మహబూబ్ చౌక్ క్లాక్ టవర్
మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చార్మినార్ కు పడమర వైపున్న క్లాక్ టవర్. 1880లో పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఈ ఐదు అంతస్తుల క్లాక్ టవర్ ను నిర్మించాడు. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ | |
---|---|
రకం | టవర్ |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ |
విస్తీర్ణం | చార్మినార్ |
నిర్మించినది | 1892 |
నిర్మాణం
మార్చుపైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో 1892లో హైదరాబాద్ వాస్తుశిల్పి వారసత్వం యొక్క ముఖ్యమైన భాగంగా పరిగణించబడిన మహబూబ్ చౌక్ ప్రాంతంలోని చిన్న తోట మధ్యలో ఐదు అంతస్తుల్లో ఈ క్లాక్ టవర్ నిర్మించబడింది.[1][2]
టర్కీష్ శైలిలో నిర్మించబడిన క్లాక్ టవర్ నాలుగు వైపుల నాలుగు పెద్ద గడియారాలు ఉన్నాయి, నాలుగు దిశల నుండి సమయాన్ని చూడవచ్చు.
ప్రదేశం
మార్చుచార్మినార్ కు పడమర వైపున, లాడ్ బజార్ కు సమీపంలో ఈ మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ ఉంది.[3][4][5][6]
మూలాలు
మార్చు- ↑ "Mahboob Chowk clock tower cries for attention". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 23 January 2019.
- ↑ "Tourists tend to avoid Mahboob Chowk Clock Tower". Deccan Chronicle (in ఇంగ్లీష్). 25 July 2019. Archived from the original on 17 నవంబరు 2018. Retrieved 23 January 2019.
- ↑ "Mahboob Chowk Clock Tower lies in neglect". The Siasat Daily. 21 October 2014.
- ↑ "Hyderabad's Heritage - Mesmerising Architectural Splendours". KnowAP. 2 July 2009. Archived from the original on 17 నవంబరు 2018. Retrieved 23 జనవరి 2019.
- ↑ "After decades of neglect, Hyd's 126-year-old Mahboob Chowk clock starts ticking again". The News Minute. 1 October 2018. Retrieved 23 January 2019.
- ↑ "Time stands still at Mahboob Chowk, only apathy ticks - Times of India". The Times of India. Retrieved 23 January 2019.