ముంజపర మహేంద్రబాయి గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో జూలై 2021 నుండి కేంద్ర మహిళ, శిశు సంక్షేమం, ఆయుష్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

డా. మహేంద్ర కలుభాయ్ ముంజపర

కేంద్ర మహిళ, శిశు సంక్షేమం శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు దేబశ్రీ చౌధురి

కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021

సురేంద్రనగర్ లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
నియోజకవర్గం సురేంద్రనగర్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1968-09-21) 1968 సెప్టెంబరు 21 (వయసు 55)[1]
సురేంద్రనగర్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి డా.భావనబెన్ ముంజపర
సంతానం 2 (కూతురు – ఆయుషి ముంజపర)

(కుమారుడు – ఆయుష్ ముంజపర)

నివాసం వాధ్వాన్,సురేంద్రనగర్
పూర్వ విద్యార్థి ఎన్.హెచ్.ఎల్ మెడికల్ కాలేజ్, అహ్మదాబాద్
వృత్తి వైద్యుడు & రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

డాక్టర్ మహేంద్ర కలుభాయ్ ముంజపర అహ్మదాబాద్‌లోని ఎన్‌హెచ్ఎల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి పేద ప్రజల కోసం రెగ్యులర్‌గా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశాడు.[3] ఆయన 2019లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి గుజరాత్‌లోని సురేంద్రనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 7 జూలై 2021 నుండి కేంద్ర మహిళ, శిశు సంక్షేమం, ఆయుష్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[4]

మూలాలు మార్చు

  1. Lok Sabha (2019). "Mahendrabhai Kalubhai Munjpara". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  2. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  3. Namasthe Telangana (7 July 2021). "మోదీ మంత్రివర్గంలో కొత్తగా నలుగురు డాక్టర్లు". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
  4. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.