మహిపాల్ దండా

హర్యానా రాజకీయ నాయకుడు, రాష్ట్ర మంత్రి

మహిపాల్ దండా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పానిపట్ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 17 అక్టోబర్ 2024న నయాబ్ సింగ్ సైనీ రెండవ మంత్రివర్గంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఆర్కైవ్స్ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

మహిపాల్ దండా
మహిపాల్ దండా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
17 అక్టోబర్ 2024
గవర్నరు బండారు దత్తాత్రేయ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 అక్టోబర్ 2014
ముందు ఓం ప్రకాష్ జైన్
నియోజకవర్గం పానిపట్ రూరల్

వ్యక్తిగత వివరాలు

జననం (1974-09-16) 1974 సెప్టెంబరు 16 (వయసు 50)
కావి, పానిపట్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం ఎల్డెకో టౌన్‌షిప్‌, పానిపట్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

మహిపాల్ దండా 1987లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా విద్యార్థి రాజకీయాల్లో అడుగుపెట్టి 1996 నుండి 2004 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో రాష్ట్ర సహ మంత్రిగా, 2004లో బీజేపీ పానిపట్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, 2006 నుండి 2009 వరకు పానిపట్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 2009 నుండి 2012 వరకు హర్యానా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, 2012లో హర్యానా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి 2014లో పానిపట్ రూరల్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మహిపాల్ దండా 2024 ఎన్నికలలో కైతాల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి లీలారామ్‌పై 50,212 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4] నయాబ్ సింగ్ సైనీ రెండవ మంత్రివర్గంలో 17 అక్టోబర్ 2024న పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఆర్కైవ్స్ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  2. The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  3. Hindustantimes (26 September 2019). "Haryana Assembly Polls: Mahipal Dhanda, Panipat (rural) MLA". Retrieved 28 October 2024.
  4. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. Amar Ujala (17 October 2024). "Nayab cabinet 2.0: नायब सरकार में मंत्री बने महिपाल ढांडा, पानीपत ग्रामीण के हैं विधायक, जानें इनके बारे में" (in హిందీ). Retrieved 28 October 2024.
  6. The Tribune (17 October 2024). "Haryana Cabinet: A blend of experience, loyalty, and new faces" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.