మహ్మద్ హరీస్
మహ్మద్ హరీస్ (జననం 2001, మార్చి 30) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. 2022 జూన్ లో పాకిస్తాన్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ | 2001 మార్చి 30
మారుపేరు | మిస్టర్ గూగుల్[1] |
ఎత్తు | 5 అ. 4 అం. (163 cమీ.)[2] |
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ బౌలర్ |
పాత్ర | Middle-order batter |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
తొలి వన్‌డే (క్యాప్ 234) | 2022 జూన్ 8 - వెస్టిండీస్ తో |
చివరి వన్‌డే | 2023 మే 5 - న్యూజీలాండ్ తో |
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 29 |
తొలి T20I (క్యాప్ 99) | 2022 సెప్టెంబరు 30 - ఇంగ్లాండ్ తో |
చివరి T20I | 2023 మార్చి 27 - Afghanistan తో |
T20Iల్లో చొక్కా సంఖ్య. | 29 |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2020–present | Khyber Pakhtunkhwa (స్క్వాడ్ నం. 100) |
2021 | Karachi Kings |
2022-present | Peshawar Zalmi (స్క్వాడ్ నం. 29) |
2023–present | Sylhet Strikers |
మూలం: Cricinfo, 4 May 2023 |
తొలి జీవితం
మార్చుహారిస్ పెషావర్‌కు సమీపంలోని ముష్టర్జాయ్ అనే గ్రామంలో జన్మించాడు. పెషావర్‌లోని మజుల్లా ఖాన్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ నేర్చుకున్నాడు. ఆ తరువాత అండర్-19 జట్టుకు, ఒక సంవత్సరం తర్వాత అండర్-19 జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.[3]
2019 డిసెంబరులో 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[4]
దేశీయ క్రికెట్
మార్చు2020 అక్టోబరులో 2020–21 జాతీయ టీ20 కప్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[5]
2021 అక్టోబరులో శ్రీలంక పర్యటన కోసం పాకిస్తాన్ షాహీన్స్ జట్టులో ఎంపికయ్యాడు.[6] ఆ పర్యటనలో అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[7]
2021 జూన్ లో 2021 పిఎస్ఎల్ కోసం మినీ డ్రాఫ్ట్ తర్వాత కరాచీ కింగ్స్ స్క్వాడ్‌లో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు, కానీ ఏ మ్యాచ్‌ల్లోనూ ఆడలేదు.[8]
2021 డిసెంబరులో 2022 పిఎస్ఎల్ కోసం సప్లిమెంటరీ విభాగంలో ఆటగాళ్ల డ్రాఫ్ట్‌ను అనుసరించి పెషావర్ జల్మీ సంతకం చేశాడు.[9]
2020 ఫిబ్రవరిలో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో కరాచీ కింగ్స్‌తో తన పిఎస్ఎల్ అరంగేట్రం చేసాడు. 27 బంతుల్లో 49 పరుగులు చేసి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.[10]
అంతర్జాతీయ కెరీర్
మార్చు2021 సెప్టెంబరులో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే జట్టులో ఎంపికయ్యాడు.[11]
2022 ఫిబ్రవరిలో పిఎస్ఎల్ లో ఇతని ఆటతీరు కారణంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ రిజర్వ్ జాబితాలో చేర్చబడ్డాడు.[12]
2022 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వారి సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే, టీ20 స్క్వాడ్‌లలో ఎంపికయ్యాడు.[13]
2022 మేలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్ వన్డే జట్టులో అతను ఎంపికయ్యాడు.[14]
2022 జూన్ లో వెస్టిండీస్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు.[15]
2022 సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ కోసం పాకిస్థాన్ టీ20ఐ జట్టులో అతను ఎంపికయ్యాడు.[16] ఆ సిరీస్‌లో తన టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[17]
మూలాలు
మార్చు- ↑ "Pakistan's 'Mr Google' searching for final answer". Cricket.com.au. 11 September 2022. Retrieved 2023-09-02.
- ↑ Husain, Amir (20 September 2019). "Talent Spotter : Mohammad Haris". PakPassion. Retrieved 2023-09-02.
- ↑ G, Sandip (9 November 2022). "Mohammad Haris: A fearless six-hitter, Mr Google, Mohammad Yusuf lookalike". The Indian Express.
- ↑ "Pakistan squad for ICC U19 Cricket World Cup 2020 named". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
- ↑ "23rd Match, Rawalpindi, Oct 13 2020, National T20 Cup". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Pakistan Shaheens for Sri Lanka tour named". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
- ↑ "1st Unofficial Test, Pallekele, Oct 28 - 31 2021, Pakistan Shaheens tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Multan Sultans sign Shimron Hetmyer in PSL mini replacement draft". Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Franchises finalise squad for HBL PSL 2022". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
- ↑ "PZ vs KK (D/N), 19th match, PSL 2022". ESPNcricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Pakistan name 20-player ODI squad for New Zealand series". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
- ↑ "Update on Pakistan Test squad". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
- ↑ "Mohammad Haris, Asif Afridi in Pakistan white-ball squads for Australia series". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Fit-again Shadab back, Shafique and Zahid called up for Pakistan's ODIs against West Indies". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "1st ODI (D/N), Multan, June 08, 2022, West Indies tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Pakistan name squad for ICC Men's T20 World Cup 2022". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
- ↑ "6th T20I (N), Lahore, September 30, 2022, England tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 2023-09-02.