మహ్మద్ హుస్సాముద్దీన్

తెలంగాణకు చెందిన బాక్సర్.

మహ్మద్‌ హుస్సాముద్దీన్‌, తెలంగాణకు చెందిన బాక్సర్. 56 కిలోగ్రాముల విభాగంలో పోటీపడిన హుస్సాముద్దీన్[1] న్యూఢిల్లీలో జరిగిన తొలి ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు.[2]

మహ్మద్ హుస్సాముద్దీన్
మహ్మద్ హుస్సాముద్దీన్ (2022 ఆగస్టు)
వ్యక్తిగత సమాచారం
జననం (1994-02-12) 1994 ఫిబ్రవరి 12 (వయసు 30)
నిజామాబాదు, తెలంగాణ
ఎత్తు1.67 m (5 ft 5+12 in)
బరువు56 kg (123 lb)
క్రీడ
క్రీడBoxing
Rated atబాంటమ్ వెయిట్

జననం మార్చు

మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ 1994, ఫిబ్రవరి 12న తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు పట్టణంలో జన్మించాడు. తండ్రి బాక్సర్ సంసముద్దీన్‌, సోదరులైన అహ్తేషాముద్దీన్, ఐతేసాముద్దీన్, అంతర్జాతీయ బాక్సింగ్ ఈవెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.[3]

బాక్సింగ్ మార్చు

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో హుసాముద్దీన్ కాంస్యం కూడా గెలుచుకున్నాడు.[4] 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో, అతను పురుషుల 57కిలోల ఫెదర్‌వెయిట్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.[5]

57 కేజీల విభాగం ట్రయల్స్‌లో 2019 ఆసియా చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత కవీందర్‌ సింగ్‌పై విజయం సాధించి 2022 జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్‌ క్రీడలకు ఎంపికయ్యాడు.[6] ఆగస్టు 7న జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో పురుషుల 57 కిలోల ఫెదర్‌వెయిట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[7]

గౌరవాలు మార్చు

మూలాలు మార్చు

  1. Srinivasan, Kamesh (2018-02-01). "Satish tames Evans". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-08-23.
  2. Das, N. Jagannath (2018-02-03). "Nizamabad boxer Hussamuddin wants to emulate Phogat's feats". Telangana Today. Retrieved 2022-08-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Antony, A. Joseph (2017-03-31). "Hussamuddin — outshining his siblings". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-08-23.
  4. Shrikant, B. (2018-04-10). "Commonwealth Games: Boxers Hussamuddin and Manoj Kumar assured of medals". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2022-08-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "CWG 2022: Indian boxer Mohammed Hussamuddin claims bronze in Men's 57kg final". ThePrint (in ఇంగ్లీష్). 2022-08-07.
  6. "కామన్వెల్త్‌కు హుసాముద్దీన్‌". Sakshi. 2022-06-03. Retrieved 2022-08-23.
  7. "Commonwealth Games 2022: Mohammed Hussamuddin wins bronze in men's 57 kg featherweight boxing category". TimesNow (in ఇంగ్లీష్). Retrieved 2022-08-23.
  8. telugu, NT News (2022-08-23). "స్ఫూర్తిని పంచి.. కీర్తిని పెంచి!". Namasthe Telangana. Archived from the original on 2022-08-23. Retrieved 2022-08-23.