాగా గుర్తించబడుతుంది.[4] జిల్లాలో హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, ఇతర మతస్థులు ఉన్నారు..[2]

గణాంకాలు

మార్చు
 
E. M. S. Namboodiripad was born in Malappuram District

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 4,110,956,[4]
ఇది దాదాపు. న్యూజిలాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. ఒర్గాన్ నగర జనసంఖ్యకు సమం..[6]
640 భారతదేశ జిల్లాలలో. 50 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 1158 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.39%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 1096:1000,[4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 93.55%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.
విషయాలు వివరణలు
ముస్లిములు 68.53%
హిందువులు 29.17%
హిందువులు, క్రైస్తవులు 2.22%
ఇతరులు స్వల్పంగా

భాషలు

మార్చు

జిల్లాలో మలయాళం ప్రధానభాషగా వాడుకలో ఉంది. ఇతర భాషలలో 350 మంది ప్రజలలో వాడుకలో ఉన్న ద్రావిడ భాషాకుంటుంబానికి చెందిన అల్లర్ భాష ఒకటి. [7] అలాగే ద్రావిడ భాషాకుంటుంబానికి చెందిన అరండన్ భాషకూడా వాడుకలో ఉంది. దీనికి 200 మంది వాడకందారులు ఉన్నారు.[8]

శాసనసభ నియోజకవర్గాలు

మార్చు

మలప్పురం జిల్లాలో శాసనాత్మక నియోజకవర్గాలు చాలా ఉన్నాయి

నియోజకవర్గం స్థానిక సంస్థల శాసన సభ్యులు రాజకీయ పార్టీ కేరళ శాఖ
మలప్పురం మలప్పురం మున్సిపాలిటీ, పుల్పెత్త, అనక్కయం, మొరయుర్, ఏరనద్ తాలూకా, పెరింతల్మన్న తాలూకా పి ఊబైదుల్లహ్ ముస్లిం మతం లీగ్ కోడూర్ పంచాయితీల యొక్క పొక్కొత్తుర్ పంచాయతీలు
మంజెరి మంజెరి మున్సిపాలిటీ, పందిక్కద్, ఎరనద్ తాలూకా, ఎదప్పత్త, పెరింతల్మన్న తాలూకా అడ్వాన్స్డ్ యొక్క ఖిళత్తుర్ పంచాయతీల యొక్క త్రిక్కలంగొదే పంచాయితీలు. ఎం.ఉమ్మర్ ముస్లిం మతం లీగ్
కొందోట్టి దూరములో, కొందోట్టి, చెరుకవు, ముథువల్లూర్, వళయుర్, వళక్కద్, పులిక్కల్, నెదియిరిప్పు, ఎరనద్ తాలూకా మమ్మున్న్య్ హాజీ ముస్లిం మతం లీగ్ ఛీక్కొదే పంచాయతీలు
నిలంబూర్ తాలూకా అరీక్కొదె, ఓఒరంగత్తిరి, కవనుర్, కీళు పరంబ, కుళిమన్న, ఎరనద్ తాలూకా పి.కె యొక్క ఎ దవన్న పంచాయతీలు ఎరనద్ చలియార్ పంచాయితీలు బషీర్ ముస్లిం మతం లీగ్
మంకద మంకద, అంగదిప్పురం, కురువ, కూత్తిలంగది, పుళక్కత్తీరి, మూర్క్కనద్, పెరింతల్మన్న తాలూకా టిట మక్కరపరంబ పంచాయతీలు అహమ్మద్ ఖబీర్ ముస్లిం మతం లీగ్
పెరింథల్మన్న పెరింతల్మన్న మున్సిపాలిటీ, అలిపరంబ, ఏలంకులం, తళెకొదె, వెత్తథూర్, పులమంథొలే అండ్ అర్బన్ ఎఫైర్స్ పెరింతల్మన్న తాలూకా మనజలం ఖుళి ఆలీ ముస్లిం మతం లీగ్ మంత్రి, టౌన్ ప్లానింగ్, డెవలప్మెంట్ అథారిటీ, మైనారిటీ సంక్షేమ ంఎలత్తుర్ పంచాయతీలు .
తిరురంగది తిరురంగది, పరప్పనగది, నన్నంబ్ర, తెన్నల, తిరురంగది తాలూకాలో ఎదరికొదే పంచాయతీలు, తిరుర్ తాలూకా పెరుమన్న-క్లరి పంచాయితీలు విద్యా అబ్దు ఎరబ్బ్ ముస్లిం మతం లీగ్ మంత్రి
వెంగర వెంగర, ఎ.ఆర్. నగర్, కన్నమంగలం, ఓఒరకం, ఓతుక్కుంగల్, ఇండస్ట్రీస్ థిరురంగది తాలూకా పి.కె.కెఉంజలి కుట్టి ముస్లిం మతం లీగ్ మంత్రి పరప్పుర్ పంచాయతీలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అర్బన్ ఎఫైర్స్
వల్లికున్ను వల్లిక్కున్ను, పల్లిక్కల్, చెలెంబ్ర, మూన్నియుర్, తెంజిప్పలం, తిరురంగది తాలూకా అడ్వాన్స్డ్ యొక్క రెరువల్లూర్ పంచాయతీలు. కె.ఎన్.ఎ.కదెర్ ముస్లిం మతం లీగ్
తిరుర్ తిరుర్ మున్సిపాలిటీ, అతవనదు, కల్పకంచెర్య్, వలవన్నుర్, వెత్తం, తలక్కద్, తిరుర్ తాలూకా సి.మమ్ముత్త్య్ ముస్లిం మతం లీగ్ థిరునవయ పంచాయతీలు
తనుర్, భారతదేశం తనుర్,తనలుర్, నిరమరుథూర్, చెరియముందొం,పొన్ముందొం, టిరుర్ తాలూకా అబ్దు రెహ్మాన్ ఋఅందథని ముస్లిం మతం లీగ్ ఓజ్హుర్ పంచాయతీలు
కొత్తక్కల్ కొత్తక్కల్ మున్సిపాలిటీ, పొనమల, మరక్కర, ఎదయుర్, ఈరింబిలియం, వలంచెరి, తిరుర్ తాలూకా అబ్దుస్సమద్ సమదని ముస్లిం మతం లీగ్ కుత్తిప్పురం పంచాయతీలు
నిలంబూర్ నిలంబూర్ మున్సిపాలిటీ, వళిక్కదవు, పొథుకల్, ఎదక్కర, ముథెదం, చుంగథర, అమరంబలం, పవర్ కోసం నిలంబూర్ తాలూకా అర్యదన్ ముహమ్మద్ ఈణ్ఛ్ మంత్రి ఖరులై పంచాయతీలు
షెడ్యూల్డ్ కులాలు & వెనుకబడిన తరగతుల అండ్ పర్యాటకం సంక్షేమం కొరకు వందూర్ వందూర్, తిరువలి, మంపద్, పోరుర్, కలికవు, చొక్కద్, కరువరకుందు, నిలంబూర్ తాలూకా ఎ.పి అనిల్ కుమార్ ఐ.ఎన్.సి మంత్రి తువ్వూర్ పంచాయతీలు
పొన్నాని పొన్నాని మున్సిపాలిటీ, ఆలంకొదె, మరంచెర్య్, నన్నమ్ముక్కు, పెరుంపదప్పు, పొన్నాని తాలూకా పి.శ్రీరామ కృష్ణన్ సిపిఐ వెలియంచొదే పంచాయతీలు (ఎం)
థవనుర్, కలది, వత్తంకులం, పొన్నాని తాలూకా, మంగళం, పురథూర్ యొక్క ఎదప్పల్ పంచాయతీలు, తిరుర్ తాలూకా కె.టి త్రిప్పంగొదే పంచాయతీలు. జలీల్ సిపిఐ (ఎం) ఇండ్.

పార్లమెంటు నియోజకవర్గాలు

మార్చు
 
Nirupama Rao, current Indian ambassador to the US was born at Malappuram
పార్లమెంట్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గాలు ఎం.పి రాజకీయ పార్టీ
మలప్పురం మలప్పురం, మంజెరి, మంకద, పెరింథల్మన్న, వల్లికున్ను, కొందోట్టి, వెంగర ఈ. అహమద్ విదేశీ వ్యవహారాల, మానవ వనరుల మంత్రిత్వ ముస్లిం లీగ్ మంత్రి (డిప్యూటీ మంత్రి)
పొన్నాని (పార్ట్) తిరురంగది, తిరుర్, తనుర్, పొన్నాని, కొత్తక్కల్, తవనుర్. ఐ.ఐ.ఈ.టి . ముహమ్మద్ బషీర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
ఉన్న వయనాడ్ (పార్ట్) ఎరనద్, వందూర్, నిలంబూర్. ఎం.ఐ.షనవస్ భారత జాతీయ కాంగ్రెస్

తాలూకాలు

మార్చు

జిల్లాలో 7 తాలూకాలు, రెండు విభాగాలు ఉన్నాయి: తిరూర్, పెరింతల్మన్నా.

  • ఎర్నద్
  • తిరుర్
  • తిరురంగది
  • పొన్నాని
  • పెరింతల్మన్న
  • నిల్మబుర్
  • దూరములో (కొందోట్టి)

పంచాయితీలు బ్లాకులు , గ్రామ పంచాయతీలు

మార్చు

మలప్పురం జిల్లాలో 15 బ్లాక్ పంచాయతీలు, 100 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

బ్లాక్ పేరు పంచాయతీలు
మలప్పురం బ్లాక్ అనక్కయం, మొరయుర్, పొక్కొత్తుర్, కోడూర్, పొన్మల, ఓతుక్కుంగల్.
పెరుంపదప్పు బ్లాక్ పెరుంపదప్పు, ఆలంకొదె, మరంచెరి, నన్నమ్ముక్కు, వెలియంకొదె.
తిరుర్ బ్లాక్ పురథూర్, త్రిప్పంగొదె, థలక్కద్, వెత్తొం, మంగళం, తిరునవయ.
తిరురంగది బ్లాక్ తిరురంగది, పరప్పనగది, తల్లిక్కున్ను, తెంజిప్పలం, మూన్నియూర్, పెరువల్లూర్, నన్నంబ్ర.
వెంగర బ్లాక్ వెంగర, ఎ.ఆర్ నగర్, పరప్పుర్, కన్నమంగల, ఓఒరకం, ఏదరికొదే, తెన్నల.
తనుర్ బ్లాక్ తనుర్, తనలుర్, నిరమరుథూర్, పొన్ముందం, ఓళుర్, పెరుమన్న-క్లరి, వలవనూర్, చెరియముందొం.
కుత్తిప్పురం బ్లాక్ కుత్తిప్పురం, అథవనదు, కలపకంచెరి, ఏదయుర్, ఇరింబిలియం, మరక్కర, వలంచెర్య్.
మంకద బ్లాక్ మంకద, కురువ, కూత్తిలంగది, పుళక్కత్తిరి, మూర్క్కనద్, మక్కరపరంబ.
పెరింతల్మన్న బ్లాక్ అలిపరంబ, ఎలంకులం, తళ్కెకొదె, వెత్తథుర్, పులమంథొలె, మెలత్తుర్, కీజ్హత్తుర్, అంగదిప్పురం.
పొన్నాని బ్లాక్ ఎదప్పల్, తవనుర్, కలది, వత్తంకులం.
అరీచొదే బ్లాక్ అరీచొదె, ఓరంగత్తిరి, కవనుర్, కీజ్హుపరంబ, కుళిమన్న, ఎదవన్న, చీకొదే, పుల్పెత్త.
కలికవు బ్లాక్ కలికవు, చొక్కదు, కరువరకుందు, తువ్వూర్, అమరంబలం, కరులై, ఏదప్పత్త.
దూరములో, కొందోట్టి బ్లాక్ దూరములో, కొందోట్టి, వ్హెరుకవు, ముతువల్లూర్, వళయుర్, వజ్హక్కద్, పులిక్కల్, నెదియిరుప్పు, పల్లిక్కల్, చెలెంబ్ర.
వందూర్ బ్లాక్ వందూర్, తిరువలి, మంపద్, పోరుర్, పందిక్కద్, త్రిక్కలంగొదె.
నిలంబూర్ బ్లాక్ వళిక్కదవు, పొతుకల్, ఎదక్కర, ముథెదం, చుంగథ్ర, చలియార్.

పురపాలికలు

మార్చు

మలప్పురం పురపాలకం పరిసర ప్రాంతాలతో కలిపి నగరపాలకంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

మలప్పురం పురపాలకాలు:-

  • మలప్పురం
  • పెరింతల్మన్న
  • మంజెరి
  • పొన్నాని
  • తిరుర్
  • కొత్తక్కల్
  • నిలంబూర్

ప్రతిపాదిత పురపాలక:

  • వలంచెర్య్
  • దూరములో, కొందోట్టి
  • ఎదప్పల్
  • తనుర్
  • తిరురంగది
  • పరప్పనంగది
  • కుత్తిప్పురం

సంస్కృతి

మార్చు

మలప్పురం జిల్లాలో కళాలు, సంస్కృతి సంబంధిత ఉన్నత సంప్రదాయం ఉంది. ఈ భూమి నుండి అనేకమంది ప్రఖ్యాత రచయితలు వెలుగులోకి వచ్చారు. ఆధునిక మలయాళ సాహిత్యానికి తండ్రిగా స్తుతించబడిన తుంచత్ ఎళుతచ్చన్ తిరూర్ సమీపంలో ఉన్న త్రిక్కందియార్ వద్ద 400 సంవత్సరాల ముందు జన్మించాడు. 1921లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొప్లాహ్ రిబెల్లియన్ ఉద్యమానికి కేంద్రస్థానంగా మలప్పురం చారిత్రక ప్రాధాన్యత ఉంది. జిల్లాలో మలప్పురం తంగల్ సమాధి ఉంది. మలప్పురం బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమనాయకుడు, ముస్లిం పండితుడు ఉమర్ ఖ్వాజి జన్మస్థానం. పనక్కాడులో పనక్కాడు తంగల్ కుటుంబం, కేరళ రాష్ట్ర అధ్యక్షులు, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ కమిటీ ఉన్నాయి. కథాక్కళి మ్యూజియం కళామండలం తిరూర్ నంబిస్సన్ ఏళూరులో జన్మించాడు. మహాకవి వల్లక్కోల్ నారాయణ వంటి కవులు, వి.సి బాలకృష్ణ పణిక్కర్, మోయింకుట్టి మొదలైన ప్రముఖులు మలప్పురంలో జన్మించాడు. ఙానప్పన సృష్టికర్త పూంతానం పుట్టింది మలప్పురంలోనే.

కేరళా స్కూల్ ఆఫ్ ఆటానమీ ఆఫ్ మాథ్స్

మార్చు

ప్రఖ్యాత గణిత శాస్త్రఙడు మాధవా ఆఫ్ సంగమగ్రామా యొక్క కేరళా స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మాధమాటిక్స్, మెలత్తూర్ నారాయణ భాట్టాతిరి, అచ్యుత పిషరతి, కెలల్లూర్ నీలకంఠ సోమయాజి మొదలైన వారు తిరూరు లోని త్రికండియూరులో జన్మించాడు. నారాయణీయం రచయిత మెలపథూర్ భట్టాద్రి ఈ ప్రాంతంలో జన్మించాడు.

పండుగలు ఉత్సవాలు

మార్చు

పలు ఆలయాలు, మసీదులు, చర్చిలలో విస్తారమైన సంతలు, ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.

తిరుమందంకున్ను పూరం

మార్చు

జిల్లాలోని ప్రధాన ఆలయ ఆలయయ ఉత్సవాలలో తిరుమంధం కున్ను పూరం ఒకటి. కేరళలోని మూడు భగవతి ఆలయాలలో తిరుమన్నంకున్ను ఆలయం ఒకటి. మిగిలిన రెండు కొడుంగల్లూరు, పనయరకవులలో ఉన్నాయి. పూరం ఉత్సవం మార్చి- ఏప్రిల్ సమయంలో నిర్వహించబడుతుంది. ఈ ఇత్సవంలో సాంస్కృతిక విందు కనువిందు చేస్తుంది. 7 రోజులపాటు నిర్వహించబడే దైనందిక పూజ అనేకమందిని ఆకర్షిస్తుంది. ప్రముఖ మాంగల్యపూజ వేలాది యువతులను ఆకర్షిస్తుంది. మాంగల్యపూజలో యువతులు వివాహం జరగాలని అభిలషిస్తూ పూజలో పాల్గొంటారు. తిరుమంధం కోళికోడ్ - పాలక్కాడ్ రాష్ట్రీయ రహదారిలో పెరింతల్మన్నకు పశ్చిమంలో 2కి.మీ దూరంలో ఉంది.

కోత్తకల్ పూరం

మార్చు

కోత్తకల్ ఆయుర్వేద వైద్య కేంద్రం, ఆలయ ఉత్సవం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కోత్తకల్ పూరం మార్చి- ఏప్రిల్ మాసాలలో నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవసమయంలో సంక్స్కృతిక ఉత్సవం ఆకర్షణీయంగా ఉంటుంది. 7 రోజుల ఉత్సవంలో ప్రబల క్లాసికల్ కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు.

నిలంబూర్ పట్టు

మార్చు

నిలంబూర్ పట్టు ఒక పురాతన ఉత్సవం. నిలంబూర్ కోవిలకం జనవరి మాసంలో నిర్వహించబడుతుంది. వారంపాటు నిర్వహించబడే ఈ ఉత్సవానికి వేలాదిమంది ప్రజలు వస్తుంటారు. ఈ ఉత్సవం పురాతన యుద్ధం, వేటతో సంబంధితమై ఉంటుంది. ఈ సంప్రదాయ ఆచారాలలో గిరిజనతెగ పెద్దలు ప్రధానపాత్ర వహిస్తారు.

కొండోతి నెర్చ

మార్చు

కొండొట్టి నెర్చ ఉత్సవం మార్చి మాసంలో 7 రోజులపాటు నిర్వహించబడుతుంది. నెర్చా పళయంగాడిలో ఉన్న కొండొట్టి మసీదులో నిర్వహించబడుతుంది. 18వ శతాబ్దం నుండి ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఇక్కడ మసీదు పక్కనే మహమ్మద్ షా సూఫీ సమాధి ఉంది. సమాధిని ముగల్‌శైలిలో నిర్మించబడింది. నెర్చా ఉత్సవంలో పెట్టీ వరవు పేరుతో మతాల మద్య స్నేహసంబంధాలను మెరిగుపరచడానికి నిర్వహించబడుత్య్ంది. నెర్చా ఉత్సవానికి వేలాది మంది వస్తారు. ఉత్సవంలో వ్యాపారం, వినోదం కలగలసిన కార్నివల్ నిర్వహించబడుతుంది. .

పుథెంపల్లి నెర్చ

మార్చు

పుతెంపళ్ళి అండు నెర్చ ఉత్సవం పెరుంపడప్పు వద్ద నిర్వహించబడుతుంది. మసీదులో నిర్వహించబడుతున్న ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ వార్షిక ఉత్సవం లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. ఉత్సవంలో భాగంగా భక్తులకు, పేదవారికి ప్రసాదంగా నెయ్‌సోరు (ఘీరైస్) అందించబడ్జుతుంది.

ఓమనూర్ నెర్చ

మార్చు

మలప్పురం జిల్లాలోని మసీదు ప్రబల ఉత్సవాలలో ఓమనూర్ నెర్చా ఒకటి. ఇది వీరుల ధైర్యసాహసాలను గుర్తుచేసుకుంటూ నిర్వహించబడుతుంది. ఓమనూర్ కొండోట్టి నుండి 7కి.మీ దూరంలో, ఎడవన్నప్పరాకు 4 కి.మీ దూరంలో ఉంది.

మలపరంబ పెరున్నల్

మార్చు

చర్చి ఉత్సవం మలపరంబ వద్ద నిర్చహించబడే ప్రముఖ చర్చి ఉత్సవం మలపరంబ పెరున్నల్. పెరియపురం, చుంగతారా, ఎడక్కర వద్ద వేసవిలో నిర్వహించబడే చర్చి ఉత్సవాలు కూడా విశేషంగా భక్తులను ఆకర్షిస్తుంది.

వీరంకొడే వెల

మార్చు
 
Thriprangodu Shva Temple

వైరంకొడే వైరంకొడే వేళ (ఆలయ ఉత్సవం), మలప్పురంలో నిర్వహించే ప్రబల ఉత్సవాలలో ఒకటి. వర్షికంగా నిర్వహించబడే ఈ ఉత్సవం ప్రతిసంవత్సరం ఫిబ్రవరి మాసంలో నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవం 6 రోజులపాటు నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో ఊరేగింపు ప్రధానమైనది. సమీపంలోని గ్రామాల నుండి పూత, తిర, కట్టలన్, పులిక్కాల్ మొదలైన జనపద కళా ప్రదర్శనలతో ఈ ఉత్సవం ఆరంభమై వైరంకొడేకు చేరుకుంటారు. ఊరేగింపులో ఎర్రకోటా కలా (అధికంగా అలంకరించబడిన దున్నలు) అధికసంఖ్యలో పాల్గొంటాయి. ఉత్సవ సమయంలో అర్ధరాత్రి సమయంలో బాణాసంచా కాల్చబడుతుంది. ప్రతిరోజు ఉదయం కనలాట్టం (భక్తులు నిప్పులమీద నడుస్తారు) నిర్వహించబడుతుంది. ఉత్సవంలో మరొక ఆకర్షణ గ్రామీణ సంత. గ్రామీణులు గృహాలలో తయారు చేసిన మురం, పుల్లుపాయా, కైతోల పపయా, ఉలక్క, చూరల్, మనపత్రంగల్ మొదలైనవి సంతలో విక్రయిస్తారు. అంతేకాక గృహాలలో తయారు చేసిన స్వీట్లు, పిండివంటలు (పొరి, నొరుక్కు) విక్రయానికి తీసుకువస్తారు. ఉత్సవంలో చేపల మార్కెట్ ప్రఖ్యాతి చెందింది. మత్స్యకారులు సాధారణంగా అరుదుగా లభించే చేపలను చెరువులు మడుగులు, నదులలో పట్టినవి తీసుకువచ్చి సంతలో విక్రయిస్తుంటారు. వీటికి సంతలో మంచి గిరాకీ ఉంటుంది.

పరిశ్రమలు

మార్చు

మలప్పురం జిల్లా పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లా. జిల్లాలో ప్రధానంగా ఒక పారిశ్రామిక వాడ ఉంది. జిల్లాలో 16 పరిశ్రమలు, 8 చిన్నతరహా పరిశ్రమలు, వర్కింగ్ యూనిట్లు ఉన్నాయి. ప్రైమరీ స్కీం ప్రణాళిక ద్వారా ప్రతిసంవత్సరం 1,000 మంది శిక్షణ పొందుతున్నారు. పనక్కాడ్ వద్ద ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ ప్రారంభించడానికి అవసరమైన ప్రయాత్నాలు జరుగుతున్నాయి. పయ్యనాడు వద్ద రబ్బర్ ఆధారిత కామన్ ఫెసిలిటీ సెంటర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉన్నాయి.

మలప్పురం జిల్లాలో వుడ్ సంబంధిత వ్యాపారం అధికంగా కనిపిస్తుంది. కోత్తకల్, ఎడవన, వనియంబలం, కరుల, నిలంబూర్, మాంపాడ్ లలో వుడ్ సంబంధిత పరిశ్రమలు 100 పైగా ఉన్నాయి. సా మిల్లులు, ఫర్నీచర్ తయారీ సంస్థలు, టింబర్ అమ్మకం మలప్పురం జిల్లాలో అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. మలపురం జిల్లాలో ది ఎంప్లాయీస్ స్టేట్ ఇంసూరెంస్ కార్పొరేషన్ (ఇ.ఎస్.ఐ.సి) శాఖ ఉంది.

ఆరోగ్యసంరక్షణ

మార్చు

జిల్లా ప్రస్తుతం దక్షిణ మలబారులో ఆరోగ్యరక్షణా కేంద్రంగా అభివృద్ధిచెందుతూ ఉంది. పెరిందల్మన్నలో ప్రైవేట్ యాజమాన్య స్పెషల్ హాస్పిటల్స్ (మౌలానా హాస్పిటల్, ఎం.ఇ.ఎస్ మెడికల్ కాలేజ్, ఆల్- షిఫా హాస్పిటల్, ఎ.ఎం.ఎస్ కో- ఆపరేటివ్ హాస్పిటల్ ) ఉన్నాయి. మంజేరి వద్ద ప్రభుత్వం నిర్వహిస్తున్న జనరల్ హాస్పిటల్ (మునుపు, డిస్ట్రిక్ హాస్పిటల్) ఉంది. కోత్తకల్‌లో మూడు ప్రధాన ఆరోగ్యసంరక్షణా కేంద్రాలు (ప్రపంచ ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యశాల, మలబార్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైంసెస్ (ఎం.ఐ.ఎ.ఎస్), ఐ- మాస్) ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

మార్చు
 
Karipur International Airport

వాయుమార్గం

మార్చు

మలప్పురం జిల్లాలోని కరిప్పూర్ వద్ద " కరిపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ " (మలప్పురం నుండి 25కి.మీ) ఉంది.

రైలు మార్గం

మార్చు

రెండు రైల్వే లైన్లు, అవి మంగళూరు - మద్రాస్, నిలంబూర్ - షోరనూర్ రైల్వే లైన్ జిల్లా గుండా. జిల్లా తూర్పు ప్రాంతాలలో తీర ప్రాంతాల్లో ద్వారా మాజీ పాస్లు, తరువాతి మంగళూరులో - మద్రాస్ లైన్ వల్లిక్కున్ను, పరప్పనంగది, తనుర్ (భారతదేశం), తిరుర్, తిరునవయ, కుత్తిప్పురం (ఉత్తరం నుండి దక్షిణానికి) రైల్వే స్టేషన్లు ఉన్నాయి. నిలంబూర్ - షోరనూర్ రైల్వే లైన్ నిలంబూర్, వనియంబలం, తువుర్, మెలత్తుర్, కేరళ, పత్తిక్కద్, (పెరింతల్మన్న), అంగదిపురం, చెరుకర రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

రహదారి

మార్చు

జిల్లాలోని అన్ని నగరాలకు, గ్రామీణ ప్రాంతాలకు బసు సర్వీసులు లభ్యమౌతున్నాయి. కేరళ 300 దూరమార్గ బసులను నడుపుతుంది. జిల్లాలో కె.ఎస్.ఆర్.టి.సి. బసు స్టేషన్లు (మలప్పురం డిపో, పొన్నై, పెరింతలమన్న, నిలంబూరు) ఉన్నాయి.

జిల్లాలో చక్కని రహదారి మార్గం ఉంది. జాతీయరహదారి -17 (జాతీయరహదారి -66 గా మార్చబడింది) జిల్లాలోని ఇడిముళిక్కల్ వద్ద జిల్లాలో ప్రవేశిస్తుంది. ఇది కాలికట్ విశ్వవిద్యాలయం, కోత్తకల్,ంవలంచెరి, కుట్టిపురం, తవనూర్, పొన్నై, పుదుపొన్నై, వెలియన్‌కోడ్, కడిక్కడు వరకూ పయనించి ముగుస్తుంది. ఇది 82 కి.మీ పొడవుంటుంది. రహదారి త్రిసూరు జిల్లా వరకు పొడిగించబడి ఉంది. జాతీయరహదారి 213 (జాతీయరహదారి -966 గా మార్చబడింది) జిల్లాలోని ఇయక్కరప్పాడి రామనత్తుక్కర వద్ద జిల్లాలో ప్రవేశించి కొండోట్టి, మలప్పురం, పెరితలమన్న, కరినకల్లతాని వద్ద ముగుస్తుంది. ఈ రహదారి పొడవు 68కి.మీ.

రాష్ట్రీయ రహదారులలో తిరూరు - మంజెరి, మలప్పురం - పరప్పనగాడి, కోళికోడ్ - నిలంబూరు రోడ్డు జిల్లాను దాటి వెళుతుంటాయి. జిల్లలో మొత్తంగా 208.178 కి.మీపొడవున రాష్ట్రీయ రహదారి ఉంది. 1220కి.మీ పొడవైన ప్రధాన జిల్లా రహదారులు ఉన్నాయి. 102 కి.మీ పొడవై ఇతర రాష్ట్రీయ రహదారులు,, 160కి.మీ పొడవై గ్రామీణ రహదార్లు ఉన్నాయి.

నదులు

మార్చు
 
The Ponnani Harbor

చలియార్, కడలుండి పుళా, భారతపుళా, తుతా నది, ఉపనదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. వీటిమీద పలు రహాదరి వంతెనలు ఉన్నాయి. వీటిలో కుట్టిపురం వంతెన, తూతా వంతెన, పులమంతోలే వంతెన ప్రధానమైనవి. కోత్తకడవు, పరక్కడవు, తయ్యిలకడవు, పనంపుళా, కూమంకల్లు, నూరాడి, కొట్టిలంగాడి నది, అన్నక్కయం, మెలత్తూర్ (కేరళ), కాలికవ్వు, ఒలిపరం, వడప్పురం, మిలాడి (కేరళ, కరీంపుళా, కూరాడ్, కొట్టాడిక్కడవు, చెరుపుళా (అరీకొడే), కడంగలూర్, పూంకుడి చలియార్ నది మీద నిర్మించబడ్డాయి. ఉపనదులకు ఎడకులం, తలకడత్తూర్, తిరూర్, ఉన్నియల్, మంగాట్టి, ఎట్టిక్కడవు తిరూరు నది మీద నిర్మించబడ్డాయి. టి.ఎన్ కాలువ మీద తిరూర్ వంతెన నిర్మించబడింది.

అభివృద్ధి

మార్చు
  • మలపురం డెవెలెప్మెంట్ అధారిటీ నగారాలు, పొరుగున ఉన్న పంచాయితీలలో అభివృద్ధి స్థాపనకు రూపొందించబడింది.
  • కోళికోడ్ - మలప్పురం - అంగడిపురం- ఓట్టపాలెం - రైల్వే మార్గం. జిల్లాలో ఈ మార్గం కొరకు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇది మలప్పురం జిల్లాను కోళికోడులో ఉన్న కరిప్పూర్ విమానాశ్రయంతో అనుసంధానిస్తుంది.
  • మలప్పురం సిటీ బస్ సర్వీసులు ప్రవేశపెట్టబడ్డాయి.
  • కె.సి.ఆర్.టి.సి బస్ టెర్మినల్, షాపింగ్ కాంప్లెక్స్ అప్‌హిల్ వద్ద నిర్మించబడింది.
  • పనక్కాడు శీఘ్రగతిలో నిర్మించబడుతున్న ఎడు - హెల్త్ సిటీలో ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆర్ట్స్, సైన్సు కాలేజ్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి.
  • ముంసిపల్ స్టేడియం అధునికీకరణ చర్యలు స్టేడియానికి అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి.
  • డౌన్ హిల్, బస్ స్టాప్ మార్కెట్ ఆధునికీకరణ, స్థలమార్పిడి చర్యలు.
  • కొట్టపాడి బైపాస్ పని పూర్తిచేయడం.
  • మలప్పురం డిస్ట్రిక్ ఉర్బనైజేషన్ రిపోర్ట్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు మలప్పురం- వలంచేరి సరికొత్త రహదారి ప్రతిపాదన.
  • జాతీయరహదారి 1 రూపకల్పన - మంజరి - గుడలూర్ 2 మలప్పురం - కొలత్తూర్ - పులమ్మనతోల్ - త్రిసూర్.

వాహన నమోదు

మార్చు

మలప్పురం జిల్లాల్లో వాహన రిజిస్ట్రేషన్లు.

  • 'కె.ఎల్-10' : మలప్పురం ఆర్.టి.ఒ. (ఎర్నాడు &, కొందోట్టి తాలూకా) ,
  • 'కె.ఎల్-53' : పెరింతలమన్న ఎస్.ఆర్.టి.ఒ (పెరింతలమన్న తాలూకా) ,
  • 'కె.ఎల్-54' : పొన్నాని ఎస్.ఆర్.టి.ఒ (పొన్నాని తాలూకా) ,
  • 'కె.ఎల్-55' : తిరూర్ ఎస్.ఆర్.టి.ఒ (తిరూర్ తాలూకా)
  • 'కె.ఎల్-65' : తిరురంగాడి ఎస్.ఆర్.టి.ఒ (తిరురంగాడి తాలూకా) ,
  • 'కె.ఎల్-71' : నిలంబూర్ ఎస్.ఆర్.టి.ఒ (నిలంబూర్ తాలూకా) .

విద్య

మార్చు

తెంజిపాలెం వద్ద కాలికట్ విశ్వవిద్యాలయం ఉంది. ఎ.ఎం.యు. చెలమల వద్ద (అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయం) మలప్పురం సెంటర్ ఉంది. ఎడు హెల్త్ సిటీ వద్ద ఇ.ఎఫ్.ఎల్.యు (ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం) ఎ.ఎఫ్.ఎల్.యు మలప్పురం కాంపస్ స్థాపించాలని ప్రతిపాదించబడింది. తుంచన్ పరంబు నుండి 26కి.మీ దూరంలో తుంచత్తు ఎళుత్తచ్చన్ మలయాళం విశ్వవిద్యాలయం ఉంది. ఆయుర్వేద విశ్వవిద్యాలయం స్థాపించడానికి ప్రయత్నాలు ఆరంభం అయ్యయి. జిల్లాలో 4 ఎజ్యుకేషన్ జిల్లాలు (మలప్పురం, వండూర్, తిరురంగాడి,, 17 సబ్ ఎజ్యుకేషన్ డిస్ట్రిక్స్)!ఉన్నాయి.

మెడికల్ కాలేజీలు

మార్చు
  • ప్రభుత్వ వైద్య కళాశాల, మలప్పురం మంజేరి
  • ఎం.ఇ.ఎస్. మెడికల్ కాలేజ్, పెరిందమల

ఆయుర్వేదిక్ వైద్యకళాశాల

మార్చు
  • వి.పి.ఎస్.వి. ఆయుర్వేద కాలేజ్, కోత్తకల్

ఇంజనీరింగ్ కళాశాలలు

మార్చు
  • ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఠెణిపలం కాలికట్ యునివెర్సిటీ ఇన్స్టిట్యూట్
  • ఎరనద్ నాలెడ్జ్ సిటీ సాంకేతిక క్యాంపస్ (ఈ.కె.సి ), చెరుకులం, మంజెరి

వ్యవసాయ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, టవనుర్ యొక్క

  • కెలప్పజి కాలేజ్
  • ఎ.సి.ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, కుత్తిప్పురం
  • ఎం.ఈఇ.ఏ ఇంజనీరింగ్ కాలేజ్, పెరింథల్మన్న
  • టెచ్న్లొగ్య్, కరద్పరంబ యొక్క వేదం వ్యాస ఇన్స్టిట్యూట్

ఇంజనీరింగ్, టెక్నాలజీ, వలంచెరి యొక్క * కొచ్చిన్ కాలేజ్

పాలిటెక్నిక్ కళాశాలలు

మార్చు
  • ఎస్ఎస్ఎం పాలిటెక్నిక్ కాలేజ్, తిరుర్
  • ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, పెరింథల్మన్న
  • ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, టిరురంగది.
  • ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్, ఖొత్తకల్
  • మైదిన్ పాలిటెక్నిక్ కాలేజ్, మలప్పురం

ప్రభుత్వం. ఆర్ట్స్ కళాశాలలు

మార్చు
  • ప్రభుత్వ కళాశాలలో మలప్పురం
  • పూక్కొయ తంగల్ మెమోరియల్ గవర్నమెంట్. కాలేజ్, పెరింతల్మన్న
  • తుంచన్ మెమోరియల్ గవర్నమెంట్. కాలేజ్, తిరుర్

ఫార్మసి కళాశాలలు

మార్చు
  • ఫార్మసీ, ఛెలెంబ్ర యొక్క దేవకి అమ్మలకు మెమోరియల్ కాలేజ్.
  • జామియా సలఫియ ఫార్మసీ కళాశాల, పులిక్కల్.
  • ఫార్మసీ, పెరింథల్మన్న యొక్క మౌలానా కాలేజ్.
  • ఫార్మసీ, ఫెరింథల్మన్న యొక్క అల్ షిఫ కాలేజ్.

ప్రైవేట్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలు

మార్చు
  • ఎం.ఇ.ఎస్ కాలేజ్, వలంచెరి
  • మజ్లిస్ ఆర్ట్స్, స్చించె, పురమనుర్, వలంచెరి
  • పి.ఎస్.ఎం.ఒ కాలేజ్, తిరురంగది
  • హె.ఎం కళాశాల, ఎమంజెరి
  • రత్నాలు కళాశాల, రమపురం
  • అల్లిగర్హ్ విశ్వవిద్యాలయం
  • ఎం.ఐ.సి.ఆర్ట్స్ ఎం,ఐ.సి.ఆర్ట్స్, సైన్స్ కళాశాల
  • ఎం,ఈ,ఎస్ కాలేజి మాంబాద్

సమాచార వ్యవస్థ

మార్చు
  • పోస్టల్ విభాగాలు 2 (మంజేరి, తిరూర్)
  • హెడ్ పోస్టాఫీసులు 4
  • సబ్ హెడ్ పోస్టాఫీసులు 120
  • డిపార్ట్మెంటల్ బ్రాంచ్ హెడ్ పోస్టాఫీసులు 284
  • స్పీడ్ హెడ్ పోస్టాఫీసులు 8 మల్లపురం, మంజేరి, పెరిందమల, కాలికట్ విశ్వవిద్యాలయం, కరిపూర్, పొన్ని, కోత్తకల్, కుట్టిపురం, ఎడప్పల్

మలప్పురం రెవెన్యూ డిస్ట్రిక్ టెల్కాం సర్వీసులు మలప్పురం సెకండరీ స్విచింగ్ ప్రాంతంలో పనిచేస్తాయి. జిల్లాలో 7 డివిజనల్ ఆఫీసులు (మంజేరి, నిలంబూరు, పెరిందమల, తిరూర్, పొన్నని,, పరప్పనన్‌గాడి) ఉన్నాయి.

మాధ్యమం

మార్చు

మలయాళయం మనోరమ, మత్రుభూమి, మధ్యమం, చంద్రిక (మలయాళం వార్తాపత్రిక), దేశాభిమాని పత్రికలకు జిల్లాలో స్వంతప్రచురణా సంస్థలు ఉన్నాయి. ప్రహేళిక, ఫ్లాష్ ఈవెనింగ్ ఎడిషనులుగా వెలువడుతున్నాయి. మతం, సంప్రదాయక ప్రాతిపదిక మీద మాసపత్రిక, పక్షపత్రికలు వెలువడుతున్నాయి. జిల్లాలో దాదాపు మలయాళ చానల్స్ అన్నింటికీ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో మలప్పురం కేబుల్ విషన్ (ఎం.సి.వి), ఆసియానెట్ కేబుల్ విషన్ (ఎ.చి.వి), డెన్ మలబార్ విషన్ మొదలైన కేబుల్ టి.వి చానళ్ళు ఉన్నాయి. అప్ హిల్ వద్ద మలప్పురం ప్రెస్ క్లబ్ ఉంది. మలప్పురం, మంజేరి వద్ద దూరదర్శన్ రిలే స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలోని మంజేరి వద్ద ఆల్ ఇండియా రేడియా ఎఫ్.ఎం. బ్రాడ్‌కాస్టింగ్ స్టేషన్ ఉంది.

జిల్లా విభజన ఆందోళన

మార్చు

మలప్పురం జిల్లాను రెండుగా విభజించాలని ప్రతిపాదన చేసారు. కొత్త జిల్లాకు తిరూర్ కేంద్రంగా చేయాలని ప్రతిపాదిస్తున్నారు. 2911 గణాంకాలు అనుసరించి మలప్పురం జిల్లా జనసంఖ్య 41,10,956. రాష్ట్ర జనసంఖ్యలో ఇది 12.31%. అభివృద్ధి ప్రణాళిక నిధి మంజూరులో జనసంఖ్య ప్రాతిపదికగా తీసుకోవడం లేదు.

జిల్లా ప్రముఖులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
  2. 2.0 2.1 pp. 396, Malayala Manorama Yearbook 2006, Kottayam, 2006 ISSN 0970-9096
  3. "Summer Journey 2011". Time. 21 July 2011. Archived from the original on 24 ఆగస్టు 2013. Retrieved 30 జూన్ 2014.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2013-06-29. New Zealand 4,143,101 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oregon 3,831,074
  7. M. Paul Lewis, ed. (2009). "Allar: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  8. M. Paul Lewis, ed. (2009). "Aranadan: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

బయటి లింకులు

మార్చు