మహీధర నళినీమోహన్

మహీధర నళినీ మోహన్ ఒక ప్రముఖ రచయిత. ఈయన పాపులర్ సైన్స్ రచనలు రాయడంలో ప్రసిద్ధుడు. తనకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందికైన పదాల్లో సామాన్యుల భాషలో రాయడంలో ఈయన చేసిన కృషి చెప్పుకోదగ్గది. సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు మహీధర రామమోహనరావు ఈయన తండ్రి. బహు గ్రంథకర్త అయిన మహీధర జగన్మోహనరావు ఈయన పినతండ్రి. పదిహేనవ ఏటనుండి కవిత్వ రచనలో ప్రవేశం ఉన్న నళినీ మోహన్ జనరంజక విజ్ఞానంలో దరిదాపు 30 పుస్తకాలు, పిల్లల కోసం 12 పుస్తకాలు, కవితలూ, వ్యాసాలూ వగైరా 10 పుస్తకాల వరకూ వ్రాశాడు. వివిధ పత్రికలలో ఇతని రచనలు దాదాపు 1,000 పైగానే ప్రచురితం అయి ఉంటాయి. 1968లో దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతిని, 1987లో ఇందిరా గాంధీ విజ్ఞాన బహుమతిని అందుకున్నాడు. కొన్నాళ్ళు ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడి అక్టోబరు 2005లో మరణించాడు.

మహీధర నళినీమోహన్
జననం
మహీధర నళినీమోహన్

1933
మరణం21 అక్టోబరు 2005
మరణ కారణంమతిమరపు వ్యాధి
తల్లిదండ్రులు
మహీధర నళినీమోహన్

జీవితం

మార్చు

ఈయన 1933వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా ముంగండ గ్రామంలో జన్మించాడు. భారత స్వతంత్ర సమరంలో ఆయన కుటుంబం నుంచి ముగ్గురు కారాగారానికి వెళ్ళారు. ఆ ఇంట్లో మూడు తరాలుగా విప్లవ సాహిత్య చర్చలు జరుతుండేవి. పండితుల కుటుంబమే అయినా ఛాందసవాదాన్ని వెలివేసిన సాంప్రదాయం వారిది. 1953లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుండి బీయస్సీ పూర్తిచేసాడు. 1955లో ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి భౌతికశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తిచేసాడు. 1960-63 మధ్య మాస్కో విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాడు. 1969-71 మధ్య కాలంలో స్వీడన్లో అయనోస్ఫెరిక్ (అయనావరణ) అబ్జర్వేటరీలోని రాకెట్ పేలోడ్ నిర్మాణ విభాగంలో పరిశోధనలు చేసాడు. 1974-75 మధ్య కాలంలో బల్గేరియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్‌కు అతిధిగా వెళ్ళాడు. 1981-82లో ఇంగ్లండులోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వేల్స్‌లో పరిశోధన చేసాడు. తరువాత ఢిల్లీలోని జాతీయ భౌతిక పరిశోధనశాలలో అంతరిక్ష పరిశోధనలు చేసాడు.

పురస్కారాలు

మార్చు

ఈయన అందుకున్న బహుమతులు, పురస్కారాలు:

  • 1968, కవికోకిల దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతి
  • 1986, ఇందిరా గాంధీ విజ్ఞాన బహుమతి
  • 1986, ఆంధ్రజ్యోతి వీక్లీ వారి "తెలుగు వారిలో ప్రముఖ వ్యక్తి"
  • 1992, పిల్లలలో సంఘ భావాల వ్యాప్తికి NCSTC వారి జాతీయ అవార్డు
  • 1992, తెలుగు యూనివర్శటీ వారి బులుసు బుచ్చి సుబ్బరాయుడు ప్రతిభా పురస్కారం
  • 1994, నన్నపనేని మంగాదేవి బాల సాహిత్య పురస్కారం

పుస్తకాలు

మార్చు
వైజ్ఞానికం
  1. నిప్పు కథ
  2. టెలిగ్రాఫు కథ
  3. టెలిఫోను కథ
  4. పిడుగు దేవర కథ
  5. రాకెట్టు కథ
  6. గ్రహణాల కథ
  7. కేలెండర్ కథ, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజ్ఞాన్‌ భవన్‌, హైదరాబాదు - 500 001, 1981
  8. విద్యుత్తు కథ
  9. సింహాల కథ
  10. ఏనుగుల కథ
  11. ప్రపంచానికి ఆఖరు ఘడియలు
  12. వినోదం విజ్ఞానం
  13. జీవోత్పత్తి
  14. ఇతర లోకాల్లో ప్రాణులు
  15. సౌర శక్తికి సంకెళ్ళు
  16. ఆలోచించే యంత్రాలు (కంప్యూటర్లు)
  17. సుబ్బారాయుడి స్వప్నలోకం (సాపేక్ష సిద్ధాంతం)
  18. కొలతలూ తూనికలూ
  19. మన మహర్షుల సర్వజ్ఞత్వం (వ్యాసాలు)
  20. వేమన్న బంగారం చేశాడా? (వ్యాసాలు)
  21. సజీవ గణితం (అనువాదం)
  22. భారత దేశపు భౌతిక భూగోళం (అనువాదం)
  23. సృష్టి ఎలా జరిగింది?
  24. జ్యోతిర్గోళాలు (ఖగోళశాస్త్ర చరిత్ర)
  25. విచిత్ర సృష్టి
  26. ఆకాశంలో ఆశ్చర్యార్థకం (తోకచుక్కలు)
  27. గణితంతో గారడీలు
  28. గణితంతో గమ్మత్తులు
  29. మెదడుకి మేత
  30. మెదడుకి పదును
  31. సైన్సుతో సరదాలు
  32. సైన్సులో సందేహాలు
  33. చొప్పదంటు ప్రశ్నలు, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజ్ఞాన్‌ భవన్‌, హైదరాబాదు - 500 001, 1987
  34. ఎందుకో తెలుసా?
  35. కారణం ఏమిటి?
  36. భూదేవి బొమ్మ
  37. ఇంటింటా ప్రయోగశాల
  38. నక్షత్ర వీధుల్లో భారతీయుల పాత్ర, అవంతీ పబ్లికేషన్స్, 2-2-185/56/10 సోమసుందర నగర్, హైదరాబాదు - 500 013, 1997
పిల్లల కోసం
  1. మౌల్వీ నసీరుద్దీన్ కథలు (2 భాగాలు)
  2. వనసీమలలో (అడవి జంతువుల నవల - రష్యన్ భాష నుండి అనువాదం)
  3. పగ (చారిత్రక నవల, అనువాదం)
  4. కోతి తపస్సు (గేయకథలు)
  5. చదువుకున్న కాకి (గేయకథలు)
  6. మృగరాజు పెళ్ళి (గేయకథలు)
  7. మూషిక సేనాపతి (గేయకథలు)
  8. ఉడుత ఉద్యోగం (గేయకథలు)
  9. రుద్రాక్ష పిల్లి (గేయనాటికలు)
  10. దీని భావమేమి (పొడుపుకథల పద్యాలు)
  11. హమేషా-తమాషా
  12. తరతరాల కథలు
కవితలూ-వ్యాసాలూ
  1. పండితరాయల భావతరంగాలు
  2. భామినీవిలాసం (వెయ్యిశ్లోకాలకు సవ్యాఖ్యాన ఆంధ్రీకరణం)
  3. మహీధరోక్తులు (వ్యంగ్య హాస్య త్రిశతి)
  4. లంబోదరం (వ్యంగ్య హాస్య అధిక్షేప శతకం)
  5. ప్రతిపద్య శిరః కంపం (అన్యాపదేశ కవిత)
  6. అక్షయతుణీరం (కవితలు)
  7. నవ్వుల పుట్ట
  8. ప్రాచీన సాహిత్యం లో పకపకలు
  9. సరాసరి స్వర్గం నుంచి
  10. మాత్రా ఛందస్సులో మేఘసందేశం (కాళిదాసు రచనకి సవ్యాఖ్యాన ఆంధ్రీకరణం)
అముద్రితాలు
  1. విజ్ఞాన శిఖరాలు (వ్యాసాలు)
  2. విజ్ఞాన పవనాలు (వ్యాసాలు)
  3. నళినీ మోహన్‌ సైన్స్ క్విజ్‌
  4. ఆలోచించే యంత్రాలు (కంప్యూటర్ల కథ)
  5. సుబ్బారాయుడి స్వప్న లోకం (సాపేక్ష సిద్ధాంతం కథ)
  6. సృష్టి ఎలా జరిగింది?
  7. జ్యోతిర్గోళాలు
  8. ఆటం బాంబు కథ
  9. ఖగోళ పరిచయం
  10. భామినీ విలాసం (వెయ్యి శ్లోకాలకి నవ్యాఖాన ఆంధ్రీకరణ)
  11. ప్రతిపద్య శిరః కంపం (వ్యంగ్య హాస్య కవితలు)
  12. అక్షయ తూణీరం (వ్యంగ్య హాస్య కవితలు)
  13. వికట వేమన పద్యాలు (వ్యంగ్య హాస్య కవితలు)
  14. ముసిముసి నవ్వుల కథలు
  15. ప్రాచీన సాహిత్యంలో పకపకలు
  16. తరతరాల తప్పుడు భావాలు
  17. మహాకవుల ముచ్చట్లు
  18. సత్యం వధ, ధర్మం చెర (సెటైర్‌)
  19. పగ (చారిత్రక నవల, అనువాదం)
  20. చంద్ర విజయము (సరస శృంగార హాస్య మహా ప్రబంధము)
  21. భగ దండకము
  22. మదన శతకము
  23. చంద్ర శతకము
  24. మారుగేహ శతకము

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు