ప్రముఖ హాస్యచిత్రాల దర్శకుడు జంధ్యాల వెండితెరకు పరిచయం చేసిన నటులలో ప్రదీప్ ఒకడు.[1] 15కి పైగా నంది అవార్డులు అందుకున్నాడు.[2] జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం ఇతని మొదటి సినిమా.[3] తరువాత కొన్ని సినిమాలలోనే నటించాడు. తరువాత టెలివిజన్ రంగంవైపు మొగ్గు చూపి అనేక సీరియళ్లలో, టెలీ ఫిలింలలో నటించి, దర్శకత్వం వహించాడు. అనేక సీరియళ్లను నిర్మించాడు. ప్రముఖ రంగస్థల కళాకారుడు విన్నకోట రామన్న పంతులు ఇతని తాత.

ప్రదీప్
జననంవిజయవాడ
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1981 - ప్రస్తుతం

జీవిత విశేషాలుసవరించు

ప్రదీప్ విజయవాడలో పుట్టి పెరిగాడు. నటనలో ఓనమాలు దిద్దుకున్నది కూడా అక్కడే.

నటించిన సినిమాలుసవరించు

సీరియళ్ళుసవరించు

జంధ్యాలతో పని చేస్తున్నపుడు స్క్రీన్ ప్లే లో ఆసక్తి కలిగింది. ఆ శిక్షణతో ప్రదీప్ కొన్ని సీరియళ్ళకు దర్శకత్వం వహించాడు. ప్రదీప్ దర్శకత్వం వహించిన మట్టి మనిషి సీరియల్ లో అక్కినేని నాగేశ్వరరావు నటించాడు.[2]

 • బుచ్చిబాబు
 • పెళ్ళి చూపులు
 • చాణక్య
 • మట్టి మనిషి
 • మందాకిని
 • ముద్దు బిడ్డ
 • మంచి మనసులు
 • ఏది నిజం
 • మమతల కోవెల

మూలాలుసవరించు

 1. వెబ్, మాస్టర్. "జంధ్యాల గారి సినిమా ముద్దమందారం హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల". జంధ్యావందనం. మూలం నుండి 2016-10-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-08-29.
 2. 2.0 2.1 "తెలుగు సినిమాల్లో ఆత్మలోపిస్తోంది". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 30 August 2016.
 3. "32 Years in Industry... Pradeep". mirchi9.com. Retrieved 30 August 2016.

బయటి లింకులుసవరించు