మలేర్‌కోట్ల జిల్లా
మలేర్‌కోట్ల జిల్లా భారతదేశం, పంజాబ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. మలేర్‌కోట్ల పట్టణం ఈ జిల్లా ముఖ్యపట్టణం ఇది సంగ్రూర్ జిల్లాను విభజించగా 2021 జూన్ 02న పంజాబ్‌లో 23వ జిల్లాగా అవతరించింది.[1]మలేర్‌కోట్ల జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం మలేర్‌కోట్ల, అమర్‌ఘర్, అహ్మద్‌ఘర్ అనే మూడు ఉపవిభాగాలుగా విభజించబడింది:
Malerkotla district | |
---|---|
Coordinates: 30°32′N 75°53′E / 30.53°N 75.88°E | |
Country | భారతదేశం |
State | Punjab |
Division | Patiala |
Established | 02 June 2021 |
Headquarters | Malerkotla |
Government | |
• Deputy Commissioner | Sh.Sanyam Agarwal, IAS |
• Senior Superintendent of Police | Smt. Alka Meena IPS |
విస్తీర్ణం | |
• Total | 684 కి.మీ2 (264 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 4,29,754 |
• Rank | 23rd |
• జనసాంద్రత | 629/కి.మీ2 (1,630/చ. మై.) |
Languages | |
• Official | Punjabi |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 148XXX |
Vehicle registration | PB-28(for Malerkotla) PB-76(for Ahmedgarh) PB-82(for Ahmedgarh SDM) PB-92(for Amargarh) |
Nearest city | Malerkotla |
Sex ratio | 896 ♂/♀ |
Literacy | 76.28% |
Lok Sabha constituency | Sangrur Fatehgarh Sahib |
Punjab Legislative Assembly constituency | 2 •Malerkotla •Amargarh |
Precipitation | 450 మిల్లీమీటర్లు (18 అం.) |
Avg. summer temperature | 48 °C (118 °F) |
Avg. winter temperature | 7 °C (45 °F) |
చరిత్ర
మార్చుమలేర్కోట్ల ప్రాంతం సా.శ. 1454 నుండి 1948 ఆగస్టు 20 వరకు పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్ర సమాఖ్యలో భాగమయ్యే వరకు మలేర్‌కోట్ల రాష్ట్రం రాచరిక రాష్ట్రంగా ఉంది. ఇది 1956లో పంజాబ్‌లో విలీనమై, సంగ్రూర్ జిల్లాలో భాగమైంది.
పరిపాలన
మార్చుమలేర్కోట్ల జిల్లా ఉత్తర భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో 23వ జిల్లాగా ఏర్పడింది. [2] ఈ జిల్లా 14 మే, 2021న సంగ్రూర్ జిల్లా నుండి వేరు చేయబడింది. [3] మలేర్‌కోట్ల, అహ్మద్‌ఘర్ ఉపవిభాగాలు, అమర్‌ఘర్ ఉప - తహసీల్‌లో భాగంగా ఉన్నాయి. [4]
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం మలేర్‌కోట్ల జిల్లాలో 4,29,754 మంది జనాభాను కలిగిఉంది. [5] దీని వైశాల్యం 684 చ.కి.మీ. ఇది 3 రెవెన్యూ డివిజన్లు,పురపాలక సంఘాలు,కమ్యూనిటి డెవలప్మెంట్ బ్లాక్‌లను కలిగి ఉంది. జిల్లా పరిధిలో 175 గ్రామ పంచాయతీలు, 192 గ్రామాలు ఉన్నాయి. 40.50% మంది జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 93,047 (21.65%) మంది ఉన్నారు. [6]
పట్టణ మొత్తం జనాభాలో సిక్కు మతం జనాభా ఎక్కువమందితో మొదటి స్థానంలో ఉంది. ప్రధానంగా వీరిలో ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు అత్యధిక ప్రజలు. పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా, విభజన సమయంలో మలేర్‌కోట్ల ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. మలేర్‌కోట్లలో ఇప్పటికీ గణనీయమైన మైనారిటీ ముస్లింలు ఉన్నారు. [7]పట్టణ ప్రాంతాల్లో హిందువులు మూడవ అతిపెద్ద సమాజంగా ఉంది. [8] 2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 96.69% మంది పంజాబీ, 3.21% మంది ఉర్దూ వారి మొదటి భాషగా మాట్లాడతారు. [9]
రాజకీయం
మార్చుమలేర్కోట్ల జిల్లా మలేర్‌కోట్ల శాసనసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహ్మద్ జమీల్ ఉర్ రెహ్మాన్ 2022 నుండి శాసనసభ సభ్యుడుగా కొనసాగుచున్నాడు.[10]
మలేర్‌కోట్ల జిల్లా సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి 2022 జూన్ 23న ఉపఎన్నిక జరిగింది. ఆఎన్నికలో సిమ్రంజిత్ సింగ్ మాన్ లోక్‌సభ సభ్యుడుగా ఎంపికయ్యాడు. [11]
చిత్రమాలిక
మార్చుమలేర్కోట్ల స్మారక చిహ్నాలు, ఆకర్షణలు
మార్చు-
గురుద్వారా సాహిబ్ హావ్ ద నారా
-
ముబారక్ మంజిల్ ప్యాలెస్
-
మలేర్‌కోట్ల కోట
-
మలేర్‌కోట్ల రైల్వే స్ఠేషన్
-
మలేర్‌కోట్ల ఈద్గా
-
ప్రభుత్వ కళాశాల
ఇది కూడా చూడు
మార్చు- మలేర్‌కోట్ల రాష్ట్రం
మూలాలు
మార్చు- ↑ "Punjab CM declares state's only Muslim-majority town Malerkotla as district on Eid". India Today. Retrieved 2023-08-04.
- ↑ "Malerkotla is Punjab's 23rd district". The Hindu. 2021-05-14. ISSN 0971-751X. Retrieved 2021-05-14.
- ↑ "Malerkotla is Punjab's 23rd district". The Hindu. 2021-05-14. ISSN 0971-751X. Retrieved 2021-05-14.
- ↑ Malerkotla to be 23rd District of Punjab Archived 2023-05-01 at the Wayback Machine 14 May 2021, The Tribune. Retrieved 14 May 2021.
- ↑ "Demography | District Malerkotla, Government of Punjab | India". Retrieved 2022-05-16.
- ↑ "District Census Handbook: Sangrur" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India. 2011.
- ↑ "Punjab CM declares state's only Muslim-majority town Malerkotla as district on Eid". India Today. Retrieved 2023-08-04.
- ↑ "Table C-01 Population by Religious Community: Punjab". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
- ↑ "Table C-16 Population by Mother Tongue: Punjab". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
- ↑ "Election results". Retrieved 26 May 2022.
- ↑ "Sangrur Lok Sabha bypoll on June 23". Tribuneindia News Service. Retrieved 26 May 2022.