మల్లెపందిరి (1982 సినిమా)

మల్లెపందిరి జంధ్యాల దర్శకత్వంలో, విజ్జిబాబు, జ్యోతి, బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సుందరరామ్మూర్తి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు హాస్య చిత్రం. కాంతి ఫిలిమ్స్ పతాకంపై చల్లా వెంకట్రామయ్య నిర్మించారు.

మల్లెపందిరి
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం విజ్జి బాబు,
జ్యోతి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
వేటూరి సుందరరామ్మూర్తి
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ కాంతి ఫిలింస్
భాష తెలుగు

చిత్ర కథ

మార్చు

వెంకూ (విజ్జి బాబు)కు 35 సంవత్సరాలు నిండినా పెళ్ళి అవదు. పెళ్ళి చేసుకోవాలంటే ఏం చేయాలన్న విషయం మీద ప్రేమ గురువు (వేటూరి)ని ఆశ్రయిస్తారు. అతనిచ్చే చిట్కాలు పనిచేయకున్నా మొత్తానికి వెంకూని శ్యామల (జ్యోతి) ప్రేమిస్తుంది, పెళ్ళి అవుతుంది. దురదృష్టవశాత్తూ వెంకూ ఉద్యోగం పోతుంది, శ్యామలకు ఉద్యోగం వస్తుంది. చుట్టుపక్కల వారు, తెలిసినవారూ ఆడదాని సొమ్ముతో బతుకుతున్నాడని అవమానించడంతో భార్యభర్తలు విడిపోతారు. తనకంటూ ఎవరూ లేరన్న బాధలో ఆత్మహత్య చేసుకుందామని, తనకు తానుగా చేయలేక షేక్ మోజెస్ మూర్తి (ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం) అనే ప్రొఫెషనల్ కిల్లర్ తో చంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. శ్యామల భర్త పడ్డ బాధ అర్థంచేసుకుని, క్షమించమంటూ మళ్ళీ వెంకూ వద్దకు వస్తుంది. మళ్ళీ వెంకూకి బతకాలనే కాంక్ష పుడుతుంది. చంపుతానంటూ వెంటపడుతున్న ప్రొఫెషనల్ కిల్లర్, బతుకుమీద ఏర్పడ్డ తీపి మధ్య ఇరుక్కుని వెంకూ ఎలా ఇబ్బందిపడ్డాడన్నదే సినిమాకు ముగింపు.

చిత్రబృందం

మార్చు

తారాగణం

మార్చు

సినిమాలోని ముఖ్యపాత్రలు, పాత్రధారులు:

సాంకేతిక నిపుణులు

మార్చు

ముఖ్యసాంకేతిక బృందం:

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

తన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమాలో టీనేజ్ ప్రేమకథని చిత్రీకరించిన జంధ్యాల తన రెండో సినిమాకు హాస్యాన్ని ఎంచుకుని తీశారు. 1975లో విడుదలై విజయం పొందిన ఛోటీ సీ బాత్ అనే హిందీ సినిమాతో ప్రారంభమైన ప్రేమ గురువు అన్న కాన్సెప్ట్ ఈ సినిమా ద్వారా తెలుగులో చూపించారు జంధ్యాల.[1]

సినిమా పేరు

మార్చు

సినిమాకి ముందుగా "1,2,3,4" అన్న పేరు పెడదామని భావించారు, "మగాడా! మొగుడివి కాకు" అన్న పేరును అనుకున్నారు. అయితే ఇవి సరిపడవని భావించడంతో, ప్రస్తుతమున్న మల్లెపందిరి అన్న పేరు పెట్టారు.[1]

చిత్రీకరణ

మార్చు

మల్లెపందిరి సినిమా చిత్రీకరణ 1981లో అక్టోబరు 29న ప్రారంభించారు. దాదాపు 30రోజుల పాటు జరిగిన సినిమా చిత్రీకరణ ప్రధానంగా రాజమండ్రి చుట్టుపక్క ప్రాంతాల్లో జరిగింది. సినిమా 1981 నవంబరు 30లో పూర్తైంది. ఒకే ఒక్క షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ పూర్తిచేశారు. సినిమా ప్రధానంగా రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకోగా పాటలు పాపికొండలు, దేవీపట్నం, హుకుంపేట, గుమ్మళ్ళదొడ్డి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు.[1]

పాటల జాబితా

మార్చు

1.అన్నానుఈ పొద్దు రావద్దు నువ్వనీ , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి.

2.కదిలే కోరికవో కధలో నాయికవొ ,, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

3.ఓ సతీ నాగతి ఓహో నా శ్రీమతి ఆహా సౌభాగ్యవతి , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

4.తొలిచూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే, రచన: వేటూరి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

5. లాగడానికి ఎందుకురా తొందర నిదుర , రచన:బాబ్నా , సుబ్బారావు, గానం.ఎస్ . పి బాలసుబ్రహ్మణ్యం బృందం.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 పులగం, చిన్నారాయణ (ఏప్రిల్ 2005). జంధ్యా మారుతం (I ed.). హైదరాబాద్: హాసం ప్రచురణలు.

. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.