మహీధర రామమోహనరావు

ప్రముఖ రచయిత

మహీధర రామమోహనరావు ప్రముఖ తెలుగు రచయిత. ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అంగీకరించి, రచనల్లోనూ, జీవితంలోనూ కమ్యూనిజాన్ని అనుసరించారు. రామమోహనరావు తెలుగులో పలు చారిత్రిక నవలలు రాశారు. రామమోహనరావు నవలల్లో కొల్లాయిగట్టితేనేమి? సుప్రసిద్ధి పొందింది. 1960వ దశకం మొదటిభాగంలో రాసిన ఈ నవలకు 1968 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య పీఠం పురస్కారం దక్కింది. ఈయన కుమారుడు మహీధర నళినీమోహన్ కూడా పాపులర్ సైన్సు లో అనేక రచనలు చేశాడు.

మహీధర రామమోహనరావు
జననం
ముంగండ, తూర్పుగోదావరి జిల్లా
వృత్తిరచయిత
పిల్లలుమహీధర నళినీమోహన్

జీవితంసవరించు

రామ్మోహన్ రావు తూర్పు గోదావరి జిల్లా, ముంగండ అగ్రహారంలో జన్మించాడు. తన ఐదో ఏట చదువు ప్రారంభించాడు. బడికి వెళ్ళిన మొదటి రోజునే ఉపాధ్యాయుడు తొడపాశం పెట్టడంతో తండ్రి అతన్ని బడికి మాన్పించి ఇంట్లోనే చదువు చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళ చావడిలోనే ఊరి గ్రంథాలయం ఉండేది. అందులోనే ఏడేళ్ళ వయసుకే వావిలకొలను సుబ్బారావు, సెట్టి లక్ష్మీ నరసింహం, చిలకమర్తి లక్ష్మీనరసింహం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు లాంటి ప్రముఖులు రచయించిన పలు పుస్తకాలు చదవడం అలవాటు అయ్యింది. పద్నాలుగేళ్ళ వయసులో ఆయనకు వివాహమైంది.

మహీధర రామమోహనరావు స్వాతంత్ర్యోద్యమంలో కృషిచేసి జైలుకు వెళ్ళారు. కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి పనిచేశారు. ఆయన విశాలాంధ్ర దినపత్రికలో జర్నలిస్టుగా, పత్రికా సంపాదకునిగా పనిచేశారు.

రచనా రంగంసవరించు

మహీధర రామమోహనరావు కొల్లాయిగట్టితేనేమి?, దేశం కోసం, రథచక్రాలు మొదలైన నవలలు రాసి ప్రఖ్యాతి పొందారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఉంటూ, విశాలాంధ్ర పత్రికలో పనిచేస్తున్న కాలంలోనే ఒక వ్యాసంలో అమృతాంజనం అమ్ముకునేందుకే పెట్టిన ఆంధ్రపత్రిక అంటూ విమర్శించినందుకు, ఆ తరానికి జాతీయోద్యమం, దానిలోని సంస్కరణ బీజాలు తెలియడం లక్ష్యంగా కొల్లాయిగట్టితేనేమి? వ్రాయడం ప్రారంభించారు. 1920ల్లో విద్యావంతుడైన బ్రాహ్మణ యువకుడు సంప్రదాయ బ్రాహ్మణాగ్రహారమైన ముంగండలో కాంగ్రెస్ లో చేరి హరిజనోద్ధరణ, తదితర కార్యక్రమాలు ప్రారంభించడం ప్రధానాంశంగా నవల రాశారు.[1]

రచనలుసవరించు

 • అగ్నిగుండం
 • కత్తుల వంతెన
 • ఎవరికోసం
 • కొల్లాయి గట్టితేనేమి?
 • ఓనమాలు
 • శుభలేఖ
 • ఈ దారి ఎక్కడికి?
 • దేశం కోసం
 • జ్వాలాతోరణం

అనువాదాలు:

 • ఆంధ్రుల సంస్కృతి- చరిత్ర 1

( కంభంపాటి సత్యనారాయణ గారు ఆంగ్లంలో రచించిన 'A study of the History and Culture of the Andhras' కు స్వేచ్చానువాదం)

పురస్కారాలుసవరించు

 • 1989:ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[2]

మూలాలుసవరించు

 1. మహీధర, రామమోహనరావు. "కొల్లాయిగట్టినేమి? - నేనెందుకు రాశాను?". పుస్తకం.నెట్. Retrieved 5 July 2016.[permanent dead link]
 2. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.